నవగ్రహాల గుడులు
పంచముఖ ఆంజనేయస్వామి
పంచముఖ ఆంజనేయస్వామి
ఆలయ బయట దృశ్యం
సురేంద్రపురి
హైదరాబాదుకి 60 కి.మీ. ల దూరంలో యాదగిరిగుట్టకి కొంచెం ఇవతలే కనబడే సురేంద్రపురి లో ఎత్తైన శివ, ఆంజనేయస్వామి, గాయత్రీ దేవి విగ్రహాలు, పూర్ణకలశం చూపరులను ఆకట్టుకుని ముందుకి కదలనివ్వవు. ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ పంచముఖ ఆంజనేయుస్వామి, నేపాల్ పశుపతినాధస్వామిని బోలిన శ్రీ పంచముఖ పరమేశ్వరుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వార్లు ఒకే మహా మండపంలో మూడు ఆలయాలలో కొలువుదీరిన ఆలయమిది.
అంతేగాకప్రపంచంలో ప్రప్రధమంగా అధిదేవత, ప్రత్యధిదేవత, వాహన, సతీ సమేతముగా విడి విడిగా నవగ్రహ ఆలయాలు ప్రతిష్ఠింపబడి ప్రత్యేక పూజలు నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ గ్రహ దోష నివారణార్ధం పూజలు కూడా చేస్తారు.
ఇక్కడి ఇంకో ఆకర్షణ ఆలయం ప్రక్కనేవున్న కుందా సత్యన్నారయణ కళాక్షేత్రము. దీని ప్రవేశరుసుం 100 రూ. దర్శన సమయం కనీసం రెండుగంటలు పడుతుంది. ఇందులో బాలభారతం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, నరకలోకం, పాతాళలోకం, మణిద్వీపం, హనుమంతుని చరిత్ర,, ఇంకా అనేక దేవతామూర్తులేకాక, రామాయణ, భారత, భగవద్గీత లో ఘట్టాలు, పద్మవ్యూహం కూడా .... అన్నీ బొమ్మలతో నిర్మంపబడి చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఇంకా కొన్ని ఘట్టాలు నిర్మాణంలో వున్నాయి.

4 comments:
మంచి సమాచారం అందించారు. పద్మవ్యూహం ఇంకా కట్టడం పూర్తవ్వలేదని విన్నాను... ఇప్పుడు చూడటానికి అనుమతి ఇస్తున్నారా??
ఈ మధ్యనే తెరిటారుట. ఇప్పుడు అనుమతి ఇస్తున్నారు. చూడటానికి కనీసం రెండు గంటలు పడుతుంది. మనిషికి 100 రూ. టికెట్. బహుశా సాయంత్రం 6గం. లకి కట్టేస్తారు. ఇంకా కొత్తవి కూడా కడుతున్నారు.
psmlakshmi
అధి దేవత అంటే ఎవరు? ప్రత్యధి దేవత అంటే ఎవరు? ఎవరు గొప్ప? యజ్ఞము చేసేటప్పుడు ఈ పదాలు వస్తాయి కదా వివరించగలరా
రామ్ గారూ
మీ ప్రశ్నకి జవాబిచ్చేంత విజ్ఞత వున్నదాన్ని కాదు. అందుకే మిత్రులు శ్రీ నెమ్మలూరి మోహన్ కిషోర్ గారిద్వారా తెలుసుకున్న ఈ కింది విషయం మీకందిస్తున్నా...
అధి దేవతా, ప్రత్యధిదేవతా అనేవి, సాధారణముగా నవగ్రహ సూక్తములో చూస్తాము. ప్రతీ గ్రహమునకు ఒక గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి దేవత అని ముగ్గురు ఉంటారు. ఉదాహరణకి సూర్య గ్రహానికి గ్రహ దేవత సూర్యుడు, అధి దేవత అగ్ని, ప్రత్యధి దేవత పరమశివుడు. ఇక్కడ గ్రహ దేవత, అధి దేవత ప్రత్యధి దేవత అనేవి మూడు స్థాయిలలో ఉంటాయి. గ్రహ దేవత భౌతికమైన స్థాయిలో ఉంటే, అధి దేవత మానసిక స్థాయిలోనూ, ప్రత్యధిదేవత ఆత్మ స్థాయిలో ఉంటాయి. అంటే మరోలా చెబితే, సూర్యుడికి మనసు అగ్ని, ఆత్మ శివుడు.
ఎప్పుడైనా గ్రహ దోషాలు ఉంటే, తత్ సంబంధమైన గ్రహ దోషం పోవాలంటే, ఆ గ్రహమునకు సంబంధించిన మంత్రము జపించడం వలన భౌతిక స్థాయిలో ఉపశమనం ఉంటుంది. ఆ గ్రహ మంత్రముతో పాటు, అధి ప్రత్యధి దేవతలను కూడా ఉపాశిస్తే, ఆ గ్రహ దోషము నుండి ఉపశమనం సంపూర్ణముగా ఉంటుంది అని విన్నాను. అంటే సూర్యుడి వలన మనకి వెలుతురు, వేడి పుడుతున్నాయి. దానిని ఇంకా లోతుగ చూస్తే, అధిదేవత అగ్ని కారకము, ఇంకా పై స్థాయిలో ఆత్మ స్థాయిలో చూస్తే శివుడు.
psmlakshmi
Post a Comment