Sunday, November 7, 2010

కాశీ యాత్ర మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 21



కాశీలో దర్శనీయ స్ధలాలు

గవ్వలమ్మ గుడి, భేలూపురి

కొంచెం ఎత్తుగా వుండే చిన్ని మందిరం ఇది.  అసలు కాశీలో చాలా ఆలయాలు చిన్నవే.  వాటి మహత్యమే అత్యున్నతం.  ఈ గవ్వలమ్మ విశ్వనాధుని సోదరి అనీ, ఆవిడకి మడీ ఆచారాలు ఎక్కువనీ, వాటితో ఆ దంపతులను విసిగిస్తుంటే స్వామి ఈవిడని ఊరు బయట దళితవాడలో వుండమని పంపాడని ఒక కధ.  ఈవిడని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదనీ ఒక ప్రచారం.  ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు.  అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు.

లోకల్ ట్రిప్ లో చూపించే ఆలయాలన్నీ దగ్గరగానే వుంటాయి.  సారనాధ్ కూడా ఈ ట్రిప్ లోనే చూపిస్తారు.



0 comments: