Saturday, May 19, 2012

ప్రయాణంలో పదనిసలు






ప్రయాణంలో పదనిసలు

శ్రీశైలంవెళ్ళే దోవలో మామిడిపళ్ళు కనబడితే తోటనుంచి అప్పుడే తెచ్చినవి, సిటీలో ఇంతమంచివి దొరకవనుకుంటూ కొనేసుకున్నాం మా వదినగారూ నేనూ.  దోవలో టీ తాగుదామని ఆగాము.  కారు కిటికీ అద్దం ముయ్యటం మరచిపోయాము.  అంతే..ఓ కోతి ఇంచక్కావచ్చి కారులో వెనుకవైపువున్న మా మామిడిపళ్ళ కవరు  తీసుకుని, మొయ్యలేక మోసుకుంటూ అక్కడే ఓ ఇంటిమీదకెక్కి కూర్చుని పండు తీసుకుని తినటం మొదలు పెట్టింది. 

కోతుల గుంపులోకూడా అయినవాళ్ళూ, కానివాళ్ళూ వుంటారేమో.  కొన్ని కోతులు పళ్ళు చూసి వచ్చినా దూరంగానే కూర్చున్నాయి.  కొన్ని కోతులని ఈ తినే కోతి తరిమి కొట్టింది.  మధ్యలో వచ్చిన ఓ పెద్ద కోతికి మాత్రం పండిచ్చింది.  మొత్తానికి అవి మా మామిడిపళ్ళు తినేసినా వాటి విన్యాసాలు ఆ ఎండలో నా కెమేరాకి అందినంతమటుకూ బంధించి మీకు కూడా చూపిస్తున్నాను.  చూడండి మరి.
 
హమ్మయ్య
 
 అంతా నాకే.  నీకేం ఇవ్వను ఫో…

 
అసమదీయులు..షేర్ చెయ్యాలి..తప్పదు
 
 విందు భోజనం
 
 ఇంకా లేవా                     

2 comments:

మాలా కుమార్ said...

పాపం మీకూ , మీవదినగారి కి ఫొటోలే మిగిలాయా చొ చొ చొ :)

psm.lakshmi said...

అవిమాత్రం తక్కువా ఏమిటి వాటి విన్యాసాలు అప్పుడు చూడాలేగానీ, మామిడిపళ్ళకన్నా మజాగా వున్నాయి.
psmlakshmi