Wednesday, September 16, 2009

శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం, బుగ్గరామేశ్వరం, నిజామాబాదు జిల్లాశ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం, బుగ్గరామేశ్వరం, నిజామాబాదు జిల్లా

ఇస్సన్నపల్లికి 15 కి.మీ. ల దూరంలో అడవి ప్రాంతంలో వున్న చిన్న వూరిది. త్రోవంతా పచ్చని చెట్లతో అందంగా వుంది. ఇక్కడి బుగ్గ రామలింగేశ్వరుని గుడి చిన్నదయినా చాలా మహత్యం కలదని భక్తుల విశ్వాసం. చుట్టు ప్రక్కల వూళ్లనుంచే కాకుండా దూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు స్వామి దర్శనానికి వస్తారు.

ఇక్కడి శివ లింగం దగ్గరనుంచీ నీళ్ళు వస్తాయిట. ఆ నీరు ఎక్కడనుంచి వస్తుందో తెలియదుగానీ ఆలయం వెనుక వైపు వున్న పెద్ద గుంటలోకి వచ్చి అక్కడనుంచి గుడి పక్కగా కొంచెం దూరం పారి తర్వాత కనబడవు. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు కానీ ఏ కాలంలోనైనా వుంటాయిట. ఆందుకే స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడని పేరు. ప్రక్కనే వేరే మండపంలో పార్వతి అమ్మవారు. విగ్రహం చిన్నదే అయినా పచ్చగా చాలా కళగా వున్నది.

గుడి ప్రక్కనే అన్నదాన సత్రం వుంది. ప్రతి రోజూ వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో వేరే సౌకర్యాలు లేని కారణంగా, ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదని ఈ ఏర్పాటు.3 comments:

swapna@kalalaprapancham said...

miku inni dabbulu ekadivi andi. mi ayana baga sampadistara:). anni chotlaki velli chustaru mi opikaki mechhukovachhu.

psm.lakshmi said...

good question.
1. బయటకి వెళ్తే మేము స్టార్ హోటల్స్ లో వుండము. నీట్ గా వుండే మామూలు హోటల్స్ చాలు. అవ్వయినా రూ. 500, 600 వుంటాయిలెండి. మా యాత్రలలో పెద్ద ఖర్చు స్టేకే
2. వెళ్ళేది పెద్దవాళ్ళం కనుక తిండి ఏది చూస్తే అది కొనక్కరలేదు.
3. ఏ.పీ. లో ప్రదేశాలన్నీ సొంత కారులో మా ఆయన డ్రైవ్ చేస్తే తిరుగుతాము. సాధారణంగా ఉదయం బయల్దేరి అన్నీ చూసుకుంటూ వెళ్ళి రాత్రి 7 గం. ల కల్లా ఎక్కడ బాగుంటే అక్కడ స్టే చేస్తాం.
4. నిజామాబాదులో ఇప్పుడు చెప్పిన 3 ప్రదేశాలు హైదరాబాదునుంచి పొద్దున్న మా కారులో బయల్దేరి చూసి, రాత్రి 7 గం. లకల్లా నజామాబాదు హోటల్ కపిలలో రూం తీసుకున్నాము. ఆ రోజంతా ఆహారం, నీళ్ళు, ఇంటినుంచి తీసుకెళ్ళినవే.
5. అన్నింటికన్నా మించి మా ఇద్దరికి ఆస్తులు పెంచుకోవటంకన్నా, బంగారం, చీరెలు కొనటంకన్నా, కొత్త ప్రదేశాలు చూడటానికి ఖర్చుపెట్టటమే ఇష్టం
6. ఆఖరున మేమిద్దరం ఇప్పుడే రిటైరయ్యాము. అందుకే మా డబ్బులతో మా జీవితాలని ఎంజాయ్ చేస్తున్నాము.
7. ఇవ్వన్నీ చిన్న చిన్న ప్రయాణాలు, ఎవరికైనా ఖర్చు ఎక్కువ కానివి. పెద్దవి ఇంకా చాలా చూడాల్సనవి వున్నాయి.
8. చిన్న వయసులో అనేక రకాల బాధ్యతలతో ఇన్ని తిరగటం కుదరదg.
9. ఇష్టం వుంది కనుక ప్రస్తుతానికి ఓపిక వుంది. బహుశా కొన్నాళ్ళుపోతే ఇంత తిరగలేము.
psmlakshmi

psm.lakshmi said...

చూసిన విశేషాలు అందరికీ చెప్పాలనే కోరికా చాలా వుంది. దీనివల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యి టూరింగ్ మొదలు పెట్టారు. మీకింత సరదాగా అన్నీ మంచి పాయింట్సే చెప్తున్నాగానీ, కొన్ని చోట్ల మేము ఆహారం, సరైన వసతి దొరకక ఇబ్బందిపడ్డ రోజులు వున్నాయి. ఈ ప్రదేశాలన్నీ 2 ఏళ్ళనుంచీ చూస్తున్నవి. అంటే కొన్ని బ్లాగు మొదలు పెట్టక ముందు తిరిగినవి. ఇప్పుడు వెళ్ళేవాటికి అలాంటి వివరాలు బ్లాగులో ఇస్తున్నా, ఇది చదివి వెళ్ళేవాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా వుండాలని.
psmlakshmi