Friday, March 20, 2009

ద్వారపూడి

ప్రకృతి సౌందర్యంలో అందాల నంది విగ్రహం
మూడంతస్తుల శివాలయం, ఎదురుగా నంది

సాయిబాబా దేవాలయం

అయ్యప్ప దేవాలయం

అయ్యప్ప దేవాలయం పై అంతస్తు

దేవాలయం ముందు హరి హరుడు

ద్వారపూడి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కి.మీ. ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే తోవలో వున్న ఈ ఊళ్ళో 10 సంవత్సరాల క్రింతం కట్టబడిన అయ్యప్ప దేవాలయంతోబాటు, సాయిబాబా, శివాలయాలు కూడా వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు చూపరులను అమితంగా ఆకర్షిస్తాయి.

అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి. పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు.

అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది. బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న వెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది. ఆస్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా మూడు అతస్తుల శివాలయం వున్నది. ఇక్కడి శివ లింగం చాలా పొడుగ్గా 3 వ అంతస్తు దాకా వుంటుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి. శివాలయం ముందు పెద్ద ఆంజనేయస్వామి, నటరాజు విగ్రహాలున్నాయి.

అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీపడుతూ ఆకర్షణీయంగా వున్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసినదే.

6 comments:

పరిమళం said...

లక్ష్మి గారూ ! ద్వారపూడి గుడులు నాకు బాగా తెలిసినవే అయినా మీ బ్లాగ్ లో ఫోటోలు మరింత అందంగా ...ఆత్మీయత భావాన్ని కలుగ చేస్తున్నాయి . మాది తూర్పు గోదావరి జిల్లాయే నండీ .

psmlakshmiblogspotcom said...

పరిమళంగారూ, మీ వ్యాఖ్యలు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ధన్యవాదాలు
psmlakshmi

బొల్లోజు బాబా said...

lakshmi gariki
ఊరి పేరు ద్వారపూడి. సవరించగలరు.

అదే విధంగా యానాం లో ఉండే ఒక గుడిపేరు పోలేరమ్మ గుడి, పోచమ్మ గుడికాదు.
అన్యధా భావించరనే
బొల్లోజు బాబా

psmlakshmiblogspotcom said...

మీరు ఆ ప్రాంతంవారు కాబట్టి మీకు సరైన సమాచారం తెలుస్తుంది. మేము మాకు పరిచయమైన మనుషులు, ఆ సమయంలో మేము సేకరించిన వివరాలే ఇవ్వగలం. నేను తప్పు వ్రాసినప్పుడు మీలాంటివరెవరైనా సరి చేసినా, ఇంకా ఎక్కువ సమాచారం ఇచ్చినా సంతోషిస్తాను కానీ ఏమీ అనుకోను. నిస్సందేహంగా సహకరించండి.
ధన్యవాదాలు
psmlakshmi

రసజ్ఞ said...

మాది రాజమండ్రీ కావున ముందుగా మీ తూర్పు గోదావరి జిల్లా యాత్ర అంతా చూశాను. వీలుంటే ర్యాలి, అంతర్వేది, అప్పనపల్లి, కోరుకొండ మొదలయినవి కూడా పరిచయం చేయగలరు.

psm.lakshmi said...

తప్పకుండా రసజ్ఞగారూ, మీ ఆసక్తికి ధన్యవాదాలు
psmlakshmi