అతి పురాతనమైన ఈ ఆశ్రమం ప్రస్తుత చిరునామా కలొనల్ గంజ్ లో ఆనంద భవన్ సమీపంలో. త్రేతా యుగంలో వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇక్కడ మూడు రాత్రులు వుండి, భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుని, ఆయన ఆశీర్వచనంతో యమునా నదిని దాటి చిత్రకూట్ కి పయనమయ్యాడు. ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ వుండేది. తర్వాత కాలంలో అక్బరు నిర్మిచిన బక్షి, బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారింది అంటారు.
ఆ కాలంలో చాలా దూర ప్రదేశాలనుంచి విద్యార్ధులు విద్యనభ్యసించటానికి ఇక్కడికి వచ్చేవారు. సందర్శకుల దర్శనార్ధం ఈ ఆశ్రమంలో శివ, కాళీమాత విగ్రహాలతోబాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా వున్నది.
ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో నివాస గృహాలు వచ్చాయి. ఆశ్రమానికి ఆనుకుని పార్కు అభివృధ్ధి చేస్తున్నారుట. సమయాభావంవల్ల పార్కు చూడలేదు.
4 comments:
"తీర్థయాత్రలకు రామేశ్వరమూ, కాశీ ప్రయాగలేలనో?--ప్రేమించిన పతి యెదుటనుండగా........"
"అన్యోన్యం గా దంపతులుంటే ఇలకు స్వర్గమే దిగిరాదా!"
మీ యాత్రా విశేషాలు బాగున్నాయి.
పై వ్యాఖ్య అసంబద్దంగాను, అసభ్యంగాను ఉన్నది. తొలగొంచగలరు.
కృష్ణశ్రీ గారూ
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అలకలు లేకపోతే ప్రేమ విలువ తెలియదు కదండీ. అలాగే ప్రేమ ఒక్కటే జీవితం కూడా కాదు. జీవితం పరిపూర్ణంగా అనుభవించాలంటే అన్ని అనుభవాలూ వుండాలికదా. అంటే ఆలు మగల ప్రేమ పరిధి అనే గొడుగు నీడన సమాజాన్ని కూడా చూడాలి. గొడుగు ముఖానికి అడ్డుపెట్టుకుని ఏమీ చూడకుండా వుంటే ఆ జీవితం కూపస్ధ మండూక జీవితం కాదా.
అతిగా చెప్తే క్షమించండి. మీ భావనతో నేను కొంతమటుకూ ఏకీభవిస్తాను. అన్యోన్యంగా దంపతులుంటే ఇలకు స్వర్గమే దిగి వస్తుంది. అలాగని మనం స్వర్గంలోనే వుండిపోయి ఇతర ప్రపంచాన్ని పట్టించూకోమంటే మన చుట్టూ వున్న భవసాగరాలు ఏమైపోతాయండీ.
psmlakshmi
WitReal గారూ
యాత్రా విశేషాలు నచ్చినందుకు సంతోషం. కృష్ణశ్రీ గారి వ్యాఖ్య అసంబధ్ధంగా వుందిగానీ అసభ్యంగా లేదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. లోకోభిన్నరుచి కదా. కొందరికి ఈ తిరుగుళ్ళన్నీ శుధ్ధ వేస్ట్ అనిపిస్తాయి. నా సమాధానం చూడండి.
psmlakshmi
Post a Comment