గుత్తికొండ
రెండో రోజు గుత్తికొండ చూడటానికి బయల్దేరాం. కొండదాకా ఆటోలో వెళ్ళాము. కొండ ఎత్తు ఎక్కువగానే వుంది. దోవ, పైదాకా రోడ్డులాగా విశాలంగా వుంది. దోవ అంతా ఆ కాలంలోనే పెద్ద పెద్ద గ్రెనేట్ రాళ్ళు (గోడ పునాదులకి వుపయోగించేలాంటివి) వేశారు. ఎక్కటానికి తేలిగ్గా వుంది, కానీ దిగేటప్పుడు స్లోపు మూలంగా కాలికి పట్టు దొరక్క కొంచెం ఇబ్బంది అనిపించింది. కొంచెం దూరం ఎక్కిన తర్వాత దోవలో సయ్యద్ సాహెబ్ దర్గా వుంది.
గుత్తికొండ మీద వున్ కోటకి 17 ద్వారాలు వున్నాయి. నీటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు బాగున్నాయి. బావులు చాలా వున్నాయి. మేము 6 బావులు చూశాం. అంత ఎత్తయిన కొండ మీద నీటి నిల్వకి ఆ రోజుల్లో తీసుకున్న జాగ్రత్తలు చూస్తే ఏ టెక్నాలజీ లేని రోజుల్లో, ఎంత ముదుచూపుతో ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నరోనని ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఏడాది దాకా అక్కడ కోటలో వాళ్ళెవరూ బయటకు రాకపోయినా దేనికీ ఇబ్బంది రాని విధంగా ఏర్పాటు చేసుకున్నారు. చాలా పెద్ద అశ్వశాల, ధాన్యాగారం, పైన పేలెస్ ఇప్పుడు లేదు కానీ శిఖరాగ్రాన ఒక గుండ్రటి స్టేజ్ లాగా ఎత్తయిన రాతి కట్టడం వుంది.
సందర్శకులెవరూ లేరు. అంత పెద్ద కొండమీద మేమిద్దరమే అయ్యేసరికి పైదాకా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంటే అనంతపురం నుంచి వచ్చిన ఒక కుటుంబం కలిశారు. అందులో ఒకరు శ్రీ భాస్కర్, గుత్తిలో సిండికేట్ బ్యాంకులో పని చేస్తున్నారు. వాళ్ళుకూడా రావటంతో పైదాకా ఎక్కాం. అన్నీ చూసుకుంటూ నెమ్మదిగా పైకి ఎక్కేసరికి 2-30 గంటల సమయం పట్టింది మాకు.
సాయంత్రం 4-30 కల్లా హోటల్ కి వచ్చి రూమ్ వెకేట్ చేశాం. తాడిపత్రి వెశ్దామని ప్లాన్. దోవలో తొండపాడు చెన్నకేశవ స్వామి గుడి బాగుంటుందంటే చూసి వెళ్దామని ఆటోలో బయల్దేరాం. అరగంటలో తొండపాడు చేరాం. కానీ అసలు గుడి కొండమీద వున్నది. కింద చిన్న గుళ్ళో ఉత్సవ విగ్రహాలు వున్నాయి. చుట్టూ యాత్రికులు వుడటానికి గదులున్నాయి. కొండమీదకి చాలా మెట్లున్నాయి. గుత్తికొండ ఎక్కి దిగాంకదా, ఇంక ఎక్కలేకపోయాం. ఆ గుడి దగ్గరే తాడిపత్రి బస్ ఎక్కాం. అక్కడినుంచి తాడిపత్రికి గంటన్నర ప్రయాణం. తాడిపత్రిలో బస్టాండు దగ్గరే హోటల్ లో రూమ్ తీసుకున్నాం.
తాడిపత్రి వివరాలు తర్వాత పోస్టులో.
అశ్వశాల – ఎంత పెద్దదో – ఫోటోలో అంతా రాలా
నీటి బావి
కొండమీద దృశ్యం
కొండ పైకి వెళ్ళే ద్వారం
4 comments:
తాడిపత్రికి వెళితే, ఆలూరు కోన చూడటం మరువకండి.
thanks ravi garu
tadipatri vallamu kani aluru kona sangati appudu teliyadu. akkadi viseshalu chepte next time veelayite tappaka choostamu.
psmlakshmi
ravi garu
meeru cheppinadi aaduru kona narasimha swami temple gurincha. choosamu. maa auto driver cheppi teesukelladu. lekapote maaku teliyadu dani sangati. adi, obulesakona kooda choosamu.
psmlakshmi
In my last visit to India, we went to Hampi and while returning back to Hyderabad we stopped at Guntakal and we went to Kasapuram Nekkanti Anjaneya swami temple. We were told that the temple was built by the Vijayanagara Dynasty Raja Guru. It a nice temple and there is a big leather pada raksha of swami.. never saw in any other temple!
Post a Comment