Saturday, January 2, 2010

ఆకట్టుకునే అనంతపురం జిల్లా--1



అనంతపురం జిల్లాలో దర్శనీయ స్ధలాలు చాలా వున్నాయి.  అయితే వీటికి సరైన ప్రచారం లేక కావచ్చు, సరైన వసతులు లేక కావచ్చు....అంత ప్రసిధ్ధికెక్కలేదు.

మేము ఉదయం 7-30 గం. లకు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లే బస్ లో బయలుదేరి మధ్యాహ్నం 2-50 గం. లకి అనంతపురం జిల్లాలోని గుత్తి చేరుకున్నాం.  హోటల్ లో రూమ్ తీసుకున్నాం.  సాయంత్రం  4-00 గంటల బస్ లో గుంతకల్ బయల్దేరాం.  గుంతకల్లు సమీపంలో కసాపురంలో వున్న నెట్టికంటి ఆజనేయస్వామి దర్శనం కోసం.  కసాపురం ఆంజనేయ స్వామి, నెట్టికంటి ఆంజనేయస్వామిగా ప్రసిధ్ధికెక్కిన ఈ దేవాలయం వున్న ప్రదేశం పేరు నెట్టికంటి.

నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్ధానం

5-00 గంటలకు గుంతకల్ చేరాం.  గుంతకల్ కి అతి దగ్గరలో వుంది కసాపురం.  గుంతకల్లునుంచి షేర్డ్ ఆటోలు, బస్సు వగైరాల సౌకర్యం ఉన్నది.  ఆటోలో 15 నిమిషాల ప్రయాణం మాత్రమే.

గుంతకల్లు సమీపంలోని ఈ ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది.  పెద్ద విగ్రహం.  దర్శన మాత్రాన మన ఆందోళనలన్నీ పోగొట్టి ఆభయమిస్తున్నట్లనిపిస్తుంది.

తిరుమలరాయలు ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ చాలాచోట్ల ఆంజనేయస్వామి దేవస్ధానాలు కట్టించి ఆంజనేయస్వామి విగ్రహాలని స్ధాపించారు.  అందులో ఇది ఒకటి.  స్ధలపురాణం ప్రకారం తిరుమలరాయలు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఒక చోట నిద్రిస్తుండగా కలలో స్వామి కనబడి ఆయన వెళ్ళే దోవలో ఎండిపోయిన వేపచెట్టు చిగురించినచోట తనకి గుడి కట్టి ప్రతిష్టించమన్నారుట.  ఆయన ప్రయాణంలో ఇక్కడ అలాంటి వేప చెట్టు కనబడి గుడి నిర్మించారు.

గుడి ప్రాంగణం పెద్దది.  ఆకు పూజకి అంటే దగ్గరలోని షాపులో 500 తమలపాకులు ఇచ్చారు.  గుళ్ళోనే వున్న ఇద్దరు ఆడవాళ్ళు (ఆలయ ఉద్యోగస్తులు) వాటిని అడిగి తీసుకుని త్రిభుజాకారంలో వున్న వెదురు చట్రంలో గుచ్చి ఇచ్చారు. ఆకు పూజలో తమలపాకులు విడి విడిగా పూజ చేయరు. పూజలో ఆ చట్రం స్వామి దగ్గర పెట్టి మనకిస్తారు.  గుళ్ళో కోతులు ఎక్కువ. వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త.

ఆ రోజుకి గుత్తి వచ్చి విశ్రాంతి తీసుకున్నాం.

మేము చీకటిపడి వెళ్ళటంతో ఫోటోలు తియ్యలేదు.  అందుకే ఫోటోలు లేవు. 

రేపటి విశేషాలు రేపు చెప్తానేం.

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

తిరుమల రాయలు కాదండి వ్యాసరాయలు.గుత్తి దగ్గరలోనే ఉన్న మా తాడిపత్రికి వచ్చారా లేదా? మీకు ఆతిథ్యమిచ్చే భాగ్యాన్ని మాకు కల్పించి ఉంటే బాగుండేది.

జయ said...

అనంతపురం జిల్లా కి అసలు ఎప్పుడు పోలేదండి. ఈ సారి చూడాలి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

psm.lakshmi said...

Vijaya Mohan garu
mee tadipatriki vachamandi. Bugga Rameswara Aalayam choostunte Karnataka loni Holebeedu gurtukochindi. chala bagunnayi.
Maaku Thirumala Rayalu ane chepparandi. names nenu eppatikappudu note chesukuntanu marchipotanani. sekarinchni samacharam kadandi, cheppina valla batti vuntundi andulo truth. thanks mee savaranaki, aahvanananiki.
psmlakshmi

psm.lakshmi said...

Jaya garu
Happy New Year.
Anantapuram district lo migata chotla vunna facillities vundavandi. anduku prepare ayyi velli randi.memu choosina vatilo Kasapuram, Gutti, Tadipatri, Lepakshi bagunnayi.
psmlakshmi