


ముక్తేశ్వరం
సాయంత్రం 5 గం. లకి ఐనవల్లి నుంచి బయల్దేరి ముక్తేశ్వరం వచ్చాం. 10 నిముషాల ప్రయాణం కూడా వుండదు. మైన్ రోడ్డు ఎక్కగానే ముక్తేశ్వరమే. అంటే ముక్తేశ్వరం నుంచి ఎడమవైపు రోడ్డులో వెళ్తే ఐనవల్లి వస్తుంది.
మైన్ రోడ్డులో ఎడమవైపు తిరగగానే ఎదురెదురుగా రెండు ముక్తేశ్వరాలయాలు. ఎడమవైపువున్న ఆలయం శ్రీ ముక్తికాంత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయం. గర్భగుడిలో స్వామి పక్కనే అమ్మవారు. లింగానికి ఇత్తడి ముఖం అలంకరింపబడివుంది. గుడి ప్రధాన ద్వారం తెరిచివుంది. గర్భగుడికి కటకటాల తలుపులు వేసివున్నాయి. పూజారి లేరు. పక్కనే శ్రీదేవీ భూదేవీ సమేత కేశవస్వామి. ఇక్కడ శివ కేవులని శ్రీ రామచంద్రుడు ప్రతిష్టిచాడంటారు. ఈ ఆలయం ఐనవల్లి పంచాయతీలోకి వస్తుదిట.
ఎదురుగా శ్రీ రాజేశ్వరీ సమేత ముక్తేశ్వరస్వామి ఆలయం. ఇది సత్తనపూడి పంచాయతీ శివారులోవుంది. 130 సంవత్సరాల క్రితం రెండు గ్రామాల్లోవాళ్ళ మధ్య కలహాలవల్ల క్షణముక్తేశ్వరస్వామి ఆలయంనుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారుట. తర్వాత శ్రీ విద్యా ఉపాసకులయిన శ్రీ కప్పగంతుల మల్లికార్జున శాస్త్రి గారు ప్రక్కన శ్రీ రాజేశ్వరీదేవిని ప్రతిష్టించారు. ఈ ఆలయం ప్రస్తుతం ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆలయంలో పూజారిగారున్నారు. ఆయనే ఈ వివరాలు చెప్పారు.
2 comments:
ఇక్కడ క్షణ కాలం ఉన్నా ముక్తి పొందుతారుట. అందువలననే దీనికి "క్షణ కాల ముక్తేశ్వరం" అని పేరు.
అవునండీ. క్షణ ముక్తేశ్వరుడని ఆయన పేరు.
psmlakshmi
Post a Comment