చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా వుందా అయితే చదవండి.
గర్భ గుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం వుంది. దానికి తెర వేసి వుంటుంది. ఇక్కడ గోడలో ఒక విశిష్ట యంత్రం బిగించబడి వుందని చెప్తారు. అది ఏ యంత్రమో ఎవరికీ తెలియదు. దాని పైన ఎప్పుడూ దట్టమైన చందనం పూసి వుంటుంది. దానిని ఎవరూ తాకరాదు. ప్రధాన అర్చకుడు మాత్రం రాత్రి వేళ తలుపులు వేసి ఆ యంత్రానికి పూజ చేస్తారు. ఇంకెవరికీ పూజ చెయ్యటానికేకాదు పూజా సమయంలో చూడటానికి కూడా అనుమతి లేదు. అయితే ఆసక్తిగల భక్తులు అక్కడి వూజారిని అడిగి రూ. 50 టికెటు తీసుకుంటే కిటికీగుండా కొద్ది దూరంనుంచి ఆ యంత్ర దర్శనానికి అవకాశం వుంటుంది.. ఆ సమయంలో ద్వారానికి వున్న తెర తొలగించి హారతి వెలుగులో కొద్ది క్షణాలు మాత్రం ఆ యంత్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఆ యంత్రంపై బంగారు బిల్వ పత్రాల మాలలు కనబడుతాయి.. ఆ కొద్ది క్షణాల దర్శనంలో ఎవరి అనుభూతులు వారివి.. ఎవరి భక్తి పారవశ్యం వారిది. ఇంతకీ ఆ స్ధలంలో ఏమి వున్నట్లు? చూసిన భక్తులకు ఏమి కనిపించినట్లు? ఎవరికీ అంతుబట్టని రహస్యం. ఇదే చిదంబర రహస్యం. అయితే విజ్ఞులుమాత్రం ఈ రహస్యం నిరాకారుడైన దేవ దేవుని ఉనికిని సూచిస్తుందనీ, చిత్ + అంబరం అంటే జ్ఞానాకాశాన్ని, అనంతాన్ని వెల్లడిస్తుందని, ఎవరి అంతరంగ భావాలననుసరించి వారికి ఆ రూపంలో నిరాకారుడైన స్వామి దర్శనమిస్తారని తెలుయజేస్తుందని చెబుతారు.
హమ్మయ్య! రహస్యం తెలిసిపోయిందికదా. రేపు చిదంబరంలోనూ, చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల గురించి తెలుసుకుందాము.
ఆలయ గోపురం మీద శిల్ప సౌందర్యం
0 comments:
Post a Comment