Wednesday, December 8, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడీ కాశీ కబుర్లు - 24



బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం
ఆసియా ఖండంలోనే పెద్దదిగా భావించబడే ఈ విశ్వ విద్యాలయం పూర్వం కాశీ రాజుగారిచే ఇవ్వబడిన దాదాపు 2000 ఎకరాల సువిశాల క్షేత్రంలో వున్నది.  దీనిని  1916లో పండిట్ మదన్ మోహనమాలవ్యాగారు స్ధాపించారు..  ఏటా 15000 మంది క్రొత్త విద్యార్ధులకి అనేక రంగాలలో ప్రవేశం కల్పించే ఈ విశ్వ విద్యాలయం పేరులో మాత్రమే హిందూ విశ్వ విద్యాలయం.  భారతదేశంనుంచే కాక విదేశాలనుంచికూడా అనేక మంది విద్యార్ధులు కుల, మత ప్రసక్తి లేకుండా ఈ విశ్వ విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. 

 ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మింపబడిన విశ్వనాధుని ఆలయం వున్నది.  బిర్లాలచే నిర్మింపబడింది కనుక దీనిని బిర్లామందిర్ గా కూడా వ్యవహరిస్తారు.   ఈ పాలరాతి కట్టడం కాశీ విశ్వనాధుని ఆలయాన్ని పోలి వుంటుంది.  కాశీ విశ్వనాధుని ఆలయంలోకి విదేశీయులకు అనుమతి లేదు కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తిగల ఎవరైనా చేసుకోవచ్చు.


ఇక్కడే భారత కళాభవన్ అనే మ్యూజియంకూడా వున్నది.  సమయాభావంవల్ల మేము చూడలేదు.  అవకాశం వున్నవారు  ఉదయం 11 గం. ల నుండి సాయంత్రం 4 గం. ల వరకు దర్శించవచ్చు.   అయితే విశ్వవిద్యాలయానికి  సెలవు  వున్న రోజుల్లో ఈ మ్యూజియం కూడా మూసివుంటుంది.

0 comments: