Wednesday, June 4, 2008

పానగల్లు, నల్గొండ,నల్గొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయము, పానగల్లు



ఈ దేవాలయాన్ని 9 వ శతాబ్దములో కాకతీయ రాజుల సామంతులైన చోళ రాజులు కట్టించారుట. చూడదగ్గ ఆలయం.


పచ్చల సోమేశ్వరాలయం, పానగల్లు

వెంకటేశ్వరస్వామి దేవాలయానికి అతి దగ్గరలో వున్నది ఈ ఆలయం.
పానగల్లు పట్టణం క్రీ. శ. 11--12 శతాబ్దాలలో కందూరు చోళ రాజుల రాజధానిగా వుండేదట. వీరే ఈ ఆలయాలను నిర్మించారుట. వీరు కాకతీయుల సామంత రాజులు. నల్ల శానపు రాళ్ల మీద రమ్యంగా మలచిన శిల్పాలు ఈ ఆలయాల మధ్య యుగ వాస్తు శిల్ప సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. తూర్పువైపున ఒకటి, పశ్చిమం వైపు మూడు
ఆలయాలను కలుపుతూ 70 స్థంబాలతో ఒక మహా మండపం నిర్మించబడ్డది. ఆలయాల గోడలపైన మండపం స్థంబాలపైన చెక్కిన శివ, అష్టదిక్పాలకుల శిల్పాలు, భారత రామాయణ గాధలు, సమకాలీన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఆలయాల బయట గోడలపైన చెక్కిన వినాయక, కుమారస్వామి, మహిషాసురమర్దిని, మొదలగు అనేక సుందర శిల్పాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని తెలియచేస్తున్నాయి.









ఊరికి వుత్తరాన గల ఉదయసముద్రం అనే చెరువును క్రీ.శ. 1124 లో ఉదయన చోడుడు తవ్వించాడు.
పట్టణ ప్రజలకు పంట పొలాలకు నీరు అందించిన ఈ చెరువు ఆనాటి పాలకుల ప్రజా సంక్షేమ పధకాలకు ప్రతీకగా నేటికి నిలిచి వున్నది.

ఆలయం గర్భగుడి పూజ అనంతరం కటకటాలతో మూసివుంటుంది. పగలు ఏ సమయం లోనైన దర్శనం చేసుకోవచ్చు.

ఇక్కడ ఆర్కియోలాజికల్ డిపార్టుమెంటు వారు నిర్వహిస్తున్న మ్యూజియం కూడా వున్నది.

0 comments: