శ్రీ సీతారామస్వామి ఆలయం, సీతారాంబాగ్, హైదరాబాదు.
ఇవాళ హైదరాబాదులోని మల్లేపల్లి సమీపంలో వున్న సీతారాంబాగ్ లో వున్న శ్రీ రామాలయాన్ని దర్శించాము. పెద్ద కోటలాంటి ప్రాకారంలో వున్నది ఈ ఆలయం.
ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం (బయటనుంచి)
ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం (లోపలనుంచి)
ప్రధాన ప్రవేశ ద్వారంగుండా లోపలకి వెళ్తే విశాలమైన ఆవరణలో నివాస గృహాలు వున్నాయి. ఎదురుగా రామకోటి స్తూపం. అక్కడ పక్కనే వున్న ద్వారంగుండా లోపలికి వెళ్ళాలి.
విశాలమైన ఆవరణలో మండపాలు దాటి వెళ్తే ఇదిగో ఈ మండపానికి ఎడమ ప్రక్క శ్రీరామచంద్రుని ఆలయం, ఎదురుగా కనబడే ద్వారంనుంచి వెళ్తే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వున్నాయి.
ఇదిగో ఇదే శ్రీరామచంద్రుని ఆలయ ప్రవేశ ద్వారం.
<!--[if gte mso 9]>
ఇందులో శ్రీ సీతారామస్వామి పట్టాభిషేక మూర్తి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో సహా కొలువుతీరి వుంటారు. ఉత్సవ విగ్రహాలు సీతా రాములవి, వాటి దిగువ శ్రీ వెంకటేశ్వరస్వామి, పద్మావతి, వాటి దిగువ రాధా కృష్ణులవి వుంటాయి.
300 ఏళ్ళ క్రితం రాజస్తాన్ నుంచి కొన్ని మార్వాడీ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసించసాగాయి. వారు అప్పటి నవాబులని హిందూ దేవాలయము నిర్మించుకోవటానికి స్ధలం అడుగగా నవాబుగారు ఇక్కడ ఇచ్చారు. అప్పుడు వారిచే నిర్మింపబడిన ఈ ఆలయాలు ఇప్పటికీ ఆ మార్వాడీ కుటుంబాలవారి ఆధ్వర్యంలోనే వున్నాయి.
ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఇంకో ప్రాకారంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వున్నది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళే దోవలో ఈ పుష్కరిణిలో నీరు పరిశుభ్రంగా లేకపోయినా ఆ కట్టడం ఎంత బాగుందో చూడండి.
రామాలయంలో శ్రావణమాసంలో 9 రోజులు డోలోత్సవం చేస్తారుట. ఉత్సవ విగ్రహాలను గర్భగుడి బయట ఊయలలో వుంచి ఉత్సవం చేస్తారు. అది చూసి తిరుగు ప్రయాణమయ్యాము.
ఆలయం సమయాలు మధ్యాహ్నం 12 గం.లదాకా, మళ్ళీ సాయంత్రం 5గం. లనుంచి రాత్రి 8 గం. లదాకా.
0 comments:
Post a Comment