పిల్లల పార్కు
ప్రవేశ ద్వారం
యానాం బీచ్
యానాం
ఆంధ్ర ప్రదేశ్ లోని ఫ్రెంచ్ కాలనీ
చుట్టూ తూర్పు గోదావరి జిల్లా ... మధ్యలో యానాం .. మన దేశంలో వున్న మూడు ఫ్రెంచ్ కాలనీల్లో ఒకటి.. 30 స్క్వేర్ కిలో మీటర్ల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్రెంచ్ కాలనీలో బీచ్, చిన్న పిల్లల పార్కు,, వెంకటేశ్వర స్వామి కోవెల, పోచమ్మ కోవెల వగైరా దర్శనీయ ప్రదేశాలున్నాయి.
కాలనీ లోకి వెళ్ళి రావటానికి ఆటోలు దొరుకుతాయి. మన వాహనాలలో వెళ్ళాలంటే కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది. మేము వెళ్ళింది మధ్యాహ్న సమయంలో. సమయాభావం వల్ల ఆటోలోనే ఒక రౌండ్ వేసి వచ్చాము
యానాం
ఆంధ్ర ప్రదేశ్ లోని ఫ్రెంచ్ కాలనీ
చుట్టూ తూర్పు గోదావరి జిల్లా ... మధ్యలో యానాం .. మన దేశంలో వున్న మూడు ఫ్రెంచ్ కాలనీల్లో ఒకటి.. 30 స్క్వేర్ కిలో మీటర్ల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్రెంచ్ కాలనీలో బీచ్, చిన్న పిల్లల పార్కు,, వెంకటేశ్వర స్వామి కోవెల, పోచమ్మ కోవెల వగైరా దర్శనీయ ప్రదేశాలున్నాయి.
కాలనీ లోకి వెళ్ళి రావటానికి ఆటోలు దొరుకుతాయి. మన వాహనాలలో వెళ్ళాలంటే కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది. మేము వెళ్ళింది మధ్యాహ్న సమయంలో. సమయాభావం వల్ల ఆటోలోనే ఒక రౌండ్ వేసి వచ్చాము
8 comments:
యానాం ఎదుర్లంక వంతెనమీద చాలా సార్లు వెళ్ళాం కానీ యానాం లో ఇంత అందమైన ప్రదేసాలు వున్నాయని ఇంతవరకూ తెలీదండీ. ఫొటోలు చాలా బావున్నాయి
లక్ష్మి గారికి, లలిత గారికి
ఈ క్రింది లింకులలో యానాం గురించి ఆశక్తిఉంటే మరింత సమాచారం చూడండి.
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_07.html
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post_2177.html
కృతజ్ఞతలు లలితగారూ
ఈ మారు వెళ్ళినప్పుడు చూడండి. సాయం సమయాన్ని అందమైన ప్రదేశంలో ఆహ్లాదకరంగా గడపవచ్చు.
psmlakshmi
ధన్యవాదాలు బొల్లోజు బాబాగారూ,
తప్పక చూస్తాను.
psmlakshmi
బొల్లోజు బాబా గారూ
యానాం లింకు ఓపెన్ కాలేదండీ. విడిగా కూడా ప్రయత్నించాను. లాభంలేదు. ఎందుకంటారు?
psmlakshmi
నేనిచ్చిన ఒక్కో లింకుని యధాతధంగా కాపీ చేసి మీ ఎడ్రస్ బార్ లో పేస్టుచేసి ఎంటర్ నొక్కండి. ఒపెన్ అవుతుంది.
బొల్లోజుబాబాగారూ
మీరు చెప్పిన పధ్ధతిలో యానాం గురించి చాలా వివరాలు తెలుసుకున్నామండీ. మీ కుటుంబ పరిచయంతో మీరు చాలా అభ్యుదయ భావాలు కలవారని తెలిసింది. అభినందనలు.
psmlakshmi
కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.
Post a Comment