యాత్ర కొనసాగుతోంది
అవునండీ, యాత్ర కొనసాగుతోంది. ఇది చెప్పటానికి ఇంత ఆలస్యమయిన కారణం కేవలం నా అనారోగ్యమే.
సెప్టెంబరు నెలాఖరు లోపల యాత్ర కొనసాగించాలా వద్దా అనే పోస్టు చూసిన నా శ్రేయోభిలాషులు 600 మంది పైనే అనే విషయమే నా బ్లాగుకి విలువనిచ్చింది. 10-10-2009 ఈనాడులోవచ్చిన మహిళా బ్లాగుల అభివృధ్ధి వ్యాసంలో నా బ్లాగు గురించి కూడా చెప్పబడింది. ఆ వ్యాసం ద్వారా నా బ్లాగుకి విచ్చేసిన యాత్రీకులు 700 పైనే. కొత్త ప్రదేశాలను గురించి తెలుసుకోవటానికి వచ్చే ఇంతమందిని నిరాశపరచటం ఇష్టంలేకపోయింది. అందుకే వ్యక్తిగత కోపతాపాలు పక్కన పెట్టి, ఆ భగవంతుడు శక్తి ఇచ్చినంతమటుకూ తిరిగి నా బ్లాగు ద్వారా మిమ్మల్ని యాత్రలకి తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నాను.
ఎందరో శ్రేయోభిలాషులు ఈ పని ఇదివరకే చెయ్యమని నా బ్లాగులో, మైల్ లో కామెంట్ల ద్వారా ప్రోత్సహించారు. అందరికీ ధన్యవాదాలు. ఏ బ్లాగరయినా, ఏ కారణం వల్లనయినా కొంచెం వెనుకడుగు వేసేటప్పుడు ఇలాంటి ధైర్యం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. అందుకే విడప్పుడు కామెంటు చేసినా చెయ్యకపోయినా ఇలాంటి సమయాల్లోమాత్రం తప్పనిసరిగా మీ విలువైన అభిప్రాయాలను తెలియచెయ్యండి.
బ్లాగులో టెక్నికల్ గడబిడలవల్ల ఫాలోయర్స్ అందరికీ కోపం వచ్చి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ కొందరు కొత్తగా వచ్చారు. వారి ప్రోత్సాహానికి శతకోటి వందనాలు.
ఇదండీ వరస
12 years ago
6 comments:
లక్ష్మిగారు , మంచి నిర్ణయం ! నేను కొద్ది రోజులుగా నెట్ కి దూరంగా ఉండటం వల్ల "యాత్ర కొనసాగించాలా వద్దా" పోస్ట్ చదవలేదు ....చదివాక ఇంత ఆవేదనలోనూ అందరికీ ఉపయోగ పడేలా తక్కువ ఖర్చుతో యాత్రలు చేయటానికి చక్కటి టిప్స్ ఇచ్చినందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను . మీ యాత్ర నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటున్నవారిలో నేనూ ఉన్నానండీ ....ఆల్ ది బెస్ట్ !
Best of Luck...
అయ్యో,లక్ష్మి గారూ, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా వుంది?
నిజంగ, ఇంతకాలం మీ బ్లాగ్ చూడకపోవటం నా దురద్రుష్టం. ఇకనుంచి తప్పకుండా ఫాలో అవుతాను. ఉద్యొగం వల్ల ఎక్కువగా ఎక్కడికీ పోలేక పోతున్నాను. అప్పుడప్పుడు ఏవో, కొన్ని ప్రాంతాలు మాత్రమే చూడగలిగాను. పోయిన మే నెలలో మా ఫ్రెండ్స్ తో కలిసి 'చార్ ధాం " అదేనండి, యమునోత్రి, గంగోత్రి, కేదారినాధ్, బదరినాధ్, హరిద్వార్, రిషికేష్ తో సహా కలిపి వెల్లొచ్హాను. అప్పుడనుభవించిన ఆ ఆనదం నేను చెప్పలేను.ఆ ప్రపంచమే వేరు. పూర్తిగ స్వర్గ లోకంలో విహరించిన ఆ త్రుప్తి ఎలా మరచిపోగలను. వీలు చూసుకొని తప్పకుండా ఆ అనుభవాలు రాయాలనుకుంటున్నాను. యాత్రలలో ఆనందం నాకు తెలుసు. మీరు తప్పకుండా మీ అనుభవాలు ఎప్పటికప్పుడు తెలియ చేస్తునే ఉండాలని నా కోరిక. Kindly don't stop writing.
అమ్మయ్య ! వచ్చేసారు కదా ? కోపం తో రావటము లేదా అనుకున్నాను.
ఇప్పుడెలా వున్నారు ?
పరిమళం, జ్యోతి, సుజాత, జయ, మాలా కుమార్
ధన్యవాదాలు. ఏమిటో అనేక భవసాగరాలతోపాటు కొంచెం బి.పీ కూడా కంగారు పెట్టింది. అన్నింటితో బ్లాగు వైరాగ్యం వచ్చేసింది..అంటే ఏమీ రాయాలనీ, చదవాలనీ అిపించలేదు.
psmlakshmi
Post a Comment