Friday, March 5, 2010

స్వప్న కామెంట్స్




ఇప్పటిదాకా ఆడవారు, ఆడవారు బ్లాగులు ఖరాబు చెయ్యటం ఎందుకనీ, వయసులో పెద్దదాన్ని కనుక బాధ్యతగా ప్రవర్తించాలనీ,  నా బాధని అణుచుకుంటున్నాను. 

స్వప్నా, నా బ్లాగులో మీరు ఇదివరకు రాసిన కామెంటూ, ఇప్పుడు రాసిన కామెంటూ యధతధంగా పెట్టి, అప్పుడు మీరు చేసినదాంట్లో తప్పేమన్నా వున్నదా అని అందరినీ అడగటమో, లేక సహాయం చెయ్యమని ఎవరికీ చెప్పుద్దని సలహా ఇవ్వటమో చేస్తే నేను చాలా మెచ్చుకునేదాన్ని. నిజాన్ని ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి.  నాకు బాధ కలిగించిన మాటల ప్రస్తావన మీ పోస్టులో ఎక్కడా తేకుండా జాగ్రత్త పడ్డారు.  అసలు విషయం తెలియని వాళ్ళు ఎవరికి తోచిన సలహా వారిచ్చారు.  తెలిసినవారు మాట పడ్డారు.

విషయం సరిగ్గా తెలియాలనే ఉద్దేశ్యంతో స్వప్న నా బ్లాగులో చేసిన కామెంట్లు వున్న పోస్టుల లింకు ఇస్తున్నాను.  చూడండి.

http://4psmlakshmi.blogspot.com/2009/09/normal-0-false-false-false.html

http://4psmlakshmi.blogspot.com/2010/03/1.html

ఇప్పుడు చెప్పండి నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా?


15 comments:

Anonymous said...

మీరు చాలా హుందాగా, సం యమనంతో సమాధానం ఇచ్చారండి.

మీ పర్సనల్ విషయాల్లో స్వప్న చూపిన దురాసక్తి ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. మీ ఆర్థికస్థోమత వివరాలు ఆమెకు అనవసరము.

మీరు ఫీలవ్వకండి మేడం, మీ యాత్రలు వింటుంటే మాకూ చేసినట్లే వుంది. ప్రిపరేషన్ , హోటల్స్ ఎలా అరేంజ్ చేసుకున్నారు, ఎలా వెళ్ళారు అనేవిషయాలు కూడా ఇస్తే చూడాలనుకునే వారికి ఇంఫర్మేటివ్ గా వుంటుంది. మీ బ్లాగ్ నాకు నచ్చింది. ప్రొసీడ్... అన్ని విషయాలు నోట్ చేసుకుని, అద్బుతంగా రాసే ఓపిక నాకు నచ్చింది.

శ్రీనివాస్ said...

పిన్ని గారు మీరు మరీను . దేశం తిరిగిన మీకు ప్రత్యేకంగా చెప్పాలా . ఒక్క మాటలో చెబుతాను వినండి ఊరికి విలువ ఇవ్వండి ...ఉలిపి కట్టెలకు కాదు ....ఏదో చిన్న వాడిని మేకు చెప్పేంత వాడిని కాదనుకోండి .

psm.lakshmi said...

S గారూ, ధన్యవాదాలు,
లేడికి లేచిందే పరుగు అంటారు కదా..అలాగే మాకు మేమనుకున్నప్పుడే బయల్దేరిపోతాము. అందుకే ముందు రిజర్వు చేసుకోవటం వగైరాలుండవు. వెళ్ళి అక్కడ చూసుకోవటమే. ముందు ఆలోచన ఎక్కువ వుండదు కనుక రైల్లో వెళ్ళేవి కూడా తక్కువే. బస్సులు తొందరగా దొరుకుతాయికదా.
వీటిలో కొన్ని నాకు బ్లాగు ఆలోచన లేనప్పుడు చూసిన ప్రదేశాలు. అలాంటివాటికి వివరాలు ఎక్కువ ఇవ్వలేక పోయాను. కానీ, బ్లాగులో రాయటం మొదలు పెట్టాక వీలైనన్ని విషయాలు సేకరిస్తున్నా.
psmlakshmi

psm.lakshmi said...

అదేంటిరా అబ్బాయ్, మేకు కొట్టినట్లు చెప్పి, ఏదో చిన్నవాడిని...అంటూ మళ్ళీ...
చిన్నవాళ్ళు చెప్పినా మంచి విషయమైతే వినాలని వెనకటికో బడధ్ధాయ్ చెప్పాడట. అందుకే వింటాను.
Thank you Srinivas
psmlakshmi

శరత్ కాలమ్ said...

