Saturday, September 19, 2009

యాత్ర కొనసాగించాలా? వద్దా??

స్వప్న@కలల ప్రపంచం, నా బ్లాగులో ఒక కామెంట్ చేశారు. మీకు ఇన్ని డబ్బులు ఎక్కడివండి మీ ఆయన బాగా సంపాదిస్తారా అన్ని చోట్లకి వెళ్ళి చూస్తారు..మీ ఓపికకి మెచ్చుకోవచ్చు అని. దీనికి నేను సమాధానం రాశాను కానీ దానిమీద ఒక్క కామెంటు కూడా రాకపోయేసరికి కొంచెం అసంతృప్తిగా అనిపించి ఈ పోస్టు రాస్తున్నాను.

స్వప్నా, మీరు వయసులో చాలా చిన్నవారు. అందుకే ఒక పరిధిలోనే ఆలోచించారు. అవునూ, మీరూ ఉద్యోగం చేస్తున్నారు. బస్ మిస్ అయితే ఆఫీసుకి ఎవరి పర్మిషన్ అడగకుండానే ఆటోలో వెళ్తున్నారు...అంటే మీ ఉద్యోగం మీకు కొంత ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందనేకదా అర్ధం. అలాగే నేను కూడా అనే ఆలోచన రాలేదా నేనూ 40 ఏళ్ళు ఉద్యోగం చేశానండీ. నేను చేశానని మా ఆయన మానేయలేదులెండి...పాపం ఆయనా ఆయన ఉద్యోగం చేశారు అన్నేళ్ళూ. సంసార సాగరంలో అనేక సుడిగుండాలుంటాయండీ...వాటిలో చాలా ఇంకా మీ ఊహల్లోకి కూడా వచ్చి వుండవు. అవ్వన్నీ దాటుకుని మేము నిలదొక్కుకునేసరికి ఇద్దరం రిటైరయ్యాము. ఇన్నేళ్ళ ఇద్దరి ఉద్యోగంతో మేము మిగుల్చుకున్నది మా ఇద్దరి + మా ఇద్దరి పిల్లల చేతిలో పి.జీ. డిగ్రీ సర్టిఫికెట్లూ, వుండటానికో ఇల్లూ..అంతే. ఇలా క్లుప్తంగా చెప్తున్నానుగానీ ఈ భవసాగరాల సునామీలలో మేము సాధించిన వాటితో మాకు తృప్తి వుంది. ఎందుకంటే అన్నీ మా కష్టార్జితం. మా సంపాదన వివరాలు అయిపోయాయికదా.

ఇంక మా యాత్రల విషయానికొస్తే నాకూ, మావారికీ కొత్త ప్రదేశాలు చూడటం చాలా సరదా. మా అమ్మాయి (అమ్మాయి పెద్దదిలెండి) 9వ తరగతికి వచ్చేదాకా, పిల్లల్నికూడా ఏడాదికొకసారి కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడనుంచీ, రెండేళ్ళ క్రితందాకా వాళ్ళ చదువులతో ఎటూ కదలటం కుదరలేదు. రెండేళ్ళ క్రితంనుంచీ, పిల్లలు దగ్గర లేకపోవటం, ఆఫీసులో కొంత వెసులుబాటు దొరకటం, వగైరాలతో మళ్ళీ అరికాళ్ళ దురద ఎక్కువైంది.

మొదట్లో చాలామంది కుళ్ళుకున్నారు. కొందరు ఎదురుగానే అనేవాళ్ళు. నీకేమమ్మా మీవారు కూడా చక్కగా అన్నివూళ్ళూ తిప్పుతారు, మా ఇళ్ళల్లో ఆ సరదాలు లేవు అనేవారు. కొందరు ఫోన్ చేస్తే ఏ వూరునుంచి మాట్లాడుతున్నారు అనే వాళ్ళు సరదాగా. ఎప్పుడొచ్చినా ఇల్లు తాళమే వుంటుంది అసలెప్పుడన్నా ఇంట్లో వుంటారా అనేవాళ్ళు కొందరు, అంత ఓపిక ఎక్కడనుంచొస్తుంది మీకు అనేవాళ్ళు కొందరుఇలా ఎన్నో. మొదట్లో కొంత బాధ పడ్డా తర్వాత స్పష్టంగా చెప్పేదాన్ని. మాకు తిరగటం సరదా, ప్రస్తుతం ఓపిక, సమయం వున్నాయి. ఓపిక లేనప్పుడు మానేస్తాంలే అనేదాన్ని. తర్వాత వాళ్ళకి అర్ధమవటమేకాదు, మా గాలి తగిలి కొందరు మరీ మాలాగా కాకపోయినా ట్రిప్స్ వెయ్యటం మొదలు పెట్టారు.

ఇంక తిరగటానికి అన్ని డబ్బులెక్కడనుంచి వస్తాయి అనే ప్రశ్నకి ....

మాకు బట్టలు, నగలు కొనుక్కోవటం, ఆస్తులు కూడబెట్టుకోవటం వగైరాలకన్నా యాత్రలు చెయ్యటంలోనే ఆసక్తి ఎక్కువ. ఈ డబ్బులుంటే ఇంకో రెండు నగలు చేయించుకునేదాన్నేమోగానీ, వాటిని కాపలాకాయటం నాకు చాలా చికాకు. ఏదయినా అవసరానికుంటే చాలు. కానీ ఈ యాత్రల విషయంలో ఎంత తిరిగినా మాకు తృప్తి వుండటంలేదు. పిల్లలు దగ్గర లేకపోవటంవల్ల వచ్చిన ఒంటరితనాన్ని దూరం చేసుకోవటానికి కూడా కొంత తిరిగేవాళ్ళం.

ఇండియాలో మేము తిరిగిన ప్రదేశాలు ఎక్కువ ఖర్చయ్యేవికాదు. పెద్ద యాత్రలింకా ఏమీ చేయలేదు. ప్రస్తుతానికి ఒక కారు, మా వారికి దానిని డ్రైవ్ చేసే ఆసక్తి వున్నాయి. చాలా మటుకు దానిలో తిరిగినవే. ఖర్చు తక్కువ అవ్వటానికి కారణాలు ఇంకొన్ని

  1. ఉదయం బయల్దేరి సాయంత్రం 6, 7 గం. ల దాకా తిరగటం, ఆ టైముకి ఎక్కడో అక్కడ స్టే చెయ్యటం,
  2. సాధారణంగా వెళ్ళే రోజు ఆహారం ఇంట్లోంచే పేక్ చేసుకెళ్తాం
  3. స్టేకి స్టార్ హోటల్స్ చూసుకోం. కుటుంబీకులు వుండగలిగేవి, నీట్ గా వుండేవి చాలు.
  4. పెద్దవాళ్ళం కనుక బయట చిరుతిండి, చూసినదల్లా కొనటం వగైరా అనవసర ఖర్చులు వుండవు.
  5. ఎక్కడా షాపింగ్ చెయ్యం
  6. రష్ తక్కువగా వుండే సమయాల్లో వెళ్తాం కనుక స్పెషల్ దర్శనానికి వెళ్ళం.
  7. సొంత వాహనంలో వెళ్ళటంవల్ల దగ్గర దగ్గర స్ధలాలన్నీ ఒకేసారి చూస్తాం
  8. కారు కాకపోతే సమయాభావ సమస్య లేదు కనుక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాడతాం కానీ ఇద్దరి కోసం టాక్సీలు తీసుకోం.
  9. ఈ ప్రదేశాలన్నీ ఇప్పుడు చూసినవే కాదు. రెండేళ్ళనుంచి చూస్తున్నవన్నీ. నేను బ్లాగు మొదలు పెట్టకముందు చూసినవి కూడా వున్నాయి.

ఈ పోస్టులు చూసి మేము హ్యాపీగా తిరుగేస్తున్నాము, ఎక్కడా ఏ ఇబ్బందులూ వుండవనుకోకండి. చిన్న ప్రదేశాలలో కొన్ని చోట్ల తినటానికేమీ దొరకదు. కొన్ని చోట్ల వుండటానికి అవకాశం వుండదు. కొన్ని చోట్ల మేము వెళ్ళేసరికి చూడాల్సిన ప్రదేశాలు మూసేసి వుండేవి. ఈ పోస్టులు చదివి అక్కడికి వెళ్ళే వాళ్ళు మాలా ఇబ్బంది పడకూడదని వాటి వివరాలు కూడా ఇస్తుంటాను.

ఇంకో విషయం. రాసినవాటికన్నా రాయాల్సినవి ఇంకా చాలా ఎక్కువ వున్నాయి!!!!. అందుకే ఒక్కసారి అందరి అనుమానాలూ తీర్చాలని ఈ పోస్టు. అమ్మయ్య. అన్నీ చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి మేము చూసిన ప్రదేశాలగురించి ఇంకా రాయమంటారా వద్దంటారా?????????

15 comments:

శ్రీలలిత said...

మీకు, మీ వారికి తిరగడానికి ఉత్సాహం ఉంది. అది చాలు. మేము పిల్లల్ని సెటిల్ చేసినా కూడా ఎక్కువ తిరిగే అలవాటు లేదు. అందుకని మీరు అన్నీ తిరిగి రాసెయ్యండి. మేము చదివి పెట్టేస్తాం. పుణ్యం చెరి సగం. ఓ.కె..

Ramani Rao said...

మంచి వివరణ ఇచ్చారు లక్ష్మి గారు. ఎన్నో సుడిగుండాలని ఎదుర్కొని, యాత్రలలో ఆనందాన్ని చవిచూస్తున్నారు. మాకందరికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పొచ్చు. అభినందనలు. మనలో మనమాట అడిగానని అనుకొవద్దు చెప్పకుండ దాటేయద్దు ... తీర్థ యాత్రలు సరే.. కొంచం ప్రేమయాత్రలు కూడా...... :) అహ ఏమి లేదు మావారికెప్పుడన్నా కలలోనన్నా ఇలా ఎక్కడికన్నా వెళ్దాము అన్న అలోచన వస్తే మీ యాత్రల బ్లాగు ద్వార ప్రేమయాత్రల వివరాలు ...... దారి తెలుసుకొందామని....... ") (just kidding)

జ్యోతి said...

ఇది మీ బ్లాగు. మీ ఇష్టం. ఎవరికోసమో రాయట్లేదు. ఎవరికోసమో, ఎవరో ఎదో అన్నారని ఆపనక్కరలేదు. కామెంట్లు రాయకున్నా మీ బ్లాగును ఎంతో మంది ఫాలో అవుతున్నారు. లోకులు పలుగాకులు అని ఊరకే అన్నారా? కొనసాగించండి.

గీతాచార్య said...

ఇపుడే మీ బ్లాగు లింకందింది. ఇప్పుడిప్పుడే సంపాదనలో పడుతున్న వయసు నాది. నేనే దాదాపూ దక్షిణాదంతా తిరిగేశాను. ఉత్తరాదిలో చాలా చూశాను. ఎక్కువ బైక్ రైడ్స్. అలా అని డబ్బులున్నాయా అంటే అదీ లేదు. ఎక్కడ ఖర్చాలో ఎక్కడ దాచాలో తెలుసుకుని స్నేహితులమంతా కల్సి తలా ఇంతా వేసుకుని పనిగానిచ్చేస్తాం.

డబ్బు కాదండీ. తిరిగి తెలుసుకోవాలనే మనసుండాలి. మీ వివరణలు కాదు మాకు కావాల్సింది. మీరు ఓపికగా వివరించే యాత్రాకథనాలు. ఎవరో అన్నారని బ్లాగు కొనసాగించాలా వద్దా అని ఆలోచించకండి. మీకు ఇక చెప్పేవి ఏవీ లేవని అనిపించేదాకా ఆ ఆలోచన రానివ్వకండి.

కామెంటినా, కపోయినా చదివేవాళ్ళలో నేనూ ఒకడిని. మీకు వ్రాయటం ఇష్టం లేదంటారా? Then ok.We respect your decision. But, ఎవరో ఏదో అన్నారని మాత్రం మీ నిర్ణయాన్ని తీసుకోకండి.

భావన said...

భగవంతుడు మీకు చూసే ఆసక్తి వీలు కల్పించాడు. హాయి గా మా కళ్ళు కూడా పెట్టూకుని చూసెయ్యండి ప్లీజ్. ప్రతి పోస్ట్ కు కామెంటక పోయినా తప్పకుండా చదివే వాళ్ళలో నేనొక దానిని. అలా అనుకోకండి చిన్నపిల్ల అనుభవం లేక అని వుంటుంది, నిజం భార్యా భర్తలిద్దరికి ఒకే రకం అభిరుచి వుండటం గొప్ప అదృష్టం. మళ్ళీ మా కళ్ళు మీవి గా చేసుకుని చూసి మాకు చెప్పండి. లలిత గారన్నట్లు పుణ్యం చెరి సగం ఏం.. ఎన్నో అభినందనలతో

Valluri Sudhakar said...

