Monday, January 9, 2012

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, సంఘీనగర్, హైదరాబాద్

<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, సంఘీనగర్, హైదరాబాద్

వ్యాపార రంగంలో ప్రసిధ్ధిగాంచిన సంఘీ వంశీయులు తమ సంస్ధలకు సమీపంలో వున్న పరమానంద గిరి అనే కొండమీద ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి
ఆధ్వర్యంలో 25-2-1991 లో శంఖుస్ధాపన జరుగగా, కేవలం 18 నెలల సమయంలో నిర్మాణం పూర్తి చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఏకైక పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గణపతి స్ధపతి ఈ ఆలయాల రూపకర్త. చోళ, చాణుక్య శైలిలో నిర్మింపబడిన ఈ ఆలయాల నిర్మాణానికి స్ధల నిర్ణయం దగ్గరనుంచీ, ఏ ఆలయంఎక్కడ, ఏ పరిమాణంలో నిర్మింపబడాలి వగైరా విషయాలలో శ్రీ గణపతి స్ధపతి శిల్ప శాస్త్రాన్ని నిర్దుష్టంగా అనుసరించారు.

హైదరాబాదుకి 25 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఆలయానికి సికిందరాబాదు, కోటీలనుంచి బస్సు సౌకర్యం వున్నది. ప్రధాన రహదారినుంచి ఒక కిలో మీటరు కొండపైకి వెళ్ళాలి. కార్లు పైకి వెళ్తాయి. పెద్ద వాహనాలు కిందనే ఆపాలి. శ్వేత వర్ణంలో అందంగా ఆకర్షించే ఈ ఆలయాలు చేరటానికి సోపాన పంక్తి వున్నది. ఈ మెట్లకి మొదట్లో ఏనుగుల విగ్రహాలు ఆకర్షణీయంగా వుంటాయి. సోపాన మార్గంలో క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. మెట్లెక్కగానే అందంగా చెక్కబడ్డ ముఖ ద్వారం దర్శనమిస్తుంది. దాటి ముందుకు వెళ్తే ముఖ్య ఆలయం శ్రీ వెంకటేశ్పరస్వామిది. ఆలయంలో స్వామి విగ్రహం 9.5 అడుగుల ఎత్తులో అలరారుతోంది. స్వామికి కుడివైపు పద్మావతీ అమ్మవారు తామర పుష్పంలో కూర్చుని, చేతిలో తామర పూవులు ధరించి భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ ప్రాంగణంలో శివ, రామ, నవగ్రహాలు, విజయ గణపతి, కార్తికేయ, దుర్గ, అష్టలక్ష్మి, రాధాకృష్ణ మొదలగు దేవతలకి 13 ఉపాలయాలు వున్నాయి.

ప్రశాంత వాతావరణంలో అందంగా తీర్చిదిద్దబడ్డ ఈ ఆలయ సందర్శనానికి శని, ఆదివారాలు, ఇతర సెలవురోజులలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. అందమైస సాయంకాలాలు పట్టణ రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతంగా నిర్మలమైన వాతావరణంలో గడపాలనుకునేవారు తప్పక చూడవలసిన ఆలయాలు ఇవి.

దర్శన సమయాలు ఉదయం 8 గం. నుంచి 12 గం. లదాకా తిరిగి సాయంత్రం 4 గం. లనుంచి 8 గం. ల దాకా.




3 comments:

Truely said...

This is a private temple and this temple is shooted in many movies. you will not be allowed to see the dity when there is a movie shooting.I feel much holistic to have a darshanam in local temple rather going all the way to this sanghi nagar.

psm.lakshmi said...

Tuely garu
No doubt it is a private temple but all are allowed. I have not heard of denying darshan to people when there is a shooting. Ofcourse people going there should know about this information also.
Thank you
psmlakshmi

Anil Piduri said...

లక్ష్మి గారూ!

పరమానంద గిరి అనే కొండ:::::
25-2-1991 లో శంఖుస్ధాపన జరుగగా, కేవలం 18 నెలల సమయంలో నిర్మాణం పూర్తి చేశారు........

విషయ సేకరణలో మీ ఓరిమికి నిదర్శనాలు.
ఎన్నో మంచి విశేషాలను తెలుసుకుంటునాము.
మెనీ థాంక్స్!
సంక్రాంతి శుభాకాంక్షలతో, కాదంబరి;