శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం
ఈ దేవాలయం 400 సంవత్సరాలక్రితం కట్టబడింది. ఆ కాలంలో ఒకరి కలలో స్వామి కనబడి, ముక్త్యాల దగ్గర ఉత్తర వాహిని అయిన కృష్ణానదిలో తానున్నానని, తీసుకువచ్చి గుడికట్టించమని సెలవిచ్చారుట. వారు ఆ లింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ గుడి కట్టించారుట. చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహాలు వగైరా దేవతలకు చిన్న చిన్న గుళ్ళున్నాయి.
మేము వెళ్ళేసరికి గుడిమూసివున్నది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న ఈ ఊరి వ్యక్తి ఒకరు అక్కడ కలిశారు. ఆయన ఈ దేవుడు చాలా పవర్ ఫుల్ దేవుడు..దర్శనం చేసుకోకుండా వెళ్ళద్దు..అని చెప్పారు. ఆయన సలహామీదే గుళ్ళోనే ఒక ప్రక్కగా వున్న పూజారిగారిని పిలుచుకొచ్చారు మా ఆటో రాము.
గుడిలోపల అంతా మరమ్మత్తులు చేయిస్తున్నారు. నేల అంతా పగలగొట్టి దుమ్ము ధూళితో నిండివుంది. అందుకనే శివలింగాన్ని పక్కనే వున్న చిన్న మంటపంలో పెట్టి పూజలు చేస్తున్నారు. ఆలయం 400 సంవత్సరాల క్రితం కట్టబడింది. చుట్టూవున్న ప్రాకారాలు వగైరాలు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (అమరావతి వగైరా ఆలయాలను పునరుధ్ధరించినవారు) అభివృధ్ధి చేశారు. వీరి వంశీకులే ముక్త్యాల జమీందారులు।
రేపటి పోస్టు శ్రీ వరదరాజస్వామి దేవాలయం, జగ్గయ్యపేట.
0 comments:
Post a Comment