అదాయాలు, అవసరాలు, అభిప్రాయభేదాలు ఇవన్ని ఏసంసారలలోనైనా ఉండేవే. కాని, మీ ఇరువురికున్న ఆసక్తి మాత్రం అనితరసాధ్యం. మేమూ అనేకసార్లు ప్లాన్లువేస్తాము, చిత్రమేమంటే అవన్ని ప్రభుత్వ పంచవర్షప్రణాళికల్లాగా అమలుచేస్తాము.

తెలుగుకళ said...

"ఆసక్తి ఉంటే ఆశక్తి దానికదే వస్తుంది " పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు నన్ను ప్రోత్సహిస్తూ ఈ మాట అన్నా అందులోని నిగూఢార్థం మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. ఒకే ఒక్క మాట ఘంటాపథం గా చెప్పగలను. మీరు పెట్టి పుట్టారు. మీ ఇద్దరి ఆసక్తులు కలవటం ఎంతో అదృష్టం. ’మేం యాత్రలు చేస్తూ ప్రపంచాన్ని చూస్తున్నా” అని గర్వంగా చెప్పుకోండి. మాబోటి వాళ్ళం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ ఇంటికి ఉద్యోగాలకు పరిమితమయ్యేవాళ్ళం కనీసం మిమ్మల్ని మీ బ్లాగుని చూసైనా మారడానికి ప్రయత్నిస్తాం.హ్యాపీగా దూసుకెళ్ళీపోండి .. మేం ఫాలో ఐపోతాం.... పదండి ముందుకు పదండి ముందుకు.... పోదాం పోదాం పైపైకి...

మరువం ఉష said...

In the movie "Namesake" the main role tells that he reads books, as his grand father told him they are for virtual touring around the world. [not exact dialogue but a gist of it] I like to read about places, travels, tours and the experiences that peopole share.

నాకు ఓ back pack తో యాత్ర ముఖ్యంగా అడవులు, ప్రకృతి సహజ అందాలు చూడగల ప్రయాణం చేయాలనుంది. ఆ కల నెరవేరుతుందని ఆశ కూడా వుంది. మీరు ఇలాగే మీ అనుభవాలు పంచండి.

మా నాన్న గారు ఉద్యోగరీత్యా నివసించిన ప్రతిచోటా దగ్గర ప్రదేశాలు చూపించేవారు. అంతే కాక ఆ స్థల విశేషాలు మాకు తెలిసేంత వివరంగా చెప్పేవారు. మీ మాదిరే భోజనం, వసతి విషయంలో ఆలోచించేవారు. నాదంటూ జీవితం వచ్చాక కొంత "ఆసక్తులు కలవటం" పరంగా, ఆలోచనల రీత్యాగాను, ఉద్యోగజీవిత వత్తిళ్ళు, సమయాభావ సర్దుబాట్లు తప్పటం లేదు.

deeps said...

It is heartening to see so many positive responses ........what else can a blogger ask for?
There are people who wish to travel but cannot, then there are people who travel but may not have the desire to share, and then there are people like you, who do both. This is in fact a treat to all the followers of this blog.
I personally know how much u put into this blog. This transition
from being a person who uses the computer only to play solitaire, to one writing a blog involved hours in front of the computer, loads of patience, and not to forget, overcoming the various technical challenges the computer presented to u. So, I do understand this response of yours now. I am proud of your effort, so go on.... fire away......and please do not deprive us from the many dreams, discoveries and adventures that lay in this travelogue!!!

psm.lakshmi said...

శ్రీలలితా
ఆశ దోశ అప్పడం, వడ, మా పుణ్యమంతా కొట్టేద్దామనే. అదేం కుదరదు. అప్పుడప్పుడూనన్నా మీరూ అలా తిరిగి రండి.
సరేగానీ, సగం ఏంటండీ, సాంతం తీసేసుకోండి. మమ్మల్ని ఇంకా తిరగమని చెప్తున్నారుకదా, దానికే ఈ బహుమతి.
ధన్యవాదాలు,
దసరా శుభాకాంక్షలతో
psmlakshmi

psm.lakshmi said...

