ముక్కంటేశ్వరాలయం (త్రికూటాలయం)
ముక్కంటేశ్వరాలయం లో శిల్పకళ
త్రికూటాలయం
నామేశ్వరాలయం
నామేశ్వరాలయం
నామేశ్వరాలయం
త్రికూటాలయం లో శాసనం
హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళే దోవలో సూర్యాపేట కి మూడు కిలో మీటర్ల ఇవతల (ఏ. పీ. టూరిజం వాళ్ల హోటల్ హరిత కి ఇవతల) ఎడమ వైపు దోవలో కొంత దూరం లోపలకి వెళ్ళాలి. ఈ వూరిలో మూడు దేవాలయాలు వున్నాయి. అవి
నామేశ్వరాలయం:
క్రీ. శ. 1202 లో నిర్మించిన ఆలయం ఇది. భూ గర్భం లో మార్పుల వల్ల కాబోలు ఆలయం ఒక పక్కకు ఒరిగినట్లు వుంటుంది. స్థంబాలమీద శిల్పకళ చాల బాగున్నది. గుడి పొద్దున్న పది గంటలకి తెరుస్తారు. గర్భగుడి మూసే వుంటుంది. గ్రిల్ లో నించే దైవ దర్శనం. ఇంత అందమైన గుడి కి ప్రజల ఆదరణ గాని ప్రభుత్వ ఆదరణ గాని కనబడటంలేదు. గుడి గురించి తెలిపే5 బోర్డ్లు కూడా శిధిలమై కింద పడి వున్నాయి.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం:
ఇక్కడ పూజరిగారు చెప్పినదాని బట్టి ఈ దేవాలయము కూడా చాల పురాతనమైనది. ఈ ఆలయ స్థంభాలన్నీ రాయి మీద రాయి పేర్చి కట్టినవేగాని ఇప్పటి భవనాలమల్లె punaadulato1 కట్టినవి . బండలు ఒక దాని మీద ఒకటి ఎక్కించటానికి ఇసుకను కుప్పగా పోసి దాని మీద నించి ఏనుగులతో లాగించారుట.
త్రికూటాలయం:
క్రీ. శ. 1195 లో ఈ ఆలయ నిర్మాణము జరిగినది. అప్పటి రాజు బేతిరెడ్డి నామిరెడ్డి అంగ, వంగ, కళింగ దేశములనుంచి శిల్పులను రప్పించి శివాలయాల నిర్మాణము చేపట్టెను. త్రికూటాలయమునన్దు ముక్కంటేశ్వర దేవర ప్రతిష్ట చేసినట్లు ప్రచారము. క్రీ. శ. 1202 లో శ్రీ నామేశ్వర దేవర ప్రతిష్ఠ చేసి సమస్త పూజార్ధమై భూములు దానమొసంగెను. రేచెర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ గారు క్రీ. శ. 1208 లో ఎరకేశ్వర దేవర ప్రతిష్ఠ గావించి స్వామివారి పూజార్ధమై భూములను దానమొసంగెను. వివరములు శాసనమునందు వ్రాయబడినవి.
నామేశ్వరాలయం
నామేశ్వరాలయం
త్రికూటాలయం లో శాసనం
పిల్లలమర్రి, నల్గొండ డిస్ట్రిక్ట్

0 comments:
Post a Comment