నా బ్లాగు సందర్శకులకందరికీ శ్రావణమాసం అద్భుతకానుక. లాటరీ లేదు..అదృష్టంకాదు. ఇంద్రజాలం, మోసం అసలే కాదు. ఈ శ్రావణమాసంలో అనుకోకుండా నాకు పట్టిన అదృష్టాన్ని మీ అందరికీ పంచుతున్నాను. ఆసక్తి వున్నవాళ్ళంతా అందుకోండి.
మొన్న 24, 25, 26 ఆగస్టు 2011న ఖాజీపేట మా పిన్ని శ్రీమతి సావిత్రీ మౌళి దగ్గరకు వెళ్ళాను. వెళ్ళినచోట వూరికే వుండరుకదా ఎవరూ. కొందరు సినిమాలు చూస్తారు, కొందరు బంధువులను పలకరిస్తారు, కొందరు షాపింగ్ చేస్తారు. నాలాంటివాళ్ళు చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల వేట. సరే అంతకుముందు పద్మాక్షీ దేవి దర్శనం కాలేదు కదా ఇవాళ వెళ్దామా అన్నది పిన్ని. ఇద్దరం వెళ్ళాము.
శ్రీ పద్మాక్షీదేవి
శ్రీ భద్రకాళీ దేవి


పద్మాక్షీ ఆలయం వివరాలు
అతి పురాతన కాలంలో వెలిసి, కాకతీయ రాజుల చరిత్రతో పెనవేసుకుని, ఓరుగల్లువాసుల వైభవ చిహ్నంగా వెలుగొందుతున్న పద్మాక్షీ దేవి ఆలయం చిన్న కొండమీద వున్నది. ఆఖరి శ్రావణశుక్రవారం కావటంతో భక్తులు బాగానే వస్తున్నారు. వాహనం ఆగిన ప్రదేశంనుంచి 52 మెట్లు ఎక్కాలి ఆలయం చేరుకోవటానికి. ఇది గుహాలయం. ప్రదక్షిణ మార్గం కొండలనడుమ ఆకర్షణీయంగా వుంటుంది. ఈ మార్గంలోనే అమ్మవారి పాదాలు వున్నాయి. ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేస్తారు. ప్రదక్షిణ పూర్తిచేసి ఆలయంలోపల విశాలమైన హాలు దాటితే లోపల గుహాలయంలో అమ్మ కొలువైవుంది. ఇక్కడ జైన తీర్ధంకరుల విగ్రహాలుకూడా కనువిందు చేస్తాయి. దానికి కారణం కాకతీయ రాజుల మంత్రులలో ఒకరు జైన మతస్ధులని, వారి సమయంలో ఆలయంలో ఆ విగ్రహాలు చెక్కబడ్డవని అంటారు. ఆ ఫోటోలు కూడా మీకోసం….(పద్మాక్షీదేవి ఆలయం, భద్రకాళి ఆలయాలగురించి ఇదివరకు పోస్టులు వ్రాశాను. అయితే నేను చూడని కారణంగా పద్మాక్షీ ఆలయం ఫోటోలు, చీకటిలో వెళ్ళటంవల్ల భద్రకాళి ఆలయం ఫోటోలు తియ్యలేదు. అందుకే ఇప్పుడు ఆ ఫోటోలు మీకోసం.)
శ్రీ పద్మాక్షీ ఆలయ దృశ్యాలు
శ్రీ పద్మాక్షీ ఆలయ సోపానాలు
ఆలయ ప్రదక్షిణ మార్గము

ప్రదక్షిణ మార్గములో అమ్మవారి పాదాలు

ఆలయంలో జైన విగ్రహం
శ్రీ పద్మాక్షీ దేవి గర్భగుడి
శ్రీ భద్రకాళీ ఆలయ దృశ్యాలు
శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఒడిబియ్యం పెడుతున్న దృశ్యం
