హనుమాన్ దేవాలయం, సారంగపూర్
నిజామాబాదుకి 5 కి.మీ. ల దూరంలో చిన్న కొండమీద వున్న గుడి ఇది. గుడి చిన్నదయినా ఆవరణ విశాలమైనది. చాలా ఆకర్షణీయంగా వుంటుంది. గుడి మొత్తం, ముందు ధ్వజ స్తంబంతోసహా సింధూర వర్ణంతో కనులవిందు చేస్తుంది. ఖిల్లా రఘునాధాలయంలాగానే ఈ ఆలయానికీ, ఛత్రపతి శివాజీకీ సంబంధముంది. ఛత్రపతి శివాజీ గురువుగారైన శ్రీ సమర్ధ రామదాసు ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం ఆకారాన్ని స్వయంగా గీసి, ఆ రూపురేఖల ప్రకారం విగ్రహాన్ని చేయించి ఇక్కడ స్ధాపించారుట. చుట్టూ మఠాధిపతుల సమాధులు వున్నాయి.
కొండకింద పార్కు అభివృధ్ధి చేశారు. దైవ దర్శనంతోబాటు సరదాగా కొంత సమయం గడపవచ్చు.

4 comments:
అవునండి, చూస్తుంటే చాలా బాగనిపిస్తోంది.
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
జయా, మాలా,
మీకూ, మీ కుటుంబాలకూ దీపావళి శుభాకాంక్షలు.
psmlakshmi

Post a Comment