నాకు అయితే స్వప్న వ్యాఖ్యలలో తప్పేమీ కనిపించడం లేదు. మంచి మనస్సుతో, క్యాజువలుగా, సరదాగా వ్యాఖ్యానించింది. దానిని మీరు ఎక్కువ చేసేసారు.

budugu said...

మహాలక్ష్మి గారు, మీరు పెద్దవారు, లోకం చూశారు. అలాంటి వెధవ కామెంట్లకు తగురీతిలో సమాధానం చెప్పల్సింది పోయి ఇలా వాపోతారేమిటండి. చిన్న పిల్ల. నోటికి వచ్చినట్టు వాగుతోంది. మీరు సహాయం చేశారో లేదో అన్నది మీ అంతరాత్మకెరుక. ఇలా ప్రతీ దారినపోయినదానమ్మలకి నిరూపించుకోవాల్సిన అవసరం మీకెంతమాత్రమూ లేదు. ఐనా మీ ఇంతకు ముందు పోస్టులకు జనాల రెస్పాన్సు చూశారు కదా. అవాకులు చవాకులు పేలే ప్రతి ఒక్కరికి వందమంది చదివి ఆనందించే వాళ్ళున్నారు. మీరు చక్కగా రాస్తూ ఉండండి.
ఇలాంటి వెధవ కామెంట్లబారినుండి తప్పించుకోడానికి కామెంట్ మాడరేషన్ ఓ సాధనం. ఒకసారి మీ బ్లాగులో సెట్టింగ్స్ సరి చూసుకోండి.

satvika said...

lakshmigaaru ani pilavataniki meeru nakante chala peddavaru, mee blogs dwara meeru suparichayame.. anduke auntygaru ani pilichestunnaanu...
mee blogs ni enno rojulaninchi follow avutunnaanu... chadivi chaala anandam vestuntundi... meeru chusina chinna pedda pradeshaala gurinchi andaritho panchukovalanukune mee uddesham maakentho inspiring ga undi auntygaru... swapna ee blog venuka unna spirit ni artham chesukokunda, dabbu tho mudipetti "peeda pillalaku sahayaalu" etc matladatam baadhakarame... oka place ni enjoy cheyalante dabbee kavalsina avasram ledu kada.. adi chudalane tapana undaali... chusi anandinchagalige manasundaali..aina ila uchita salahalichevaaru valla vaipu ninchi vallem paatincharu.. eduti vallaki matram idi cheyandi adi cheyandi ani cheppataniki munduntaaru.. adem saradaanoo...

dayachesi meeru evari matalaki nochukuni blog lo rayatam maneyakandii... okavela evaraina mimmalni noppinche commentlu rasthe vatini simple ga del cheseyandi...

మిస్టర్ యక్ష said...

అమ్మా,

మీరు జీవితంలో అన్ని స్టేజెస్ దాటి, మీదైన మీ సమయాన్ని ధనాన్ని మీ పిల్లలకోసం కేటాయించి, ఇప్పుడుకదా కాస్తంత విశ్రాంతిగా ప్రశాంతంగా మీక్కావలసిన విధంగా మీజీవితాన్ని గడుపుతున్నారు. మరి మీ అనుభవంలో సగం వయస్సుండే పిల్లలన్న మాటలకు మనస్తాపం ఎందుకు? మీరు బాధ పడవలసిన అవసరం లేదు. ఎవరికీ సంజాయిషి ఇవ్వవలసిన అవసరం అంతకన్నా లేదు. బ్లాగ్లోకం గుడ్డిది కాదు. అందరూ అన్ని చూస్తూనే ఉన్నారు. మీరు ఇవన్ని పట్టించుకోకుండా మరిన్ని విశేషాలతో మా ముందుకు వస్తూనే ఉండాలి. అదేమాకు ఆనందం. మీ వెనకే మేమందరం ఉన్నము. మీరు ఇలాంటి చిన్న చిన్న అవరోధాలను పట్టించుకోకుండా మరిన్ని యాత్రలు ముగించుకు రండి. మీకోసం ఎదురుచూసే వళ్ళము చాలమంది ఉన్నాముగా.

psm.lakshmi said...

