జోరు వానలో కారు ప్రయాణం
ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి
నిజామాబాదుకు 12 కి.మీ ల దూరంలో ప్రకృతి రామణీయకత మధ్య కొండమీద కొలువైవున్న రామయ్యతండ్రి ఆలయం ఇది. 11వ శతాబ్దంనాటి ఈ ఆలయాన్ని చాళుక్యులు జైనమత ప్రేరణతో కట్టించారు. కొండమీదికి మెట్లు చిన్నగా, ఎక్కటానికి వీలుగా వుంటాయి. పూజాదికాల సమయానంతరం పూజారి వుండకపోవచ్చు. కటకటాల వాకిలిలో నుంచి పగలు ఏ సమయలోనైనా స్వామి దర్శనం చేసుకోవచ్చు.
ఆలయం చిన్నదయినా అద్భతమైన శిల్ప సౌందర్యంతో అలరారుతున్నది. చుట్టూ పచ్చని చెట్లు. పైగా మేము వెళ్ళినప్పుడు వాతావరణం చల్లగా వుండి సన్నగా తుపర పడుతోంది. ఆ వాతావరణంలో ఆ ప్రదేశాన్ని వదిలి రాబుధ్ధి కాలేదు. అందుబాటులోవున్న ఇలాంటి కళాఖండాల విలువ తెలుసుకుని ఆదరించి వాటి వైభవాన్ని నిలపవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు...మనందరిదీ కూడా.
ఆలయాలేకాదు, ఆలీ సాగర్, శారదా సాగర్ లాంటి పిక్నిక్ ప్రదేశాలు కూడా వున్నాయి నిజామాబాదులో. మేము 21-3-2008 ఉదయం 7 గం. లకు ఇంట్లో బయల్దేరిన వాళ్ళం ఏడుపాయలు, మెదక్ చర్చ్, బికనూరు, ఇస్సన్నపల్లి, బుగ్గరామేశ్వరం, ఇందూరు, సారంగాపూర్, జానకంపేట, బాసర, నిజామాబాదులో ఆలయాలు, డిచ్ పల్లి ఇన్ని చూసి 23-3-2008 రాత్రి 7 గం. లకి ఇంటికి చేరాం. చాలా చూశాం కదూ. వచ్చేటప్పుడు నిజామాబాదునుంచి హైదరాబాదు ఇంకో పది కిలోమీటర్లు వుంది అనేదాకా చాలా పెద్ద వాన. నాకైతే కొంచెం భయంకూడా వేసింది. వానలో మా కారు ప్రయాణం ఫోటోలు కూడా చూడండి. మరింకేం బయల్దేరండి...నిజామాబాదు దర్శనానికి.

5 comments:
మేము పోయిన నెలాఖరులో వెళ్ళాము కాని మెదక్ చర్చిని చుడలేకపోయాము ఆలస్యమైందండి మూసివేసారు.Nice trip!
రామాలయాన్ని మీ చిత్రాలతో మాకు చక్కగా ఆవిష్కరింపజేసారు.
పద్మార్పితగారూ, మళ్ళీ అవకాశం వస్తే తప్పక చూడండి మెదక్ చర్చి. చాలా బాగుంటుంది. ఈ లోపల మెదక్ చర్చి ఫోటోలు చూడండి ఈ బ్లాగులోనే వున్న పోస్టులో.
psmlakshmi
విజయమోహన్ గారూ
ధన్యవాదాలు
psmlakshmi
Hello Madam, its so nice to find such a good blog about your visits and your endless patience to post them. I was searching for Shirdi and couldn't find it. May be you visited or didn't post it.. am not sure about it.. I really wished if there was any information regarding Shirdi and nearby places 'coz am visiting Shirdi for the first time in the very near future and I have any idea about places to be seen there. And I read so many posts on your blog and got enthralled the way you write..! Thank you so much for the very valuable information that helps us in the near future.. Hope your journey continues cheerfully... signing out for the day, but will be visiting your blog for sure whenever I find my kind of time.. Thank you millions and millions.. :)
Cheers,
Sail (Sailaja)
Post a Comment