Wednesday, July 6, 2011

శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవస్ధానం, నెల్లూరు

ఆలయ గోపురం
ఆలయం లోపల దశ్యం
ఆలయం వెనుక పినాకినీ నది

శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవస్ధానం, నెల్లూరు

ఆలయం: శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి ఆలయం

స్ధలం: రంగనాయకులపేట, నెల్లూరు

రవాణా సౌకర్యం: నెల్లూరుకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యం వున్నది.

వసతి: నెల్లూరు పట్టణంలో అనేక హోటల్స్ వున్నాయి.

దైవం: శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాధ స్వామి

అమ్మవారు: రంగనాయకి

ఆలయ నిర్మాణ సమయం: 7 – 8 శతాబ్దాలలో

దర్శన సమయాలు: ఉదయం 6-30 నుంచీ మధ్యాహ్నం 12 గం. ల దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచీ రాత్రి 9-00 గం. ల దాకా

విశేషాలు: ఉత్తర శ్రీరంగంగా ప్రసిధ్ధిగాంచింది.

దేవాలయం వెనుక ద్వారం బయట పినాకినీ (పెన్నా) నది ప్రవహిస్తూన్తున్ది.

కధా కమామీషూ

ఈ క్షేత్రం గురించి స్కాంద పురాణంలో ప్రస్తావించబడింది. ఒకసారి శ్రీమన్నారాయణుడు భూలోక విహారం చేయాలనుకుని ఆదిశేషుని క్రీడా శైలముగా వెలియవలసినదిగా ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం ఆది శేషుడు భూ లోకంలో పినాకినీ తటాన ఒక పర్వతంగా ఆవిర్భవించి, సత్య లోకందాకా ఎదిగాడు. దానితో మానవులంతా యజ్ఞ యాగాదులేమీ చెయ్యకుండానే విష్ణులోకం ప్రవేశిస్తూండటంతో దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరకెళ్ళి ఆయనని ప్రార్ధించగా, ఆయన ఈ గిరి పై తన పాదాన్ని మోపాడు. ఆది శేషుడు సంతుష్టుడై భార్యా సమేతంగా విష్ణుమూర్తిని అనేక విధములుగా ప్రార్ధించగా స్వామి సంతోషించి, ఈ గిరి నీ పేరున తల్పగిరిగా ప్రఖ్యాతినొందుతుందని వరమిచ్చాడు.

తర్వాత కశ్యప మహర్షి ఈ క్షేత్రంలో పౌండరీక యాగం చేశాడు. 11 వ రోజున వపా హోమం సమయంలో విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. కశ్యప మహర్షి కోరికమీద ఆ క్షేత్రంలో శేషశాయియై వెలసి భక్తులకు అభయ ప్రదాతగా నిలిచాడు.

క్రీ.శ. 7 – 8 శతాబ్దములలో సింహపురిని పాలించిన పల్లవ రాజుల సమయంలో పునరుధ్ధరింపబడిన ఈ ఆలయం తదుపరి అనేక రాజుల పరిపాలనలో అభివృధ్ధి చెందింది.


0 comments: