కిందిటి పోస్టులో పద్మాక్షీ ఆలయం గురించి చదివారుకదా. మరి ఆ తల్లి, శంకరుడు తన పాదాల దగ్గర వుంటే అక్కడ వెలుస్తాననే కండిషన్ పెట్టింది సిధ్ధులకి. దానికి పరమ శివుడు ఒప్పుకుని కొండ దిగువన వెలిశాడు అని చెప్పానుకదా. కొండ దిగువన అంటే ఆ కొండని ఆనుకునే లేదు ఈ శివాలయం. పద్మాక్షీ ఆలయానికి కుడి వైపు తిరగాలని చెప్పానుకదా. సిధ్ధేశ్వరాలయానికి సరాసరి ఇంకొంచెం దూరం వెళ్లి ఎడమవైపు తిరగాలి. అక్కడ అడిగితే చెబుతారు.
సిధ్ధుల కోరికమీద వెలిశాడుగనుక సిధ్ధేశ్వరస్వామి. చాలా చిన్న గుడి. మేము వెళ్ళేసరికి (ఉదయం 10-30) పూజారిగారు లేరు. ఆలయం తలుపులు తెరిచే వున్నాయిగనుక దర్శనం చేసుకున్నాం. ఈ ఆలయాన్ని ఆనుకునే సరస్వతీ దేవి ఆలయం వున్నది. ఇది నాలుగేళ్ళ క్రితమే నిర్మింపబడిందిట. ఇదికూడా చిన్నదే. ఇక్కడ పూజారిగారున్నారు.
అతి పురాతనమైన ఈ ఆలయాల చరిత్రలు చదివి ఆసక్తితో చూడాల్సిందేగానీ ఆలయాలు చిన్నవి.
0 comments:
Post a Comment