Wednesday, August 26, 2009

జగ్గయ్యపేటలోని దేవాలయాలు--3

శ్రీ వరదరాజస్వామి దేవాలయం, జగ్గయ్యపేట
ముందుగా కనబడ్డ నాగరాజు



జగ్గయ్యపేటలోని దేవాలయాలు--३


శ్రీ వరదరాజస్వామి దేవాలయం


పూర్వకాలంలో ఇక్కడ యాదవులు వుండేవారు. వాళ్ళు ఇక్కడ గోవులను కాచుకుంటూ, ఒక రాతిమీద కూర్చుంటుండేవాళ్ళు. ఆ కాలంలో శ్రీ చిలకమర్తి గోపాలాచార్యులు అనే వ్యక్తికి స్వామి కలలో కనబడి, మీ ఇలవేల్పుని నేను, ఇక్కడ వెలిశాను, వెతికి పట్టుకో అన్నారుట. ఆయనా, ఇంకొందరు కలిసి వెతుకుతూ వస్తే ముందుగా నాగరాజు విగ్రహం కనిపించిందట (ఫోటో). తర్వాత శంఖం, చక్రం, తర్వాత రాతిమీద స్వామిని చూశారుట. దాన్ని ప్రతిష్టించి, పూజలు చేశారుట. తర్వాత దానిమీద విగ్రహాలు స్ధాపించారు. గర్భాలయానికి ఒక ప్రక్క మహాలక్ష్మీ అమ్మవారు, ఇంకొక ప్రక్క వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆళ్వారులు కొలువుతీరి వున్నారు।


మేము వెళ్ళేసరికి ఈ గుడీ మూసివుంది. అయితే గుడి ఎదురుగానే పూజారిగారి ఇల్లవటంవల్ల పిలిస్తే వచ్చి తలుపు తీశారు. పూజ శ్రధ్ధగా చేశారు. చాలా సంతోషం అనిపించింది అంత పురాతన ఆలయంలో మా గోత్ర నామాలతో అంత బాగా పూజ జరగటంతో. పూజారిగారే ఆలయ చరిత్ర చెప్పారు. నాగరాజు దగ్గర పుట్టబంగారం ఇచ్చారు।


అంతేకాదు, వీళ్ళ తమ్ముడే ధనశైల సీతారామస్వామి దేవాలయంలో పూజారిగారు. ఆయన ఆ గుడి మూసిరావటంతో ఆయన్ని పంపించి ఆ గుడి తలుపులు తెరిచి మాకు దర్శనానికి వీలు కలిగించారు. రేపు ఆ ఆలయం గురించి...ఈ సీరీస్ లో ఆఖరి పోస్టు।



2 comments:

మాలా కుమార్ said...

లక్ష్మిగారు,
మీరీ దేవాలయాల గురించి ఎక్కడి నుంచి తెలుసుకుంటారండీ ? మేము వెళ్ళిన ఊళ్ళ లో మేము చూడని దేవలాయల గురించి బాగా చెబుతున్నారు.మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తోంది.

psm.lakshmi said...

ఒక్కటే మార్గం మాలాగారూ, నోరు పెట్టుకుని సాధించటమే. సమాధానాలు చెప్పేవాళ్ళు పుణ్యాత్ములు..అలాంటివాళ్ళని ఇంకా కొంచెం వేధించుకు తింటాం. లేనివాళ్ళకి రాం రాం. కొన్నిచోట్ల అలాంటివాళ్ళ వల్ల వివరాలు ఎక్కువ దొరకవు. అప్పుడు బాధగా కూడా వుంటుంది. ప్రస్తుతానికి ఇదొక భవసాగరం నాకు.
psmlakshmi