Tuesday, July 5, 2011

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేదగిరి


గాలి గోపురం
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేదగిరి

ప్రదేశం వేదగిరి (నరసింహ కొండ)

జిల్లా నెల్లూరు .. నెల్లూరు నుంచి 8 కి.మీ. దూరం

ప్రయాణ సౌకర్యం నెల్లూరునుంచి బస్సు, ఆటో సౌకర్యం వున్నది.

కొలువైన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి

ఆలయ నిర్మాణ సమయం కృతయుగములో వెలసిన దైవం..ఆలయం అనేకమార్లు పునరుధ్ధిరింపబడింది.

విశేషాలు చిన్న కొండమీద గుహలో 6 అడుగుల ఎత్తైన స్వామి విగ్రహం వెండి కవచంతో అలంకరింపబడినయనానందకరంగా వుంటుంది. దానికి కింద కశ్యప ప్రజాపతిచే ప్రతిష్టించబడ్డ 3 అడుగుల ఎత్తైన స్వామి విగ్రహం శ్రీ లక్ష్మీ అమ్మవారితో సహా వుంటుంది.

కొండ దిగువన పూర్వం యజ్ఞం కోసం ఏర్పాడు చేయబడి, కాలక్రమంలో కోనేళ్ళుగా మారిన హోమకుండాలు.

అమ్మవారు శ్రీ ఆదిలక్ష్మి

పరిసరాలు కొండమీదనుంచి అందమైన ప్రకృతి దృశ్యాలు కనబడతాయి. మంచి గాలి…ప్రశాంత వాతావరణం….తొందరగా అక్కడనుంచి కదిలిరాబుధ్ధి కాదు.

దర్శన సమయాలు ఉదయం 6 గం. ల నుంచి 12 గం. ల దాకా తిరిగి

సాయంత్రం 4 గం. ల నుంచి 8 గం. ల దాకా.

కధా కమామీషూ

పూర్వం సప్తఋషులలో ఒకరైన కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్ధం ఈ వేదగిరికి దిగువగా ఏడు హోమకుండములేర్పరిచి, సప్తఋషులతో కలసి యజ్ఞం చేశారు. ఈ ఏడు హోమ కుండాలు కాలక్రమంలో ఏడు కోనేళ్ళయి వాటిలోని ఒక కోనేరునుంచి ప్రస్తుతం కూడా కొండమీదకి పైపుల ద్వారా నీరు సరఫరా కాబడుతున్నది. యజ్ఞానికి ముందు యాగ సంరక్షకునిగా ప్రసన్నలక్ష్మీ సహిత శ్రీ గోవిందరాజస్వామిని ప్రతిష్టించారు. ఈ స్వామి ఆలయం ఏడు కోనేళ్ళ దగ్గర ఇప్పుడు కూడా చూడవచ్చు.

యజ్ఞంపూర్తయిన తర్వాత హోమ కుండమునుండి ఒక తేజస్సు జ్యోతి రూపంలో ప్రస్తుతం నరసింహస్వామి వెలసిన ఈ కొండ గుహలో ప్రవేశించింది. ఆ జ్యోతి వెంట వచ్చిన కశ్యపుడు మొదలైన వారందరూ గుహలోకి వచ్చి జ్యోతి స్ధానములో వెలసిన నరసింహస్వామిని చూసి స్వామిని అక్కడ ప్రతిష్టించారు.

స్వామి వెలసిన గుహ అత్యంత ప్రాచీనమైనదికాగా, పల్లవ రాజైన విక్రమసింహవర్మ ఈ స్వామికి విశాలమైన ఆలయం కట్టించాడు. తర్వాత కాలంలో విజయనగర రాజులు కూడా స్వామిని దర్శించి అనేక కానుకలు సమర్పించారు.

ఆలయ ప్రవేశ మార్గములో వున్న ఏడంతస్తుల గాలి గోపురం సుమారు 500 సం. క్రితం రెడ్డిరాజుల కాలంలో నిర్మింపబడింది.

ఆలయ దర్శనంలో ఆసక్తి లేనివారు కూడా సంతోషంగా దర్శించదగ్గ ప్రదేశం ఇది.


3 comments:

Damarapalli mahender said...

మేడం మీ బ్లాగ్ చాల బాగుంది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాల ఉపయోగపడుతుంది మా అందరికి.నాదొక చిన్న విన్నపము ఫొటోస్ ఎక్కువగా పెట్టి సైజు పెచిన్నట్లితే బాగుంటుంది మరియు హెడింగ్ ఫొటోస్ కూడా మార్చినట్లయితే ఇంకా బాగుంటుంది అని నా అబిప్రాయం.

Damarapalli mahender said...

మేడం మీ బ్లాగ్ చాల బాగుంది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాల ఉపయోగపడుతుంది మా అందరికి.నాదొక చిన్న విన్నపము ఫొటోస్ ఎక్కువగా పెట్టి సైజు పెచిన్నట్లితే బాగుంటుంది మరియు హెడింగ్ ఫొటోస్ కూడా మార్చినట్లయితే ఇంకా బాగుంటుంది అని నా అబిప్రాయం.

psm.lakshmi said...

మహేంద్రగారూ
ధన్యవాదాలు. మొదట్లో ఫోటోలు ఎక్కువ పెట్టేదాన్నిగానీ స్పేస్, స్పీడు ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య తగ్గించా. ఇంక సైజు జూమ్ చేసే అవకాశం వుందికదా. కొందరయితే ఇంకా తగ్గించమని కూడా అన్నారు.
psmlakshmi