ఆలయం ముందు మంటపం
ఆలయం
ఆలయ ముఖ ద్వారం
ఆలయం
ఆలయ ముఖ ద్వారం
కలబగూర్
శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం
చిట్కుల్ నుంచి వస్తూ వెళ్ళాము ఈ ఆలయానికి.
ఈ ఆలయం దర్శించి తర్వాత చిట్కుల్ వెళ్ళవచ్చు. సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే రోడ్ లో, సంగారెడ్డి జడ్. పి. ఆఫీసు దాటగానే (రోడ్ కి ఎడమ ప్రక్కనే వస్తుంది ఈ ఆఫీసు) ఎడమ వైపు రోడ్ లోకి తిరిగి సుమారు 3 కి. మీ. ల దూరం వెళ్తే వస్తుంది ఈ ఆలయం. మేము వెళ్ళేసరికి సాయంత్రం 3.40 అయింది. శివాలయం మూసివుంది గానీ అక్కడవున్న పూజారి తలుపు తీశారు. కరెంటు లేకపోవటంవల్ల బ్యాటరీ లైటుతో స్వామిని చూపించారు.
త్రికూట ఆలయంలో శివ కేశవులు వొక్కటే అని నిరూపించటానికా అన్నట్లు కాశీ విశ్వేశ్వరుడితోపాటు అనంతపద్మనాభస్వామి, వేణుగోపాలస్వామి కోలువుతీరి వున్నారు.
ఇది మంజీరా బ్యారేజ్ కి చేరువలో వున్నదట.
14వ శతాబ్దంలో కాకతీయులు దీన్ని నిర్మించారుట. వరంగల్ లోని వెయ్యి స్తంబాల మంటప నిర్మాణ శైలి ఈ కట్టడంలో కనిపిస్తుంది.
ఈ ఆలయాల్లో పూజాదికాలూ, అభిషేకాలూ ఇప్పటికీ జరుగుతున్నాయి.

2 comments:
Even i made a blog of my beloved village "ISMAILKHANPET" just give a glance and post in your blog
http://www.ismailkhanpet.blogspot.com/
ధన్యవాదాలు చందు రెడ్డిగారూ
ఇస్మాయిల్ ఖాన్ పేట సప్తప్రాకారయుత దుర్గాలయానికి రెండుసార్లు వెళ్ళాము మేమూ.
మీకూ, మీ కుటుంబానికీ నందన ఉగాది శుభాకాంక్షలు.
psmlakshmi
Post a Comment