Tuesday, August 9, 2011




శ్రీ రామాలయం, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా

హైదరాబాద్ లో ఎయిర్ పోర్టుకి వెళ్ళే దోవలో వున్నది శంషాబాద్. శంషాబాద్ బస్ స్టాప్ పక్కనే వున్న రోడ్డులో దాదాపొక రెండు కిలో మీటర్లు లోపలకి వెళ్తే వస్తుంది విశాలమైన ఆవరణలో వెలిసిన శ్రీ రామాలయం. ఆవరణ పెద్దదేగానీ ఆలయం చిన్నదే. చుట్టూ ప్రహరీ గోడకి లోపలవైపు వరండాల్లాగా..బహుశా వచ్చినవారు విశ్రాంతి తీసుకోవటానికేమో.

అక్కడి పూజారిగారు శ్రీ సత్యన్నారాయణగారు చెప్పిన విశేషాలు. ఈ ఆలయం 13 వ శతాబ్దం నాటిది. ఎవరు కట్టించారో చరిత్ర తెలియదు. అయితే ఇది కోదండరాముడి ఆలయం. రాముని ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం వున్నాయి. వనవాసం సమయంలో శ్రీరాముడు ఈ ప్రాంతం లో సంచరించారు. శ్రీ రాముడు వనవాసం చేసిన ప్రదేశాల్లోనే కోదండరాముణ్ణి ప్రతిష్టిస్తారుట. వేరే ప్రదేశాలలో పట్టాభిషేక రాముణ్ణి ప్రతిష్టిస్తారు.

శ్రీ సీతా రామ లక్ష్మణుల విగ్రహాలు మకర తోరణాలతో సహా ఒకే రాతిలో చెక్కబడ్డవి. శ్రీరామ విగ్రహం మకర తోరణంలో దశావతారాలు అందంగా చెక్కబడ్డవి.

శ్రీ రాముడు ఈ ప్రదేశానికి వచ్చిన సమయంలో ఆంజనేయస్వామితో పరిచయం కాలేదు. అందుకే రాముని దగ్గర ఆంజనేయస్వామి వుండరు. అయితే అంత గొప్ప రామభక్తుడు లేని రామాలయం వుండదు కదా..అందుకే ఆయనని ఎదురుగా ధ్వజస్తంబము దగ్గర గరుక్మంతుడి పక్కన ప్రతిష్టించారు.

ఈ ఆలయం చిన్నదయినా విశాల వాతావరణంలో చాలా ప్రశాంతంగా, శుభ్రంగా వున్నది. ప్రశాంతంగా కొంచెం సేపు గడపాలనుకునేవాళ్ళు తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఇది.

ఆలయ గోపురం


ఆలయమూ ..గోపురమూ
గరుక్మంతుడి పక్కన కొలువైన ఆంజనేయస్వామి
ఆలయం బయట మండపం


1 comments:

Chitajichan said...

I am pleasantly surprised Lakshmi garu. Office lo koodali choostu unte.. Nananramguga temple ani kanipinchi.. arrey evaro ee gudiki vellinatunaaru ani link open chesi.. photos choostu scroll down chese sariki Suma singapore chadivesariki okka saari startle ayaanu.. Tarvata gurtiki vachindi abt my email to you. I couldnt stop smiling... ventane maa husband ki link fwd chesi chudamani cheppi excitement share chesukundam anukunte tanaki telugu chadavatam raadaye.. evening intiki velaaka... pictures chupinchi.. chadivi vinipinchaanu.. :)


Photos chala baaga teesaru. swami vari darsam cheyinchinanduku many many thanks. Suma