మన దేశంలో అయితే ఇంచక్కా రోడ్డు పక్కన భోజనాలు చేశాము
ఇంచక్కా రోడ్డుపక్కే పెద్ద చెట్ల ఊడలు పట్టుకుని ఊగాము
ఏం చేస్తున్నా ఈ విశేషాలన్నీ మీకెలా చెప్పాలా అనే నా ఆలోచన…అందుకే..మర్చిపోకుండా ఎక్కడివక్కడే రాసుకోవటం, ఫోటోలు తీసుకోవటం.
ఇంక ప్రయాణ సాధనాలంటారా
విమానమెక్కి ఆకాశ మార్గాన ప్రయాణం చేశాం
పడవెక్కి నీటిబాటలో సాగాం
సముద్రతీరాన కారులో షికార్లు చేశాం.
వీటిలో కొన్నింటిని నేనే నడిపాను తెలుసా మీరు నమ్మరని నాకు తెలుసులెండి...ఇదుగో సాక్ష్యం..
సేండ్ డ్యూన్స్ డ్రైవ్
ఎలా వుంది నా ప్రతాపం....హహహహహ
అన్నింటినీమించి దేశం కానీ దేశంలో గుర్తింపబడ్డాను. అమెరికాలో నోవై సెంటర్ సినిమా హాల్లో, నా బ్లాగు చదివే శ్రీ వినోద్ బ్లాగులో నా ఫోటోచూసి గుర్తుపట్టి పలకరిస్తే సంతోషంతో గంతులేశాను (ఫోటోల్లేవు).
ఇవ్వండీ మా యాత్రా విశేషాలు. మరి మా యాత్రలు ఇలాగే కొనసాగాలనీ, మీతో బోలెడు విశేషాలు పంచుకోవాలనీ కోరుకోండి.
2 comments:
మీ యాత్రా విశేషాలు చాలా బాగున్నాయండి . ఎంచక్కా మీవారు మిమ్మలిని వూళ్ళు తీసుకెళుతున్నారో . ఒసారి మావారిని మీ ఇంటికి తీసుకొస్తాను . నన్నూ తీసుకెళ్ళమని రికమెండ్ చేయండి ప్లీజ్ , ప్లీజ్ .
superrrrrrrrrr!
Post a Comment