Tuesday, May 5, 2009

ముమ్మిడివరం

భగవాన్ శ్రీ బాలయోగి మందిరం

ముమ్మిడివరం

సాయంత్రం 4 గం. లకు మురమళ్ళ లో బయల్దేరాము. త్రోవలో ముమ్మిడివరం బోర్డు చూసి మా చిన్నతనంలో బాలయోగిగారి గురించి చెప్పుకునే విశేషాలు గుర్తుకొచ్చి వాళ్ళు ఎంతోకాలం తపస్సు చేసిన ఆ ప్రదేశాన్ని సందర్శించటానికి చాలా సంతోషంగా వెళ్ళాము. మా ప్రయాణాలు చాలా వింతగా వుంటాయి లెండి. ఏవో రెండు మూడు చోట్లనుకుని బయల్దేరుతాము. త్రోవలో అంతకు ముందు మేము చదివిన విశేషాలేమైనా గుర్తొస్తే, ఆ ప్రదేశాలూ, ఇంకా ఆ ప్రాంతాల్లో కనుక్కోగా తెలిసే ప్రదేశాలు, ఒక్కోసారి మా ఆసక్తి గమనించి స్ధానికులు తెలిపే కొత్త ప్రదేశాలూ చాలానే చుట్టబెడతాము. ముందుగా మా ప్లానులో లేనివాటన్నిటినీ బోనసులనుకుంటాము. ముమ్మిడివరం మాకు బోనసే. దూరమేమో అనుకున్నాముగానీ మురమళ్ళనుంచి కేవలం 15 ని.ల కారు ప్రయాణం.

ఇద్దరు బాలయోగీశ్వరులు తపస్సుచేసిన పుణ్య స్ధలం ఇది. బహుశా చిన్నతనంలోనే వారు తపస్సు ప్రారంభించటంతో వారిని బాలయోగీశ్వరులన్నారేమో. భగవాన్ పెద్ద బాల యోగీశ్వరుల జననం 23-10-1930. ఆయన 16వ ఏటనే, 22-6-1946లో తపస్సు ప్రారంభించారు. ఆయన ఆహార పానీయాలు కూడా విసర్జించి తపోనిష్టలో నిమగ్నులయ్యారు. ఫిబ్రవరి 1949లో తమ తపస్సుకు అంతరాయం కలుగకుండా తలుపులు తాళం వేసి వుంచమని భక్తులకు చెప్పారు. ఆయన ఎపరికీ దర్శనమివ్వక నిరంతరం తపస్సులో మునిగి వుండటంతో భక్తులు నిరాశ చెందారు. ఒకసారి దర్శనమిచ్చినప్పుడు కనీసం ఏడాదికి ఒకసారైనా తమకు దర్శనమివ్వాలని భక్తులు ప్రాధేయపడటంతో వారి కోరిక మన్నించి, ఏడాదికొకసారి, మహా శివ రాత్రి మరునాడు ఉదయే 4 గం. లనుంచి, రాత్రి 12 గం. లదాకా భక్తులకు దర్శనమివ్వటానికి అంగీకరించారు. అప్పుడు కూడా ఆయన తపస్సులో నిమగ్నమై వుండేవారు. భక్తులు నిశ్శబ్దంగా అలతి దూరంనుంచి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు.

ఇంక భగవాన్ శ్రీ చిన్న బాలయోగిగారి జననం 3-11 1941. ఆయన తన 8వ ఏటనే 26-3-1950లో తపస్సు ప్రారంభించారు. ఈయనకూడా తాళం వేసివున్న గదిలో ఆహార పానీయాలు లేకుండా అనేక సంవత్సరాలు తపస్సుచేసి 28-10-1991 లో సమాధి చెందారు.

ఆహార పానీయాలు లేకుండా, తాళం వేసివున్న గదిలో నిరంతరం తపోనిష్టలో మునిగి ఆ ప్రాంతాన్ని పునీతం చేసిన ఈ మహానుభావుల గురించి మా చిన్నతనంలో అనేక కధలు చెప్పుకునేవారు. వారి దర్శనానికి వెళ్ళినవారిలో కొందరికి ఆ ప్రదేశంలో వారి తపో మహిమల వలన వింత దృశ్యాలు కనిపించేవట. అలాంటి పావన ప్రదేశాన్న దర్శించుకుని అలౌకిక ఆనందంతో మా తదుపరి మజిలీ ఐనవిల్లికి బయల్దేరాము.

7 comments:

durgeswara said...

sadgurualayogigaarini gurtu chesaaru.
dhanyavaadamulu

durgeswara said...

sadguruvulu baalayogigaarini gurtuchesaaru
dhanyavaadamulu

psmlakshmi said...

మహనీయులను గుర్తు చేసుకునే అవకాశం మాకు కలిగింది. మాతోబాటు అభిరుచి వున్నవాళ్ళకి కూడా ఒక్కసారి గుర్తుచేద్దామని మా ప్రయత్నం.
మీరూ గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు దుర్గేశ్వరరావుగారూ.
psmlakshmi

sree said...

ఎంతటి అదృష్టం మీది ఎన్నో పుణ్యక్షేత్రాల దర్శనం. అలానే మేము మీకన్నా అదృష్టవంతులం మీరు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి సంపాదించిన పుణ్యంలో మేము చదివి సగం తీసుకుంట్టాము కదా..? ధన్యులమండీ లక్ష్మి గారు

psmlakshmiblogspotcom said...

చాలా సంతోషం శ్రీగారూ
psmlakshmi

Manjula said...

Very nice blog Lakshmi garu!

psmlakshmiblogspotcom said...

Thank you Manjula garu
Pl. give your blog address
psmlakshmi