Thursday, May 3, 2012

కూడ్లూరు



కూడ్లూరు

నదీ నరసింహస్వామి ఆలయంనుంచి మళ్ళీ మైసూరు రోడ్డులో బయల్దేరాము.  తెలుసుకున్నవి కొన్నీ, అస్సలు తెలియనివి కొన్నీ..మొత్తానికి ఆ ప్రాంతంలో ఏమీ వదిలి పెట్టకుండా చూడాలనే తాపత్రయం ఒకటి.  వీటితో దోవలో ఎక్కడ ఏ ఆలయం బోర్డు కనబడ్డా వెళ్దామనేదాన్ని.  ఇలా అయితే ఈ చిన్న ఆలయాలు తప్పితే ఏమీ చూడం అని శ్రీవారి విసుగులు.  అలా వెళ్ళిన ఆలయం ఈ మంగళేశ్వరస్వామి ఆలయం.  రహదారి మీదనుంచి లోపలికి చాలా దూరమే వెళ్ళాము.

700  -  800 సంవత్సరాల క్రితం ఆలయాలివి.  చాలా చిన్నవి.  కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారు.  పంచ లింగాలకు ఐదు చిన్న చిన్న ఆలయాలున్నాయి.  మేము వెళ్ళేసరికి స్వామి ముందు తెర వేసివుంది.  పూజారిగారు పది నిముషాలు కూర్చోమన్నారు.  సమయంలేదని వచ్చేయబోతుంటే తెర తొలిగించారు.  అంత అతి చిన్న ఆలయంలో కూడా స్వామిని దర్శిస్తుంటే  ఒక పవిత్ర ప్రదేశంలో వున్నట్లు భక్తి భావం తొణికిసలాడింది.  పురాతన ఆలయాలలో వున్న మహత్యం ఇదేననిపించింది.

ఉదయం 11-10 కి తిరిగి బయల్దేరాము.


2 comments:

సి.ఉమాదేవి said...

చక్కగా అక్షరయాత్ర చేస్తున్నాము.లక్ష్మిగారు,బాగుంది మీ వివరణ.

psm.lakshmi said...

ధన్యవాదాలు ఉమాదేవిగారూ
మొత్తానికి రచయిత్రి అనిపించారు. అక్షరయాత్ర..పదం బాగుంది.
psmlakshmi