Friday, July 16, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 12 - ప్రయాగ



మాధవేశ్వరీ దేవి మందిరం

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనశ్రీ మాధవేశ్వరీ దేవి మందిరం ప్రయాగలోనే వుంది.  ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.

ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవి అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకోవటం, ఆవిడని ఎత్తుకుని శంకరుడు ఉగ్రతాండవం చేయటం, ఆయనని శాంతింపచేయటానికి విష్ణుమూర్తి పార్వతీ దేవి శరీరాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు చెయ్యటం, అవి 18 ముక్కలుగా దేశంలో వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా ఖ్యాతి చెందటం మీకు తెలుసుకదా. 

ఇక్కడ అమ్మవారి ముంజేయి పడ్డది.  ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు.  ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది.  దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసినట్లుంటుంది.  దానికింద ఒక ఉయ్యాల.  భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి.

అమ్మవారి విగ్రహం లేకపోవటంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి వుండకపోయినా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠాన్ని దర్శించామన్న ఆనందంతో అక్కడనుండి బయల్దేరాము.
 మాధవేశ్వరీదేవి మందిరం
పార్వతీదేవి ముంజేయి తెగి పడుతున్న దృశ్యం

2 comments:

Anonymous said...

ఆత్మాహుతి ఐన పార్వతి శరీరాన్ని శంకరుడు మోయడం, అగ్నికి ఆహుతైన శరీరాన్ని విష్ణువు చక్రం తో ఖండించడం ఎక్కడో కథలో లింకు తెగింది. పార్వతి దేవత(అమరులు)కాదా?

psm.lakshmi said...

లింకులు తెగలేదండీ. సాధారణంగా చెప్పబడే కధ ఇదే. అయితే ఎక్కడో చదివాను, (అప్పటికి ఈ బ్లాగులేదు, అందుకే రాసుకోలేదు) సతీదేవి సూక్ష్మ శరీరాన్ని ఎత్తుకుని నాట్యం చేశాడని. మనలాంటివారికోసమే అక్కడి ఆలయంలోని ఫోటో కూడా ఇచ్చాను.
psmlakshmi