Tuesday, June 3, 2008

నల్గొండ, ఆంధ్ర ప్రదేశ్

నల్గొండ
నల్గొండ లో మేము చూసిన ప్రదేశములు:
  • శ్రీ సీతారామచన్ద్రస్వామి దేవాలయము, రామగిరి
  • శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయము, పానగల్లు
  • పచ్చల సోమేశ్వరాలయము మ్యూజియం , పానగల్లు
  • ఛాయా సోమేశ్వరాలయము, పానగల్లు
నల్గొండ వూళ్ళోనే వున్నాయి పైన దేవాలయాలన్నీ.

శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయము, రామగిరి
ఉదయమున ఎనిమిది గంటల ప్రాంతములో మేము దేవాలయానికి చేరేసరికి అప్పుడే నివేదన పూర్తి అయింది. పదిహేను నిముషముల తర్వాత అక్కడ వున్న వారందరూ గుడి లోనే కూర్చున్నారు. అందరికి దద్చోజనము ప్రసాదము పెట్టారు.

ఇక్కడి విగ్రహాలు పట్టాభిషేక రాములవారివి. సీతాసమేత రాముడు , కుడిపక్క లక్ష్మణుడు,ఎడమపక్క భరతుడు, కింద శత్రుఘ్నుడు . గుడి లోని పూజరిగారు చెప్పినదని ప్రకారము నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కొంత దూరములో వున్న కాపరాల గుట్ట కింద భూస్థాపితమై వున్నదట. ఆ కాలములో ఒక ఆయుర్వేద వైద్యుడు అక్కడ వైద్యము చేస్తూన్దేవారట. అప్పుడు ఆ ప్రాంతము నవాబుల పరిపాలనలో వుండేదట. ఒక సారి నవాబుగారి భార్యకు జబ్బు చేసి ఎందరు వైద్యులు ప్రయత్నించినా నయము కాలేదట. అప్పుడు ఈ వైద్యుడిని పిలిపిస్తే వెళ్లి నయం చేసారుట. నవాబుగారు బహుమతి ఏమన్నా కోరుకోమంటే వైద్యుడు తన స్వప్నంలో కనిపించిన రామాలయాన్ని నెలకొల్పటానికి స్థలము అడిగారుట. నవాబుగారు ఇక్కడ మూడువందల యాభై ఎకరాల స్థలము ఇచ్చారుట. అప్పుడు అక్కడ నిర్మించబడ్డ గుడి ఇది.

గర్భగుడికి ఇరుపక్కల రంగనాధస్వామి, ఆన్దాల్లు లోహ విగ్రహాలు, ఆన్దాల్లు నల్లరాయి విగ్రహము, అల్వారుల విగ్రహాలు వున్నాయి. 1956 లో అప్పటి కలెక్టర్ గారి భార్యకి స్వప్న సాక్షాత్కారము వలన ఆవిడ ఈ గుళ్ళు కట్టించారుట.

అన్ని విగ్రహాలు చాలా అందముగా వున్నాయి. ఈ ప్రాంగణము లోనే వెంకటేశ్వరస్వామి గుడి కూడా వున్నది.







0 comments: