శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో,
మచిలీపట్నంలోని 54 అడుగుల సాయిబాబా విగ్రహం
శ్రీ విఘ్నేశ్వరుని అండదండలతో
సాగుతున్న మా యాత్రలలో మరచిపోలేని అనుభవాలు అనేకం.
ఈ యాత్రలలో అనేక సార్లు ఆత్మీయలు తోడు వచ్చినా
ఎక్కువగా కాలి దురదపెట్టేది నాకూ మా శ్రీవారు శ్రీ వెంకటేశ్వర్లకే.
మెకన్నా ఐలాండ్ లో
మేమిద్దరం కొండలు ఎక్కాం, కోనల్లో తిరిగాం.
ప్రసిధ్ధమైనవే కాదు, శిధిలావస్ధలో వున్న దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు కూడా దర్శించాము.
నాందేడులోని గురుద్వారా
మెదక్ చర్చి
పిల్లలకోసం అమెరికాకి వెళ్ళాం.
అక్కడ గడ్డకట్టే చలిలో వణికాం
మిచిగాన్ లో
బేడ్ లాండ్స్ లో ఎండకి మాడాం.
ఎల్లో పార్కులో గీజర్లు కూడా చూశాము.
డెన్వర్ లోని ప్రపంచ ప్రసిధ్ధికెక్కిన రెడ్ రాక్స్ యాంఫీ ధియేటర్ స్టేజ్ మీద నిలబడి చాలా గొప్పగా భావించాము.
అందమైన ప్రకతి దశ్యాలను కెమేరాలో బంధించటానికి ప్రయత్నించాము.
అమెరికాలో మమ్మల్ని ఆప్యాయంగా పలకరించిన పసిపిల్లలతో ఆడుకున్నాం.
అంతేకాదు.. అక్కడ బహుమతులు కూడా గెలుచుకున్నాము.
సెడార్ పాయింట్
ఇలా ఒకటా రెండా ఎన్నని చెప్పమంటారు. మరి కొన్ని విశేషాలు రేపటి పోస్టులో. అసలు సర్ ప్రైజులు కూడా అప్పుడే.
7 comments:
bagunnayi photos. miru yaathra chesinappudalla oka rs.1000 evarikina peda pillalaki donate cheyalani na manavi if you are interested. miku ila kuda punyam dakkutundi. naku telisi miru chala rich anukuntunanu, endukante anni places e okkati vadili pettakunda tirugutunnaru kabatti. ila thiragali ante chala money kavali.so ila chesi sahayapadandi endaro lenivallaki. This is just advice,please don't mind.
స్వప్నా
మీ కామెంటు చూసి మిమ్మల్ని అంచనా వెయ్యగలిగాను. కాస్త కలల ప్రపంచంలోంచి బయటకి రండి. మరీ టీన్స్ లో అమ్మాయిల్లా ఆలోచించకండి. జీవితంలో డబ్బుతో కొనలేని సంతృప్తులు ఎన్నో వున్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోండి.
మీ కామెంటుకి చాలా వివరంగా సమాధానం ఇచ్చాను. పోస్టు చెయ్యబోతే, మైల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత మాయమైంది. బహుశా మీ అదృష్టం అనుకుంటా.
మీరు ఇదివరకు రాసిన కామెంటుకు చాలా బాధపడి, మీ కామెంటుకి సమాధానం రాశాను. మీకు కామెంట్లు చెయ్యంటంలో వున్న సరదా దాని సమాధానాలు చూసుకోవటంలో లేదనుకుంటా. అదే బాధలో యాత్రలో ఒక పోస్టురాసి యాత్ర లో రాయటం కూడా కొన్నాళ్ళు ఆపేశాను. తర్వాత యాత్రని ఆసక్తితో చూసేవాళ్ళు అనేక మంది వుండగా మీలాంటి ఒకరి కోసం ఆపటం అవివేకం అనిపించి మళ్ళీ మొదలు పెట్టాను. అన్నట్లు ఆ పోస్టులో మా ఆస్తి వివరాలు, మేము యాత్రలు ఎలా చెయ్యగలుగుతున్నాము...అన్నీ రాశాను. మేమెంత రిచ్చో తెలుసుకోవాలనుకుంటే ఆ పోస్టు చదవండి.
జీవితంలో కొందరు వ్యక్తిగత కారణాలవల్ల ఆసక్తి వున్నా యాత్రలు చెయ్యలేరు. అంతేకాదు ప్రతి ఒక్కటీ డబ్బుతో ముడిపెట్టేవాళ్ళు కూడా జీవితాన్ని అనుభవించలేరు. మా జీవితాల్ని మేము అర్ధవంతంగా (డబ్బు అర్ధం కాదు) జీవిస్తున్నాము, మనుష్యుల్లాగా బతుకుతున్నాము. దీనికి మేము గర్వ పడుతున్నాము.
మేము యాత్రలు పుణ్యంకోసం చెయ్యటంలేదు. మన దేశ ఔన్నత్యం, పూర్వీకుల దాన తత్పరత, వారి కళా నైపుణ్యం, వివిధ ప్రాంతాల ప్రజల జీవన సరిళి, ఇంకా అనేక విషయాలు తెలుసుకోవచ్చు యాత్రలవల్ల...అందుకే స్కూలు సమయంలోనే పిల్లల్నికూడా ఎక్స్కర్షన్స్ కి తీసుకెళ్తారు. అంటే ఆ వయసునుంచే పిల్లలకి యాత్రల విలువ చెప్తారు.
పుణ్యమే కావాలంటే ఏం చెయ్యాలో తెలుసు...మోక్షం కావాలంటే చెయ్యాల్సిన తపస్సూ తెలుసు. మా పరిధిలో మేముండటమూ తెలుసు.
ఇప్పటికే మీ కామెంట్స్ కి సమాధానం రాస్తూ చాలా సమయం గడిపాను.
దయచేసి కామెంటు రాసేటప్పుడు డబ్బుతో ముడి పెట్టద్దు.
"అబ్బ, ఆంధ్ర ప్రదేశ్ లో ఇన్ని గుళ్ళు ఉన్నాయా?" మొట్ట మొదటి సారి మీ బ్లాగ్ చూసి నేను అనుకున్న మాట ఇది.మా అమ్మ, మా అత్తగారు "గు" అనగానే రెడీ అయిపోతారు వెళ్ళడానికి. కొంచెం తీరుబడి దొరికాక ఇద్దరినీ గుళ్ళకి తీసుకెళ్లాలని నాకొక ప్లాన్ ఉంది. మీ బ్లాగ్ చూసినప్పుడే డిసైడ్ అయిపోయ్యా. సుబ్బరంగా ప్రింట్ ఔట్లు తీసుకుని వాటినే guide లైన్స్ గా వాడాలని. కాపీ rights ఓపెన్ గానే పెట్టారు కాబట్టి పరవాలేదు. ఇంత చక్కగా ఇంట్రెస్ట్ తో మీ ట్రావెల్ జర్నల్ document చేస్తున్నారు. నా కన్నా పెద్దవారు కాబట్టి "good job " అనను. కాని నిజంగా గుడ్ జోబే.
స్వప్నా
ఇంకొక్క విషయం కూడా చెప్పాలి మీకు. నేను 36 ఏళ్ళపైన కొన్ని వేలమంది పనిచేసిన ఆఫీసులో పని చేసి అందరి చేతా అవుననిపించుకున్నదాన్ని. నా వృత్తి రీత్యాకూడా అనేకమందికి సహాయపడే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. వేరే అర్ధాలు తీసుకోకండి. నా జీతం తప్ప నేనొక్క పైసా ఎవరి దగ్గరనుంచీ తీసుకోలేదు. అందుకే ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో అక్కడక్కడా నన్ను గుర్తుపట్టి సంతోషంగా పలకరించే వ్యక్తులున్నారు (నేను వారిని గుర్తుపట్టలేకపోయినా)
కొందరికి డబ్బులు కూడబెట్టుకోవటం ఇష్టం, కొందరికి నగలు, షేర్లు, ఇలా రకరకాల ఇష్టాలుంటాయి. మాకు ఆ ఆస్తికన్నా కొత్త ప్రదేశాలు చూస్తే వచ్చే సంతృప్తి చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఎంతమందికి పంచినా తరగని ఆస్తి ఇది. ఆ కోణంలో చూస్తే మా దగ్గర చాలా సంపద వుంది.
psmlakshmi
కిరణ్మయి గారూ
చాలా సంతోషం. ఉత్సాహం వుంటే ఎప్పుడో తీరిక దొరుకుతుందని కూర్చోకుండా, ఎప్పుడు వీలైతే అప్పుడు, కనీసం దగ్గర వున్నవి చూడండి.
కాపీ రైట్స్ ఓపెన్ పెట్టానన్నారు..అదేమిటో నాకు తెలియదుగానీ...ఆ ప్రదేశాలు చూసేవాళ్ళు ఏ ఇబ్బందీ లేకుండా వెళ్ళి రావాలనే నా ఈ బ్లాగు ముఖ్యోద్దేశ్యం.
నాకు చేతకాదుగానీ, వీటిని ఇబుక్స్ గా పెట్టాలని వుంది.
అన్నట్లు రేపటి పోస్టు చూసి ఝాన్సీ లక్ష్మి మీద కామెంట్ చెయ్యండి.
psmlakshmi
ayyo lakshmi garu, miru enduku inthala react avutunnaro artam kavatledu. nenu emina thappu matladana, mi daggara money unte konchem peda pillalki help cheyandi annanu anthe kani vere uddeshyam ledu. ila chepte kuda thappuga ardalu tisukuntarani ippude telisindi. nenu denni money tho link pettadam ledandi. money unnatlayithe help cheyandi annanu anthe kani nenu compulsion ga help cheynadi ani cheppaledu. ekado communication gap vachindi.
miru pedda vallu miku cheppe antha age ledu kani na daggara. if u r interested ani, this is just advice, please don't mind ani kuda raasanu, mari miru enduku ila negative ga artam chesukunaro thelidam ledu. nenu chala manchiga cheppanu kani miru danni vetakaram ga tisukunaru. chala badaga undi manchi cheppina ila artam chesukuntunaru ee rojullo em chedam kalikaalam :(. ika epudu evariki ila manchi cheyamani cheppanu andi. baga telisi vachindi naku.
swapna@kalaprapaMcham,
one suggestion to you as well.
I have seen your profile photo and your saree seems to be very costly. Even your hair style seems to be very posh. Hope you must be spending a lot on shopping & Beauty parlors.
I have a sincere request to you.
Starting from now, whenever you go to shopping/parlor, please donate at least 500 rs to an orphanage. Also minimize parlor expenses, and donate that money to orphanages. Please help society.
Hope you will take this in right sense.
Post a Comment