Friday, October 8, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 18


 బుధ్ధ గయ
గయనుంచి 12 కి.మీ. దూరంలో వున్న బుధ్ధగయ చేరుకున్నాము.  ఇక్కడే సిధ్ధార్ధుడికి జ్ఞానోదయమైంది.  భారత దేశంలో బౌధ్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలు నాలుగు వున్నాయి.  అవి గౌతమ బుధ్ధుడు జన్మించిన లుంబినీవనం, బుధ్ధునికి జ్ఞానోదయమైన బుధ్ధ గయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాధ్,  చివరిది ఉత్తర ప్రదేశ్ లోని కుషినారా.  బుధ్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమిది.

500 బి.సి. లో సిధ్ధార్ధుడు జ్ఞానాన్వేషణలో తిరుగుతూ గయ సమీపంలోని  ఒక వృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు.  మూడు రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది.  తర్వాత ఆయన అక్కడ ఏడు వివిధ ప్రదేశాలలో ఏడు వారాలు ధ్యానంలో గడిపారు.  తరువాత ఆయన సారనాధ్ చేరి తన మొదటి ప్రవచనం చేశారు.

బుధ్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుని గౌతమ బుధ్ధుని శిష్యులు  వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చేవారు.  కాలక్రమంలో ఈ ప్రదేశం బుధ్ధ గయగా, వైశాఖ పౌర్ణమి బుధ్ధ పౌర్ణమిగా పేరుపొందాయి.  కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ బౌధ్ధమతం విలసిల్లింది.

బుధ్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ళ తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు  ఆయన గురువైన ఉప గుప్తుడు ఆయనని బౌధ్ధక్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటి అని చెబుతారు.  ఇక్కడ మొదట ఆలయం నిర్మించినది కూడా అశోక చక్రవర్తే.

ప్రస్తుతం వున్న బోధి వృక్షం బుధ్ధుడి సమయంలో వున్న వృక్షంనుంచి వచ్చిదేనంటారు.  అశోక చక్రవర్తి పరిపాలనలో  బుధ్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు.  తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకువచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు.

బోధివృక్షం క్రింద బుధ్ధుడి విగ్రహం వుంటుంది.  ఇక్కడే ఆయన తపస్సు చేసింది.

ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలున్నాయి.

ధాయ్ వారి కట్టడం ప్రక్కనే ఉద్యానవనంలో 25 మీటర్ల ఎత్తయిన బుధ్ధుని విగ్రహం యాత్రీకులను ఆకర్షిస్తుంది.

7 వ శతాబ్దంలో భారత దేశ యాత్ర చేసిన చైనా యాత్రీకుడు హుయాన్ స్వాంగ్ తన గ్రంధంలో బుధ్ధగయ గురించి రచించాడు.
 బుధ్ధుడి ఆలయం
 ఆలయంలో బుధ్ధుడు
బోధి వృక్షం
 టిబెట్ వారి కట్టడం
 25 మీ, ఎత్తైన బుధ్ధుడి విగ్రహం


5 comments:

భావన said...

చాలా బాగా ఇచ్చారండి వివరాలు. మేము ఎక్కడికి వెళ్ళాలనా మీ బ్లాగ్ ఓపెన్ చేస్తే చాలు. very good guide and informative. Thanks andi.

voleti said...

మేము కూడా చాలా ఏళ్ళ క్రితం బౌద్ధ గయ వెళ్ళాం. ఆ రోజు ఊరంతా కరెంట్ లేదు. "ఎన్నాళ్ళయి కరెంటు లేదు" అని అడిగితే, సుమారు నెల నుండి అన్నరు. ఎప్పుడొస్తుంది అని అడిగితే "భగవాన్ కో మాలూమ్ హై" అన్నారు. చీకట్లో, దోమల్తో చాలా ఇబ్బంది పడ్డాం.. అప్పుడు బీహార్ సి.ఎమ్ = ది గ్రేట్ లల్లూ ప్రసాద్ యాదవ్. కాని బుద్ద గయ చూసిన ఆనందంలో ..మా కష్టాలన్నీ మర్చి పోయాం.

psm.lakshmi said...

thank you bhavana.

నిజంగా ఓలేటిగారూ
మేమున్న కొంచెం సేపులోనే బీహార్ కన్నా ఎ పి ఎంతో బాగుంది అనుకున్నాము.
psmlakshmi

శ్రీనివాస్ said...

amma(shall i call like dis)......
i like ur enthusiasm on travelling.first time i saw ur posting on @swapna.i also love to see different places.without seeing Ap or india...wat is the use of our birth in india.every one born&died..wats the use??? Life is not only for hunting money...between that so much is there.even i am in starting stage of life...i am going to do job.but...from now only i am planning to see all places.i dont like in future my kid mugs kutubminar in delhi and charminar in hyd.when i was child ...i had so much confusion.i dont want this for my kids.i am sincerly appreciating ur efforts.today onwards,i also follow ur blog n i want see all places which u mentioned.coming to swapna-kalalaprapancham, she is a little kid.i also follow her blog.dont take her comments to heart.little kid is always kid,many times they entertain us but some times they may hurt us.take this very lite.there is no need to comment on her issue.simply this is time waste.thank u.ALL THE BEST FOR UR FUTURE TRIP.(recently,i saw ur post on swapna n typed this feed back.dongalu padina aaru nelalaku....sameta laaga aindi.any have, i just copy n paste my comment here.)once again,thanq 4 maintaining such a nice blog.

psm.lakshmi said...

thank you srinivas.
psmlakshmi