Sunday, June 28, 2009

నా బ్లాగు పుట్టిన రోజు

నా బ్లాగు పుట్టిన రోజు

28-6-2009 న నా బ్లాగు పుట్టిన రోజు. సరిగ్గా ఏడాది క్రితం ఈ రోజు ప్రాణం పోసుకున్న నా బ్లాగు ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో గుర్తింపులు..అన్నీ మధురమైన జ్ఞాపకాలే. ఎందరో సలహాదారులు, ఇంకెందరో స్నేహితులు అందరికీ కృతజ్ఞతాపూర్వక అభివందనలు. ప్రమదావనంలో ఎన్నో సరదాలు, ఎంతో సందడి...అవ్వన్నీ అతి మధురాలు. వెరసి రిటైరయిన తర్వాత కూడా ఖాళీ లేకుండా, సమయం వృధా చేయకుండా గడిపాను ఈ ఏడాదీ. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా తెలుగు బ్లాగర్ల గుంపుకు పరిచయం చేసిన శ్రీ దూర్వాసుల పద్మనాభంగారికి, ప్రమదావనం సందడిలోకి ఆహ్వానించటమేగాక నా బ్లాగు డిజైన్ చేసి, అవసరమైనప్పుడల్లా సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న శ్రీమతి జ్యోతి వలబోజుగారికు ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని, తోటి బ్లాగర్ల ప్రోత్సాహ ప్రవాహం నిరాటంకంగా వుండాలనీ కోరుకుంటున్నాను. ఈ బ్లాగు ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ, ఇంకా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న మావారు శ్రీ వెంకటేశ్వర్లు కీ నమస్సుమాంజలులు. మా పిల్లలకి ఆశీస్సులు.

చివరిగా ఒక్కమాట..వయసు లో పెద్దవారమని, ఏమంటే ఏమనుకుంటారోనని కొంతమంది దూరంగా వుంటున్నారు. ఈ బ్లాగు ప్రపంచంలో బ్లాగర్ల మధ్య వుండాల్సినది అభిమానం, సద్విమర్శ వగైరాలేగానీ పెద్దవారని దూరంగా వుంచటంకాదు. పెద్దవాళ్ళు బ్లాగు ప్రపంచంలో అడుగు పెట్టటానికి కారణం ఇవ్వన్నీ మర్చిపోవటానికే. ఇక్కడ అందరూ సమానులే అని కొందరు బ్లాగు మిత్రులు ఇదివరకే చెప్పిన మాటలు నిజంగా నిజంకావాలని కోరుతున్నాను.

మిత్రులందరూ నా బ్లాగుకి ఆశీర్వచనం పలకమని కోరుతున్నాను.

14 comments:

రమణి said...

బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు లక్ష్మిగారు.మీ బ్లాగు ఇలాగే అనేక మజీలీలను మైలు రాళ్ళను దాటాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ..

జీడిపప్పు said...

బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు లక్ష్మిగారు.

చిలమకూరు విజయమోహన్ said...

మీబ్లాగుకు నాబ్లాగు ‘అన్న’అవుతుందన్న మాట ఎందుకంటే నా బ్లాగు పుట్టినరోజు 21 జూన్ కాబట్టి. శుభాకాంక్షలు

పానీపూరి123 said...

> వయసు లో పెద్దవారమని, ఏమంటే ఏమనుకుంటారోనని కొంతమంది దూరంగా వుంటున్నారు

బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు...

ఇంతకుముందు మీ బ్లాగ్ చూసి, నా observation ఒకటి చెప్పాలి అని అనుకున్నాను...
వెంటనే ప్రొపైల్ లో మీ ఫోటో చూసి, మీరు పెద్దవారు కదా అని చెప్పలేక పోయాను...

psmlakshmiblogspotcom said...

రమణిగారూ, జీడపప్పుగారూ, ధన్యవాదాలు.

నమస్తే విజయమోహనన్నా, మీ బ్లాగుకూ, కొంచెం ఆలస్యమయినా, పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ బ్లాగు అత్యున్నతంగా సాగాలని కోరుకుంటున్నాను.

పానీవూరీగారూ, నేనలా రాయటానికి కారణం నా అనుభవాలే. బ్లాగు లోకంలో మిత్రులు కేవలం బ్లాగులో విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోవాలనీ, బ్లాగర్ల వయసుని కాదనీ మరొక్కసారి మనవి చేస్తున్నాను. మీ మీ కామెంట్స్ ని నిర్మొహమాటంగా రాయండి. వాటిని మీ అభిప్రాయాలుగా స్వీకరిస్తాను. మంచి వుంటే తప్పక పాటిస్తాను. ఇప్పుడు చెప్పెయ్యండి మీరు ఇప్పటిదాకా దాచుకున్న అబ్ జర్వేషన్ లేకపోతే నాకు నిద్ర పట్టదు. చెప్పండి మరి 1..2..3
psmlakshmi

చిలమకూరు విజయమోహన్ said...

మీబ్లాగుకు నాబ్లాగు మాత్రమే అన్నవుతాడండి .నేను మాత్రం మీకు తమ్ముణ్ణేనండి.

మాలా కుమార్ said...

happy birthday

అరుణ పప్పు said...

పుట్టినరోజు శుభాకాంక్షలు.............

పరిమళం said...

లక్ష్మిగారు,బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు.

జ్యోతి said...

భ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు ...
ఒక బ్లాగు ఎక్కువ ఆదరణ పొందింది అంటే అందులోని విషయాన్ని బట్టి. ఆ బ్లాగరు వయసు తెలిసేది అతను చెప్తే కాని, లేదా అతని ఫోటో పెడితే కాని. పెద్దవారిని గౌరవించడం మన సంస్కృతి . అందుకే సరదాగా ఏదైనా అనాలంటే జంకుతారు అందరూ. అందువల్ల దూరం పెట్టినట్టు కాదు.. అపార్ధం చేసుకోవద్దు. మీరు కూడా అల్లరి చేయండి. మేమూ సై అంటూ రెడీ..

polimetla said...

మీ బ్లాగు వల్ల కలిగిన లాభాలు
1. అందరికి పుణ్యం వస్తుంది, పుణ్యక్షేత్రాలు చూడటంవలన
2. పర్యాటక రంగం అభివ్రుద్ది చెందుతుంది

మరిన్ని విషయాలు రాస్తారని అశిస్తూ,

భవాని పొలిమెట్ల
www.polimetla.com

psmlakshmiblogspotcom said...

ఆగ్రహించకండి విజయమోహన్ గారూ, సరిగానే అర్ధం చేసుకున్నా.
మాలా, అరుణా, పరిమళం, జ్యోతి, పోలిమెట్ల గార్లకు ధన్యవాదాలు.
psmlakshmi

Unknown said...

lakshmi garu ivvalle modatisari blog anedanini open chesindi . modatisare maaaaaaaaaa hamsaladeevini chudadam chhhhhaaaallllaaa santoshamga unnadi ma ista, inti daivam aa hamsaladeevi venugopalaswami. meekuna na abhinandanalu
ambatipudi sreemahalakshmi

Unknown said...

Ma venugopalaswami meeku enno vidhaluga toduneedaga undalani korukuntoo
Dr.A.Sreemahalakshmi