నంబి
నారాయణ ఆలయం, తొండనూరు
మద్దూరు నుంచి
తొండనూరు చేరుకున్నాము.
పాండవపుర తాలూకాలోని ఈ వూరి పూర్వ నామధేయం కిరై తొండూరు. తొండనూరు అంటే చాలామంది చెప్పలేకపోయారు.
చివరికి
ఒకరు ఈ పాత
పేరు చెప్పి దోవ చెప్పారు.
విశిష్టాద్వైత మత ప్రచారకుడు
శ్రీ రామానుజులు వూర్వం ఇక్కడ చాలాకాలం నివసించి, తన మత ప్రచారాన్ని
ఇక్కడనుంచే కొనసాగించారు. ఆయన ఇక్కడ ఎన్నో మహిమలను చూపించారు. ఆ కాలంలో హొయసాల రాజైన బిట్టి దేవర
జైన మతస్తుడు. ఆయన కూతురికి
దయ్యం పట్టి ఎన్ని రకాల వైద్యులకి చూపించినా నయంకాక తల్లడిల్లుతున్న
సమయంలో శ్రీ రామానుజులు చిటికెలో నయం చేశారు. శ్రీ రామానుజులవారి తేజోస్వరూపానికి, ఆయన బోధలు, మహిమలకు
ఆకర్షితులైన బిట్టిదేవర తన భార్యతోసహా వైష్ణవ మతం తీసుకుని విష్ణువర్ధనుడయ్యాడు.
ఆ సమయంలో విష్ణువర్ధనునిచే నిర్మింపబడిన
ఈ ఆలయం బేలూరులోని చెన్నకేశవాలయంలాగానే వుంటుంది.
వెయ్యి సంవత్సరాలపైన చరిత్రగల ఈ ఆలయం లోపు కళాత్మకంగా తీర్చి
దిద్దబడ్డ స్ధంబాలు బేలూరు ఆలయాన్ని పోలి వుంటాయి. ఈ ఆలయంలో నాలుగు స్తంబాలు అమరశిల్పి
జక్కన్న చెక్కినవంటారు. శ్రీ రామానుజాచార్యులవారు తొండనూరులో ఒక సుందర తటాకం కూడా నిర్మించారు. ఈ తటాకంలో నీరు ఎప్పుడూ ఎండి పోదు. చాలా స్వఛ్ఛంగా వుంటుందికూడా. ఒకసారి టిప్పుసుల్తాన్ ఇక్కడికి
వచ్చినప్పుడు ఆయన మెడలోని ముత్యాల హారం తెగి ముత్యాలు నీటిలో పడ్డాయిట. ఆ ముత్యాలను పైనున్నవారు స్పష్టంగా
చూడగలిగారుట. అందుకే
టిప్పు సుల్తాను ఈ తటాకాన్ని మోతీ తలాబ్ అని పిలిచారు.
ఈ ఆలయంలో నంబి నారాయణుని విగ్రహం 18 అడుగుల ఎత్తు వుంటుంది. శ్రీ రామానుజుడు ప్రతిష్టించిన ఈ నారాయణుడు చతుర్భుజుడై, శంఖం, చక్రం,
గద, పద్మాలతో అలరారుతున్నాడు. నంబి అంటే నమ్మకం. నమ్మి కొలిచేవారిని రక్షించే నారాయణుడు.
అమ్మ అరవిందనాయకి. ఇక్కడ శ్రీ రామానుజులవారు తపస్సు చేసిన ప్రదేశంలో పాదాలు, శంఖం, చక్రం, నామాలు వున్నాయి.
గర్భగుడి
ముందు మండపంలో ఉపాలయాలలో విష్వక్సేనుడు, రామానుజుడి శిష్యుడు
తొండనూరు నంబి, ఇంకా ఇతర ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి. సువిశాలమైన ఆలయం, పెద్ద పెద్ద స్తంబాలతో విరాజిల్లుతోంది. ప్రహరీ కోట గోడలా వున్నది.
మేము వెళ్ళినప్పుడు కరెంటు లేదు. మేము ఆలయం బయటకురాగానే అక్కడవున్న
ఒక వ్యక్తి ఒక పెద్ద అద్దం తీసుకుని లోపలకి ఫోకస్ చేసి మమ్మల్ని పిలిచి చూపించాడు. ఎంత అద్భుతమైన దృశ్యమది. చుట్టూ చీకటి..స్వామి మూర్తి అద్దం ఫోకస్ లో వెలిగిపోతోంది. స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యారా అన్నట్లుంది
ఆ దృశ్యం.
ఈ ఆలయం ఫోటోలు కావాలంటే శ్రీరంగపట్నంనుంచి
పర్మిషన్ తెచ్చుకోవాలి. అది
లేకుండా ఫోటోలు తియ్యనియ్యరు. అందుకే బయటనుంచి తీసిన ఫోటో మాత్రమే ఇవ్వగలుగుతున్నాను.
దర్శన సమయాలు ఉదయం 9-30 నుంచి సాయంత్రం 5-30 దాకా.
దర్శన సమయాలు ఉదయం 9-30 నుంచి సాయంత్రం 5-30 దాకా.
5 comments:
ee aalayamnu chakkaga parichayam chesaaru, keep writing.
అదే లీల వైభవం ఎవరో అద్దం తీసుకు రావటం మీకు ఆ సూర్యకాంతి ప్రతి ఫలింపులో స్వామీ తన రూప వైభవాన్ని చూపటం అంటే బ్రహ్మాండం.సూర్యుడు ప్రత్యక్ష నారాయణరూపం, ఆత్మశక్తికి సంకేతం మరి ఈ వెలుగులో స్వామీనీ మీరు చూడటం అంటే స్వామీ తన స్వ స్వరూపన్ని మీ చక్షువులు అనుగ్రహించే విధంగా మీకు సాక్షత్కారం.చాల మందికి స్వఫ్నదర్సనం అనుగ్రహించే స్వామీ మీకు ఇక్కడ తన లీలను వేరే విధంగా అది మీరు
జాగ్రుతంగా వున్నప్పుడు చూపారు. మీరు ఈ విషయం పై కొద్దిగా ఆలోచించినట్లు కనబడలేదు.యధాలాపంగా జరిగినది లా వున్నదిగా భావిస్తున్నారు.కాదు.
మీరు ధన్యులు.
the tree garu
thank you very much
psmlakshmik
రమేష్ బాబుగారూ
చాలా బాగా చెప్పారు. అద్దం అలా ఫోకస్ చేసి స్వామిని చూపిస్తారని మేము అస్సలు వూహించని విషయం. కానీ అక్కడ అలా చేస్తారేమో తెలియదు. ఎందుకంటే అద్దం అక్కడ రెడీగా వుంది. చూపించినతను ఆలయానికి సంబంధించిన మనిషే. మీరన్నట్ల స్వామి అంత అద్భుత దర్శనమిచ్చి మమ్మల్ని కటాక్షించారు. కళ్ళు మిరుమిట్లుగొలిపే ఆ దర్శనాన్ని మరచిపోలేము. ధన్యవాదాలు.
psmlakshmi
the tree garu
thank you very much
psmlakshmik
Post a Comment