Thursday, August 27, 2009

జగ్గయ్యపేటలోని దేవాలయాలు--4

ఆలయం బయట విశాలమైన పురాతన మంటపం
ఇక్కడే గోదా కళ్యాణం వగైరా ఉత్సవాలు జరుగుతాయి
ఆలయంపై కొత్తగా రూపు దిద్దుకుంటున్న విగ్రహాలు



జగ్గయ్యపేటలోని దేవాలయాలు--४



శ్రీ ధనశైల సీతారామస్వామి దేవాలయం


300 సంవత్సరాల క్రితం విజయవాడ దగ్గర ధనమ్మబొడ్డులో తవ్వకాలలో దొరికినయ్యిట ఈ విగ్రహాలు. ఇక్కడ ప్రతిష్టించి గుడి కట్టించారు. అందుకనే ఆ పేరు. ప్రక్కనే సంతాన వేణుగోపాలస్వామిని ప్రతిష్టించారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆండాళ్ళు (గోదాదేవి), ఆళ్వారులు కూడా వున్నారు. ఎదురుగా ఆంజనేయస్వామి.

దేవాలయానికి 70 ఎకరాల భూమి వుందిట. కానీ సరైన పోషణ వున్నట్లు కనిపించలేదు. దేవాలయం చుట్టూ గదులు, బయట పాతకాలపు విశాలమైన మంటపం. అందులో ప్రస్తుతం స్కూలు నడుస్తోంది. గోదా కళ్యాణం వగైరాలన్నీ ఆ మంటపంలోనే చేస్తారుట.

ఈ దేవాలయాలన్నీ ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు అధీనంలో వున్నాయి. దేవాలయానికి మరమ్మత్తులు సాగుతున్నాయి. అందులో భాగంగా దేవాలయం చుట్టూ విగ్రహాలు పెట్టారు. అందులో సాయిబాబా విగ్రహం కూడా వుంది. మేము వెళ్ళేసరికి ఇంకా పని పూర్తి కాలేదు.

ఇవేకాక ఇంకా కన్యకాపరమేశ్వరి గుడి, అయ్యప్ప దేవాలయం, సాయిబాబా దేవాలయం వగైరాలు వున్నాయి.

ఇంత పురాతనమైన ఈ ఆలయాలను చూస్తుంటే మన పూర్వీకులు ఎంతెంత వ్యయ ప్రయాసలకోర్చి తమ కలల రూపాలను భవిష్యత్ తరాలకోసం సాకారంగా నిలిపారో అనిపిస్తుంది. ఇంతలోనే ఇంకో సందేహం. మనం వాటికి సరైన విలువ ఇస్తున్నామా???



0 comments: