Thursday, August 6, 2009

(స్ధలాభావం వల్ల ఫోటోలో అన్ని ఐటమ్స్ రాలేదండీ)


అమెరికాలో ఆతిధ్యం

పిల్లలు పెద్దవాళ్ళయ్యి తమకి దూరంగా వెళ్తే తల్లిదండ్రులకు అనేక దిగుళ్ళు. వాళ్ళు వండుకుంటున్నారో లేదో, సరిగ్గా తింటున్నారో లేదో, ఇక్కడ ఇంట్లో చిన్నమెత్తు పని చేయకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నాము, అక్కడ, చదువు, ఆఫీసు, ఇల్లు ఎంత అవస్త పడుతున్నారో అని దిగులు పడతారు. కానీ మనవాళ్ళు అసాధ్యులండీ. మన దగ్గర పసి పాపాయిలలాగా పెరిగిన వాళ్ళు బయటకు వస్తే ఆరిందాలవుతారు. ఇంటా బయటా నేర్పుగా చక్కబెట్టుకోవటమేకాదు, అతిధి సత్కారాలుకూడా చక్కగా చేస్తున్నారు. అమెరికాలో పిల్లల ఆతిధ్యం గురించి ఈ పోస్టు.

సౌమ్య, శశి మా అమ్మాయి స్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఇప్పుడు 70, 80 మైళ్ళ దూరంలో వేరు వేరు వూళ్ళల్లో వుంటున్నారు. ఈ శనివారం లంచ్ కి పేరెంట్స్ ని తప్పక తీసుకు రావాల్సిందేనంటే సౌమ్యా వాళ్ళింటికి వెళ్ళాము.

ఇల్లు చక్కగా సర్ది పెట్టుకుంది. ముందుగా నన్ను ఆకర్షించింది హాల్లో వున్న పియానో. సౌమ్య నేర్చుకుంటోందిట. మంచి కాలక్షేపం కదూ. శశి గిటార్ వాయిస్తాడుట.

శశి కూడా ముందే వచ్చాడు సౌమ్యకి సహాయం చెయ్యటానికి. మీరు ఇబ్బంది పడటమెందుకు, పోనీ అందరం కలిసి బయటకు వెళ్దామంటే, కాదు..మేమే చేస్తాము, అమెరికాలో ఆంధ్రా భోజనం రుచి చూపిస్తాం, మేమెంత బాగా చెయ్యగలమో నిరూపిస్తాం అన్నారు. అలాగే రకరకాల వంటకాలు అద్భుతంగా తయారు చేశారు. పాలక్ పనీర్, చపాతీ, టమేటా పప్పు, పుదీనా పచ్చడి, ఉల్లిపాయ రసం, దానికి కాంబినేషన్ ముద్ద పప్పుట, (ఇది శశి స్పెషల్..వాళ్ళింట్లో చేస్తారుట. నేనెప్పుడూ చెయ్యలేదు, ఈ మధ్యనే టీవీలో వంటల ప్రోగ్రామ్ లో చూశాను), అప్పడాలు, ఊరు మిరపకాయలు, ఫ్రూట్ సలాడ్, ఇంకా లెమన్ కేక్. మెనూ అదిరి పోయిందికదా (ఫోటోలో చోటు చాలక అన్నీ రాలేదు). అన్నీ రుచులు కూడా బ్రహ్మాండంగా వున్నాయండీ. పైగా ఆంటీ ఇది వేసుకోండి, అంకుల్ ఇంకొంచెం వేసుకోండి అంటూ కొసరి కొసరి వడ్డించారు. అన్నీ సుబ్బరంగా లాగించేసి తర్వాత అందరం కలిసి మగధీర సినిమాకి వెళ్ళాం.

సౌమ్య, శశి..ముందు రోజునుంచీ ఈ లంచ్ కోసం చాలా శ్రమ పడ్డారు. వుట్టిగా ధ్యాంక్స్ చెప్తే మామూలుగా వుంటుంది. అందుకే నా చేతిలో వున్న పని...మిమ్మల్ని బ్లాగుకెక్కిస్తున్నా. May God bless you children।3 comments:

భావన said...

బాగుంది లక్ష్మి గారు పిల్లల వంటకాలు... ఒక్కొక్క సారి అనిపిస్తుంటుంది కదా కళ్ళముందు పెరిగిన పిల్లలు ఎంత పెద్ద వాళ్ళై మనకే వండి కూడా పెడుతున్నారు అని, మన గురించి మన పెద్ద వాళ్ళు అలానే అనుకుంటారేమో...

మాలా కుమార్ said...

అవునండీ ,పిల్లలు చేస్తుంటే ముచ్చటగా వుంటుంది.
ఆ వంటకాలు చూస్తుంటే నోరూరి పోతోంది.

psmlakshmiblogspotcom said...

భావనా, మాలా
కదా.
psmlakshmi