Monday, March 1, 2010

నూరవ పోస్టు వేడుకలు....రండి...రండి
ప్రారంభించిన ఇన్నాళ్ళకి నా యాత్ర బ్లాగులో ఈ పోస్టుతో వంద పోస్టులు పూర్తయ్యాయి.  తెలుగులో కేవలం యాత్రలకోసం నిర్ణయింపబడిన బ్లాగు ఇదొక్కటేనేమో (ఇన్ని పోస్టులు వున్నది) అని నా అభిప్రాయం.  ఈ బ్లాగుని ఆదరిస్తున్న అందరికీ ఈ నూరవ పోస్టు వేడుకలకు ఆహ్వానిస్తున్నాను.

సుమ స్వాగతం  (టీవీ యాంకరు కాదండోయ్...ఈ పరిమళ భరిత కుసుమ స్వాగతం) 

అమెరికాలోని హాలండ్ నుంచి తులిప్స్ తో సుస్వాగతం.
 

ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్టీ చేసుకుందాం రండి రండి 
 
 
        నయాగరా జలపాత సోయగాలు

నయాగరా చూసి అలసిపోయారా  ఇదిగో ఈ అమెరికన్ పిజ్జా తినండి.  


 మధ్యలో పాప్ కార్న్ కూడా. అమెరికా, మిచిగాన్  రాష్ట్రంలోని  మెకన్నా ఐలాండ్ కి తీసుకొచ్చానండీ మిమ్మల్ని ఈ పాప్ కార్న్ కోసం.  ఇక్కడ 42 రకాల పాప్ కార్న్, పాప్ కార్న్ ప్రియులనలరిస్తున్నాయి.


అమెరికన్ పిజ్జా తిన్నప్పుడు ఐస్ క్రీమ్ కూడా అమెరికాదేనండీ.  న్యూయార్కునుంచి ఈ ఐస్ క్రీమ్ మీకోసమే.


 మరి ఆరోగ్యంకోసం పళ్ళో...ఇవిగో ఈ పళ్ళు తీసుకోండి.  అతి మధురమైన ఈ పళ్ళు మన దేశంలోవే. 
 
పర్బని,  మహారాష్ట్ర లోని  బత్తాయి తోట

ఏంటో అంటున్నారు....వినబడ్డదిలెండి....పోనీలే అడిగారుకదా అనీ... న్యూయార్కులోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంనుంచి....


అమ్మయ్య..పార్టీ బాగా ఎంజాయ్ చేశారా  ఇప్పుడు మా యాత్రా విశేషాలు...ఇప్పుడు మేము చూసిన ప్రదేశాలకన్నా యాత్రలలో మా విశేషాలు చెప్తాను....ఏమిటి  ఇప్పుడు టైము లేదంటారా  సరే అయితే తరువాత చెబుతాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి కొంచెం టీ తాగుతూ. 

విశేషాలు తర్వాత పోస్టులో.  మీ కోసం కొన్ని సర్ ప్రైజస్ కూడా.


17 comments:

KAMAL said...

సెంచరీ కొట్టారన్న మాట గుడ్ .

Maruti said...

బాగున్నాయండి మీ యాత్రా విశేషాలు మరియు ఫొటోలు.. వంద పోస్టులు పూర్తిచేసినందుకు గాను శుభాకాంక్షలు!!

శ్రీలలిత said...

వందటపాలు చేసినందుకుగాను హృదయపూర్వక అభినందనలు.

పరిమళం said...

@ లక్ష్మిగారు ,శత టపోత్సవ శుభాకాంక్షలు ..మీ ఆహ్వానం ...పార్టీ ....సూపరండీ ....త్వరలోనే లోకసంచారం చేస్తూనే ద్విశతాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నా :)

సుభద్ర said...

లక్ష్మిగారు,
అభిన౦దనలు..
పార్టీ అదిరి౦ది..మాకోస౦ ఐటమ్స్ అమెరికా ను౦చి తేవట౦ సుపర్..
మీరు త్వరలో మరో సె౦చరీ చేయాలని కోరుకు౦టూన్నా....

Muvvala Sairam said...
This comment has been removed by the author.
మధురవాణి said...

Hearty congratulations Lakshmi Garu.!

పానీపూరి123 said...

లక్ష్మిగారు, అభిన౦దనలు...

కొత్త పాళీ said...

అభినందనలు

చిలమకూరు విజయమోహన్ said...

మీయాత్ర అప్రతిహతంగా కొనసాగాలని కోరుకుంటూ,నూరవ యాత్రకు అభినందనలు.

durgeswara said...

subhaakamkshalu

జయ said...

లక్ష్మి గారు, అభినందనలండి.

Anonymous said...

లక్ష్మి గారూ మీరెంత అదృష్టవంతులోకదా ! ఎంచక్కా ఎన్నెన్ని యాత్రలు చేసేసారో . అభినందనలండీ

మాలా కుమార్ said...

నూరుటపాలు పూర్తి చేసినందుకు శుభాకాంక్షలండి .
మీ ఆథిద్యం అదిరింది . చక్కటి పార్టి ఇచ్చినందుకు ధన్యవాదాలండి .

రాధిక(నాని ) said...

వంద టపాలు పూర్తి చేసిన శుభసమయములో నా శుభాకాంక్షలు కూడా అందుకోండి .

భావన said...

ఇట్లాగే మీరెన్నో వందల యాత్రలు చేసి వందల పోస్టు లలో ఆ కబుర్లు మాక చెప్పాలని ఆశిస్తూ అభినందనలు లక్ష్మి గారు. ఇక్కడ అమెరికా లో వెజిటబుల్, ఫ్రూట్ పికింగ్ కు వెళ్ళలేదా ఆ ఫొటో లు పెట్టలేదు..;-)

చెప్పాలంటే...... said...

congrats andi 100 postlu daatinanduku. mee blog lo photola to kudina viseshaalu chalaa baagunnai.