Tuesday, October 13, 2009

ఖిల్లా రఘునాధాలయం, ఇందూరు

కొండపైన కోటలోన ఆలయ దృశ్యం
శ్రీ దాశరధి రంగాచార్యని బంధించిన ప్రదేశం

ఆంజనేయస్వామి ఆలయ ద్వారాలు


ఖిల్లా రఘునాధాలయం, ఇందూరు

ఈ ఆలయం నిజామాబాదు శివారులో కొండపైన కోటలో వున్నది కొండపైకి కారు వెళ్తుంది. రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిధ్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీ.శ. 914-928 మధ్య ఈ కోటని నిర్మించాడు. ఛత్రపతి శివాజీ గురువైన శ్రీ సమర్ధ రామదాస్ జీ ఈ ఆలయాన్ని నిర్మింప చేశారు. అతి పురాతనమైన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. దీని ప్రక్కనే బొడ్డెమ్మ చెరువు.




రఘునాధుడనే మహర్షి ఈ ఖిల్లాలోవున్న సొరంగ మార్గం ద్వారా బొడ్డెమ్మ చెరువు లో వున్న శిలా కట్టడందాకా వెళ్ళి స్నానం చేసి వచ్చేవారని పలు కధనాలు. కోటలో వున్న ఈ మహర్షి ధ్యాన మందిరం కట్టడంలోనే విశిష్టమైన వెంటిలేషన్ సౌకర్యంతో చల్లగా వుంటుంది. ఇక్కడనుంచి డిచ్ పల్లి, సారంగపూర్ కి కూడా సొరంగాలు వున్నాయట.

ఇక్కడ శ్రీ రఘునాధ ఆలయంలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ సీతారామస్వామి విగ్రహాలు భద్రాచలంలో విగ్రహాలను పోలి వుంటాయి. 2002 సం. దాకా ఈ గుడి మూసి వుండేదట. ఏడాదికొకసారి మాత్రమే తీసి స్వామి కళ్యాణం జరిపించేవారుట. 2002 సం. నుంచి చిన్న జియ్యరు స్వామి నిత్య పూజలు పునఃప్రారంభించారు,

తెలంగాణా స్వాతంత్ర్య పోరాటంలో శ్రీ దాశరధి రంగాచార్యగారు బంధింపబడిన జైలుని ఈ రామాలయం ముందు చూడవచ్చు.

ఈ కోటలోకి వెళ్ళే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయంవుంది. ఈ ఆలయంముందు పెద్ద బండరాళ్ళు కోట గోడల్లా నిలిచి వుండి దర్శకులకు దుర్భేద్యమయిన కోటలోకి ప్రవేశిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.








2 comments:

జయ said...

ఫొటోలు చాలా బాగున్నాయండి. ఇంతపెద్ద ఆలయాన్ని మూసివేసి సంవత్సరానికొకసారి మాత్రమే తెరిచే వాళ్ళా! కారణం ఏమిటి? దాశరధిని ఇక్కడ బంధించారంటే కూడా అశ్చర్యంగానే ఉంది. మంచి వివరాలు ఇచ్హారు.

psm.lakshmi said...

కదా. మనకు తెలియని ఎన్ని విషయాలు మన చుట్టుప్రక్కలో వున్నాయో చూడండి. ఈ విశేషాలు మాకూ అక్కడికి వెళ్తేనే తెలిశాయి. తెలంగాణా పోరాటం సమయంలో దాశరధిగారిన బంధించారు ఇక్కడ. ఆలయం ఇదివరకు ఏడాదికొకసారి తెరవటానికి కారణం సరైన పోషకులు లేక శ్రీ చిన్న జియర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు నిత్య పూజలు జరుగుతున్నాయి.
psmlakshmi