Monday, August 4, 2008

చర్చి, మెదక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా




మెదక్ చర్చి

భారత దేశం లో రెండవ పెద్ద చర్చి ఇది. రెవరెండ్ ఛార్లెస్ వాకర్ దీనిని కట్టించారుట. ఇందులో 5000 మంది వోకే సారి కూర్చుని ప్రార్ధన చేసేందుకు వీలుంది. ఈ చర్చి కట్టి సుమారు 100 సం. లు అయింది. చర్చి శిఖరం ఎత్తు 173 అడుగులు. ఈ చర్చి గంటలు చాలా దూరం వరకు వినిపిస్తాయిట. కిటికీలపైన గాజు పనితనం చాలా బాగుంటుంది.




కంది, మెదక్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్,ఇండియా



చెరువు, గంగమ్మ ఆలయం

ఆలయ ముఖద్వారం


కంది

శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయం

హైదరాబాదు తిరిగివస్తూ సంగారెడ్డకి 4 కి. మీ. ల దూరంలో వున్న ఈ ఆలయం దర్శించాం. ఇది కూడా 250 సంవత్సరాల క్రతం కట్టిన ఆలయం. పెద్ద ప్రవేశ ద్వారం, చుట్టూ నివాస గృహాలు (అన్నీ ప్రస్తుతం నివాసయోగ్యంగా వున్నట్లులేవు), మధ్యలో చిన్న ఆలయం...ప్రహరీ గోడ దాటాక పక్కనే చెరువు, గంగమ్మ, లక్ష్మీనారాయణులకేకాక ఇంకా గుర్తు తెలియని ఆలయాలు ఇంకో రెండు వున్నాయి.

సరైన ఆదరణకు నోచుకోని ఇలాంటి కళాఖండాలు ఎన్నో. మనసంపద విలువని గుర్తించి ఆదరించాల్సిన బాధ్యత మనకు కూడా వుందనుకుంటే వీలు చూసుకుని ఈ ఆలయాలను దర్శించండి.

మీ వాహనంలో హైదరాబాదునుంచి ఉదయం బయల్దేరితే, కంది, నందికండి, కలబగూరు, చిట్కుల్ చూసి సాయంకాలానికి ఇంటికి చేరుకోవచ్చు. అయితే భోజనం వేళకి చిట్కుల్ చేరుకోండి లేకపోతే భోజనం మంచినీళ్ళు తీసుకు వెళ్ళండి.

నందికండి, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్



ఆలయ ప్రవేశ ద్వారం

ఆవరణలో వున్న శాసనం


ఆలయం లో స్తంభాలమీద శిల్ప సౌందర్యం



ఆలయం









నందికండి

రామలింగేశ్వరాలయం

సంగారెడ్డికి 15 కి. మీ. ల దూరంలో వుంది ఈ ఆలయం. సాయంత్రం 5.00 అయింది మేము వెళ్ళేసరికి. ఆలయం మూసి వుంది. కటకటాలలోంచి స్వామి దర్శనం. శిల్ప కళ చాళుక్యుల శైలి లో వున్నది. సరైన ఆదరణకు నోచుకోని ఇలాంటి కళాఖండాలు మనదేశం లో ఎన్నో.






కలబగూర్, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

ఆలయం ముందు మంటపం

ఆలయం
ఆలయ ముఖ ద్వారం
కలబగూర్
శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం
చిట్కుల్ నుంచి వస్తూ వెళ్ళాము ఈ ఆలయానికి.
ఈ ఆలయం దర్శించి తర్వాత చిట్కుల్ వెళ్ళవచ్చు. సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే రోడ్ లో, సంగారెడ్డి జడ్. పి. ఆఫీసు దాటగానే (రోడ్ కి ఎడమ ప్రక్కనే వస్తుంది ఈ ఆఫీసు) ఎడమ వైపు రోడ్ లోకి తిరిగి సుమారు 3 కి. మీ. ల దూరం వెళ్తే వస్తుంది ఈ ఆలయం. మేము వెళ్ళేసరికి సాయంత్రం 3.40 అయింది. శివాలయం మూసివుంది గానీ అక్కడవున్న పూజారి తలుపు తీశారు. కరెంటు లేకపోవటంవల్ల బ్యాటరీ లైటుతో స్వామిని చూపించారు.
త్రికూట ఆలయంలో శివ కేశవులు వొక్కటే అని నిరూపించటానికా అన్నట్లు కాశీ విశ్వేశ్వరుడితోపాటు అనంతపద్మనాభస్వామి, వేణుగోపాలస్వామి కోలువుతీరి వున్నారు.

ఇది మంజీరా బ్యారేజ్ కి చేరువలో వున్నదట.

14వ శతాబ్దంలో కాకతీయులు దీన్ని నిర్మించారుట. వరంగల్ లోని వెయ్యి స్తంబాల మంటప నిర్మాణ శైలి ఈ కట్టడంలో కనిపిస్తుంది.

