లేపాక్షి
ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం వున్నది. ఆలయం పెద్దది. ఇందులోనే శివకేశవులకి మందిరాలున్నాయి. వీరభద్రస్వామి గర్భగుడి ముందు ఒక స్ధంబంలో దుర్గమాత పెద్ద విగ్రహం వున్నది. స్ధంబాల మీద చెక్కిన శిల్పాలన్నీ చాలా బాగున్నాయి. ఒక స్ధంబంమీద ఉత్తమ జాతి స్త్రీ (పద్మినీ జాతి) శిల్పం, ఇంకో స్ధంబం మీద ఉత్తమ జాతి పురుషుని విగ్రహాలు చెక్కబడి వున్నాయి. ఉత్తమ జాతి స్త్రీ పురుషుల శారీరక లక్షణాలు ఎలా వుండాలో ఆ శిల్పాలను చూసి తెలుసుకోవచ్చు. ఆ విశేషాలు పూజారిగారు వివరించి చెప్పారు.
గుడి వెనుక ఐదు తలల నాగేంద్రుడి శిల్పం వుంది. ప్రసిధ్ధికెక్కిన లేపాక్షి బసవన్న విగ్రహం ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో వుంది. అక్కడ గైడు వున్నారు. మాలాంటివాళ్ళకోసం ఆలయంలోకూడా గైడు వుంటే బాగుండేదనిపించింది.
ఇవన్నీ చూసి సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి హిందూపూర్ వచ్చి 7 గంటలకి హైదరాబాద్ బస్ ఎక్కాం.
(ఈ సచిత్ర వ్యాసం 31-12-2009 ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది. ఆ సమయంలో నా యాషికా తో తీసిన ఫోటోలు ఆంధ్రభూమి వారికి పంపగా మిగిలినవి కిందటి పోస్టుల్లో పెట్టాను. అందుబాటులో లేని కారణంగా లేపాక్షి ఫోటోలు ఇవ్వలేకపోతున్నాను. ప్రస్తుతానికి అనంతపురం జిల్లా యాత్ర సమాప్తం).
0 comments:
Post a Comment