జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే దోవలో 10 కిలో మీటర్లు వెళ్ళాక కుడి వైపు కమాన్ వస్తుంది. ఈ కమాన్ ద్వారా సుమారు ఒక కిలో మీటరు దూరం లోపలకి వెళ్తే వస్తుంది ఈ ఆలయం.
పూజారిగారి కధనం ప్రకారం 210 ఏళ్ళ క్రితం ఒక భక్తుడు ఇక్కడ రోజూ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వుండేవాడు. అప్పుడు వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. వినాయకుడు సాక్షాత్కరించేటప్పటికి ఆయన ఆకారం 1.5 అడుగుల ఎత్తు మాత్రమే. ఆ విగ్రహం పెరుగుతూ వుందిట. ప్రస్తుతం 5 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని భక్తులు చూడవచ్చు. స్వామి ఇంకా పెరుగుతూనే వున్నాడుట.
స్వామి సాక్షాత్కరించిన తర్వాత అక్కడ ఆలయం నిర్మింపబడింది. దిన దిన ప్రవర్ధమానమవుతున్న ఈ ఆలయానికి భక్తులు ఆంధ్ర ప్రదేశ్ నుంచేకాక, కర్ణాటక, మహారాష్ట్రలనుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు.
దర్శన సమయాలు
ఉదయం 5 గంటలనుంచి రాత్రి 10 గంటలదాకా.
0 comments:
Post a Comment