రమణీ
మీవారికి మీరు ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో పాటే రోజూ వినిపిస్తున్నట్లున్నారు. కొంచెం ఆ పాట మార్చండి. ఒక అవిడియా చెప్పనా ఏదో ఒక స్పెషల్ అకేషన్ చూసుకుని మీరే ఓ 3, 4 రోజులకు మంచి టూర్ ప్లాన్ వేసి (గుళ్ళు ఎక్కువ పెట్టద్దు) అన్నీ బుక్ చేసి, సామాను కూడా సర్దేసి, మీ వారిని అలా వెళ్ళొద్దా, పదండి అని బయల్దేరదీసి సర్ ప్రైజ్ చెయ్యండి. తర్వాత సర్ ప్రైజ్ లన్నీ మీకే. ఆల్ ది బెస్ట్.
ధన్యవాదాలు
దసరా శుభాకాంక్షలతో
psmlakshmi

psm.lakshmi said...

జ్యోతీ,
ఆవేశం తగ్గాక వచ్చిన ఆలోచన అదే. కానీ, జీవితంలో ఎంత అనుభవం వచ్చినా ఒక్కోసారి కోపం, ఉక్రోషంలో చిన్న పిల్లలకేమీ తీసిపోమనిపిస్తుందికదా. అయినా ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకన్నా అడిగిన తీరు బాధగా అనిపించింది. మీరూ సంపాదిస్తున్నారా అన్నా అంత బాధ పడేదాన్నికాదేమో. అక్కడికేదో మావారు సంపాదించిందంతా నేను ఖర్చు పెట్టేస్తున్నట్లు అడిగేసరికి హోల్ మొత్తం ఆడజాతికే అవమానమన్న లెవెల్ లో భాభాభాభాభాభాద పడిపోయాను. (నిఝం. ఇప్పటిదాకా మళ్ళీ బ్లాగు జోలికి పోలేదు. కామెంట్లు చదివాను కానీ ఏమిటో సమాధానం కూడా ఇవ్వాలనిపించలేదు. బ్లాగు పైరాగ్యమా) ఆ అమ్మాయి ప్రొఫైల్ చూశాక అనిపించింది చిన్న వయసు ఆవేశంతోపాటు ఏదో ఉక్రోషం (వెద్దదేమీ కాదులెండి, తనూ అలా తిరగి ఎంజాయ్ చెయ్యలేక పోతోందనే) కూడా వుండి వుండవచ్చు అనిపించింది. చదివేవాళ్ళల్లో అలాంటి అసంతృప్తులేమన్నా పెంచుతున్నానా.....నా బ్లాగు ద్వారా మంచికన్నా చెడు జరుగుతోందా అనే అనుమానంతోనే అభిప్రాయాల కోసం ఈ పోస్టు రాశాను. స్పందించినందుకు ధన్యవాదాలు.
దసరా శుభాకాంక్షలతో
psmlakshmi

psm.lakshmi said...

గీతాచార్యా
మీ బ్లాగులో మీ భావుకతను చూశాను. పై కామెంట్లో నిర్మొహమాటంగా, నిస్సంశయంగా చెప్పదలుచుకున్నది ఎలా సూటిగా చెప్పాలో తెలుసుకున్నాను. మీకు చక్కని భవిష్యత్ వుంది. అదే స్ఫూర్తితో ఒకమాట చెప్పనా, మీరు కామెంటు చేశారంటే నాకు చాలా సంతోషమనిపించింది. సూత్రధారులను కనుక్కున్నాను. God bless you.
psmlakshmi

Unknown said...

swapna@kalaprapaMcham,

one suggestion to you as well.
I have seen your profile photo and your saree seems to be very costly. Even your hair style seems to be very posh. Hope you must be spending a lot on shopping & Beauty parlors.
I have a sincere request to you.
Starting from now, whenever you go to shopping/parlor, please donate at least 500 rs to an orphanage. Also minimize parlor expenses, and donate that money to orphanages. Please help society.
Hope you will take this in right sense

శ్రీనివాస్ said...

amma(shall i call like dis)......
i like ur enthusiasm on travelling.first time i saw ur posting on @swapna.i also love to see different places.without seeing Ap or india...wat is the use of our birth in india.every one born&died..wats the use??? Life is not only for hunting money...between that so much is there.even i am in starting stage of life...i am going to do job.but...from now only i am planning to see all places.i dont like in future my kid mugs kutubminar in delhi and charminar in hyd.when i was child ...i had so much confusion.i dont want this for my kids.i am sincerly appreciating ur efforts.today onwards,i also follow ur blog n i want see all places which u mentioned.coming to swapna-kalalaprapancham, she is a little kid.i also follow her blog.dont take her comments to heart.little kid is always kid,many times they entertain us but some times they may hurt us.take this very lite.there is no need to comment on her issue.simply this is time waste.thank u.ALL THE BEST FOR UR FUTURE TRIP.