చెన్నపట్టణ
కొంచెం ముందుకు సాగేసరికి రోడ్డుకి రెండువైపులా వున్న షాపుల్లో ముందు కనబడ్డవి చిన్న పిల్లలు ఎక్కి స్వారీ చేసే కొయ్య గుఱ్ఱాలు. హైవేమీద రోడ్డు పక్కన అన్ని గుఱ్ఱాలు వుండేసరికి ఏమిటా అని ఉత్సుకతతో చూశాము. అవి బొమ్మల షాపులు. చెన్నపట్టణ బొమ్మలకి ప్రసిధ్ధిచెందినది. ఎక్కువగా చెక్క బొమ్మలు వున్నట్లు కనబడ్డాయి. అక్కడే కర్మాగారాలలో తయారయిన బొమ్మలు … దూరానికే ఆకర్షణీయంగా కనబడ్డాయి. మన కొండపల్లి, ఏటికొప్పాక వగైరా బొమ్మలలాగా వాటి ప్రత్యేకత వాటికి వుండవచ్చు. సమయాభావంవల్ల దగ్గరకెళ్ళి వాటిని చూడకుండా ముందుకు సాగాము.
2 comments:
కొయ్య గుఱ్ఱాల ఫోటో తీస్తే పెట్టరూ?
సారీ నాగేస్రావ్ గారూ
నేనంత ఆలోచించలేదు. అసలు చెన్నపట్టణ చూడలేదుగనుక పోస్టుకూడా అనుకోలేదు. కానీ బొమ్మల అవసరం వున్నవాళ్ళకి ఉపయోగపడుతుందని పెట్టాను.
psmlakshmi
Post a Comment