Sunday, July 15, 2012

నంబి నారాయణ ఆలయం, తొండనూరు
నంబి నారాయణ ఆలయం, తొండనూరు
మద్దూరు నుంచి తొండనూరు చేరుకున్నాము.
పాండవపుర తాలూకాలోని వూరి పూర్వ నామధేయం కిరై తొండూరు. తొండనూరు అంటే చాలామంది చెప్పలేకపోయారుచివరికి ఒకరు ఈ  పాత పేరు చెప్పి దోవ చెప్పారు విశిష్టాద్వైత మత ప్రచారకుడు శ్రీ రామానుజులు వూర్వం ఇక్కడ చాలాకాలం నివసించి, తన మత ప్రచారాన్ని ఇక్కడనుంచే కొనసాగించారుఆయన ఇక్కడ ఎన్నో మహిమలను చూపించారుఆ కాలంలో హొయసాల రాజైన బిట్టి దేవర జైన మతస్తుడుఆయన కూతురికి దయ్యం పట్టి  ఎన్ని రకాల  వైద్యులకి చూపించినా నయంకాక తల్లడిల్లుతున్న సమయంలో శ్రీ రామానుజులు  చిటికెలో నయం చేశారుశ్రీ రామానుజులవారి తేజోస్వరూపానికి,  ఆయన బోధలు, మహిమలకు ఆకర్షితులైన బిట్టిదేవర తన భార్యతోసహా వైష్ణవ మతం తీసుకుని విష్ణువర్ధనుడయ్యాడు.

ఆ సమయంలో విష్ణువర్ధనునిచే నిర్మింపబడిన ఈ ఆలయం బేలూరులోని చెన్నకేశవాలయంలాగానే వుంటుందివెయ్యి సంవత్సరాలపైన చరిత్రగల ఈ ఆలయం లోపు కళాత్మకంగా తీర్చి దిద్దబడ్డ స్ధంబాలు బేలూరు ఆలయాన్ని పోలి వుంటాయిఈ ఆలయంలో నాలుగు స్తంబాలు అమరశిల్పి జక్కన్న చెక్కినవంటారుశ్రీ రామానుజాచార్యులవారు తొండనూరులో ఒక సుందర తటాకం కూడా నిర్మించారుఈ తటాకంలో నీరు ఎప్పుడూ ఎండి పోదుచాలా స్వఛ్ఛంగా వుంటుందికూడా.   ఒకసారి టిప్పుసుల్తాన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మెడలోని ముత్యాల హారం తెగి ముత్యాలు నీటిలో పడ్డాయిటఆ ముత్యాలను పైనున్నవారు స్పష్టంగా చూడగలిగారుటఅందుకే టిప్పు సుల్తాను ఈ తటాకాన్ని మోతీ తలాబ్ అని పిలిచారు.

ఈ ఆలయంలో నంబి నారాయణుని విగ్రహం 18 అడుగుల ఎత్తు వుంటుందిశ్రీ రామానుజుడు ప్రతిష్టించిన ఈ నారాయణుడు చతుర్భుజుడై,   శంఖం, చక్రం, గద, పద్మాలతో అలరారుతున్నాడునంబి అంటే నమ్మకంనమ్మి కొలిచేవారిని రక్షించే నారాయణుడు. అమ్మ అరవిందనాయకిఇక్కడ శ్రీ రామానుజులవారు తపస్సు చేసిన ప్రదేశంలో పాదాలు, శంఖం, చక్రం, నామాలు వున్నాయి

 గర్భగుడి ముందు మండపంలో ఉపాలయాలలో విష్వక్సేనుడు, రామానుజుడి శిష్యుడు తొండనూరు నంబి, ఇంకా ఇతర ఆళ్వారుల విగ్రహాలు వున్నాయిసువిశాలమైన ఆలయం, పెద్ద పెద్ద స్తంబాలతో విరాజిల్లుతోందిప్రహరీ కోట గోడలా వున్నది.

మేము వెళ్ళినప్పుడు కరెంటు లేదుమేము ఆలయం బయటకురాగానే అక్కడవున్న ఒక వ్యక్తి ఒక పెద్ద అద్దం తీసుకుని లోపలకి ఫోకస్ చేసి మమ్మల్ని పిలిచి చూపించాడుఎంత అద్భుతమైన దృశ్యమదిచుట్టూ చీకటి..స్వామి మూర్తి అద్దం ఫోకస్ లో వెలిగిపోతోందిస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యారా అన్నట్లుంది ఆ దృశ్యం.

ఈ ఆలయం ఫోటోలు కావాలంటే శ్రీరంగపట్నంనుంచి పర్మిషన్ తెచ్చుకోవాలిఅది లేకుండా ఫోటోలు తియ్యనియ్యరుఅందుకే బయటనుంచి తీసిన ఫోటో మాత్రమే ఇవ్వగలుగుతున్నాను.

దర్శన సమయాలు  ఉదయం 9-30 నుంచి సాయంత్రం 5-30 దాకా.