ఈ ఆలయాల్లో పూజాదికాలూ, అభిషేకాలూ ఇప్పటికీ జరుగుతున్నాయి.


చిట్కుల్, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్


శ్రీ చాముండేశ్వరీ ఆలయం





చిట్కుల్
3-8-2008
శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయం
రాత్రి పెద్ద వాన కురిసి వెలిసింది..ఉదయం వాతావరణం చల్లగా హాయిగా వుంది. పులిహార, పెరుగన్నం పేక్ చేసుకుని బయల్దేరాం. మదటి మజిలీ..చిట్కుల్ శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయం..ఇది సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే దోవలో, సంగారెడ్డికి 31 కి. మీ. దూరంలో వుంది. ఆందోల్ దాటిన తర్వాత కుడి వైపు తిరగాలి. బస్సు సౌకర్యం బాగా వుంది.

25 ఏళ్ళ క్రితం, కీ.శే. శ్రీ అయిలావఝుల వేంకట రమణయ్య గారు ఈఆలయ నిర్మాణానికి నడుంకట్టారు. నిర్మాణం ఇంకా సాగుతోంది. ప్రతిష్టింపబడి ఎక్కువ కాలం కాక పోయినా, భక్తులకు కొంగు బంగారం అయింది ఈతల్లి. అందుకే భక్తుల రాకపోకలు బాగానే వున్నాయి.

10 అడుగుల ఎత్తయిన అమ్మవారి నల్లరాయి విగ్రహం 18 చేతులతో చూపరులను అనుగ్రహిస్తున్నట్లు వుంటుంది.

12.30 నుంచి 2.00 గం. ల దాకా నిత్యాన్నదానం జరుగుతూవుంటుంది. ఆహారం తీసుకు వెళ్ళకపోయినా పర్వాలేదు.

ఆలయం తెరచి వుంచు వేళలుః ఉదయం 6.00 గం. ల నుంచి రాత్రి 8.00 గం. ల దాకా.





Saturday, August 2, 2008

ఏడుపాయలు , మెదక్ డిస్ట్రిక్ట్ ఆంధ్ర ప్రదేశ్, ఇండియా


జనమేజయుడు తపస్సు చేసిన స్థలం

వన దుర్గా దేవి ఆలయము

డాం దృశ్యము


వన దుర్గా దేవి ఆలయము

వన దుర్గా దేవి

ఏడుపాయలు

ఏడుపాయలు వనదుర్గాదేవి ఆలయం, నాగిసానిపల్లి

21-03-2008
మార్గము..... మెదక్ మైన్ రోడ్డు నుంచి బాడ్కట్పల్లి రోడ్డులో (ముంబోజుపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఎడమ వైపు రోడ్డు) 11 కి. మీ.లు వెళ్తే కమాన్ వస్తుంది..దానిలోంచి లోపలకు మళ్ళీ 6.8 కి. మీ. లు
ఉదయం 7.00 గం. లకు బయల్దేరి 9.00 గం. లకు డాం (dam) చేరుకున్నాము. ఓక గంట అక్కడే తిరిగాము. నీళ్ళు వున్నాయి గానీ మురికిగావున్నాయి.

1.30 కి వనదుర్గ ఆలయం చేరుకున్నాము. 4 అడుగుల ఎత్తు ఆకర్షనీయమైన నల్ల రాయి విగ్రహం. చుట్టూ కోండలు, బండరాళ్ళు, మధ్య చిన్న ఆలయం....తెరచి వుంచు
వేళలు ఉదయం 7.00 గం. ల నుంచి సాయంత్రం 6.00 గం. ల దాకా

పక్కనే కోండమీద ఋషి తపస్సు చేసిన స్ధలముందిట. కోండ ఎక్కాము. దోవలో చిన్ని అమ్మవారి గుడి. ఇంకోంచెం పైకి వెళ్తే పుట్ట... పక్కనే పెద్ద బండరాళ్ళకింద తడికలు, రెల్లు గడ్డి తో తయారు చేసిన ప్రదేశంలో దుర్గ,వినాయకుడు,పరశురాముడు,శివలింగాల బోమ్మలు వున్నాయి దాని పక్కన కోండ రాళ్ళ కిం జనమేజయుడు తపస్సు చేసిన ప్రదేశంట...చుట్టూ పుట్ట ఏర్పడిందట అప్పుడు..దంపతులు పూజారులుగా వున్నారు.


వనదుర్గ కూడా స్వయం భూ ... ఆకాలంనాటిదేట. ఇంకా పైకి వెళ్తే చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు.
దరాబాదు నుంచి ఉదయం బయల్దేరి వెళ్తే సాయంత్రం తిరిగి రావచ్చు..అయితే ఆ రం, మంచినీళ్ళు తీసుకు వెళ్ళటం మరచిపోవద్దు.