శరత్ గారూ
స్వప్న రాసింది నేను బ్లాగులో రాసిన విషయం గురించో, నా బ్లాగు గురించో అయితే అది తన ఆభిప్రాయం కింద తీసుకుని మౌనంగా వుండేదాన్ని. బీదవారికి సహాయం చెయ్యమని చెపితే మంచి మనసుతో చెప్పిందని సంతోషించేదాన్ని. కానీ మొదటి సారి తను చేసిన కామెంటు మావారు బాగా సంపాదించి వుంటారు అందుకే అన్ని వూళ్ళూ తిరుగుతున్నాము అని. దానికి నేను సౌమ్యంగానే సమాధానం ఇచ్చాననుకుంటాను. ఈ రెండింటి లింకులూ పైన నా పోస్టులో వున్నాయి. ఆవిడ తన మొదటి కామెంటుకి నా సమాధానం చూశారో లేదో తెలియదు..మళ్ళీ మీరు చాలా రిచ్ అనుకుంటాను అందుకే అన్ని వూళ్ళు తిరగగలుగుతున్నారు అంటూ రాశారు. బ్లాగుల్లో బ్లాగర్ల సంపాదన, ఆస్తి పాస్తులూ అవసరమా. ఎవరికి వారిస్తే అది వారిష్టం, కానీ కామెంట్ల రూపంలో వాటి గురించి మాట్లాడటం అవసరమా? నాలుగు వూళ్ళు చూసినంత మాత్రాన ఆస్తులున్న వాళ్ళయితే అనేక ప్రసిధ్ధ ఆలయాలకు సామాన్లు నెత్తిన మోసుకుంటూ, కాలి నడకన వచ్చే నిరుపేద భక్తులకు ఏ ఆస్తులున్నట్లు
ఏ విషయంలోనైనా ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. కాదనను. మీ ఆభిప్రాయం మీది.
psmlakshmi

psm.lakshmi said...

బుడుగు గారూ
బుడుగుని గారూ అంటుంటే ఏంటోగా వుంది. ధన్యవాదాలండీ. ఇప్పుడేమైందిలెండి. మనం రాసేదాన్నిబట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు కొందరు..అవ్వన్నీ ఎందుకు నేనన్నదే కరెక్టు అంటారు ఇంకొందరు. అన్నీ వినాలికదా.
psmlalkshmi

psm.lakshmi said...

Mr. Colours
ధన్యవాదాలండీ. మీరన్నట్లు ప్రదేశాలు చూడటానికైనా, వాటి గురించి ఇతరులకు చెప్పటానికైనా తపన కావాలి.
Thank you very much once again for your advise and support.
psmlakshmi

psm.lakshmi said...

ధన్యవాదాలు యక్షగారూ
బ్లాగుల్లో బ్లాగుల గురించి, అందరికీ పనికి వచ్చే అంశాల గురించీ ముచ్చటించుకుంటే బాగుంటుంది కదా వ్యక్తిగత విషయాలకెళ్ళకుండా.
మీరిచ్చిన సపోర్టుకి మరొక్కసారి ధన్యవాదాలు.
psmlakshmi

Sridevi said...

Ammaa, nijaaniki swapna anna maatalaku manam andaram intha time vechinchi, intha alochinche avasarame ledu. meeku ibbandi kaliginanduku just ignore her comments. thanu casual gaa anna marolaa annaa asalu enduku pattinchukovaali, idi mee blog nalugurini mee yatra viseshaalatho inspire chesthunnaaru, meeru raayaali, raasthune undaali. na drustilo ame vyakyalaku intha pramukyam iche avasaram entha maatramuu ledu

psm.lakshmi said...

రాసింది నా బ్లాగు గురించో, దానిలో విషయాలగురించో అయితే నేనూ తేలిగ్గా తీసుకునేదాన్ని. బ్లాగర్ల వ్యక్తిగత విషయాలు ముచ్చటించటానికి ఇది సరైన స్ధలంకాదని చెప్పాలనుకున్నా. అంతే. ఇంక కొనసాగించదల్చుకోలేదు.

ధన్యవాదాలు శ్రీగారూ
psmlakshmi

Unknown said...

swapna@kalaprapaMcham,

one suggestion to you as well.
I have seen your profile photo and your saree seems to be very costly. Even your hair style seems to be very posh. Hope you must be spending a lot on shopping & Beauty parlors.
I have a sincere request to you.
Starting from now, whenever you go to shopping/parlor, please donate at least 500 rs to an orphanage. Also minimize parlor expenses, and donate that money to orphanages. Please help society.
Hope you will take this in right sense