Saturday, March 26, 2011

శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం, రామన్నపేట, వరంగల్




ఈ ఆలయం కాకతీయుల కాలంలో 1150 – 1160 లో నిర్మింపబడింది. అతి పురాతనమైన ఈ స్వామి ఆవిర్భావము, ప్రతిష్ట వివరాలు ఇప్పుడంత స్పష్టంగా తెలియకపోయినా, ఈ స్వామిని కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని కాలం ముందునుంచే ఆరాధిస్తున్నారని తెలుస్తున్నది. శ్రీ పాలకురికి సోమనాధ కవి తన శ్రీ శైవరగడలో ఈ స్వామిని అభివర్ణించాడు. కావున సుమారు 800 – 900 సంవత్సరములనుండి ఈ ఆలయముందంటారు.

ఈ దేవాలయంలో స్మార్త శైవ ఆగమ శాస్త్ర సిధ్ధాంత ప్రకారం అభిషేకములు, పూజలు జరుపబడుతున్నాయి. ప్రస్తుత ఆలయం క్రీ.శ. 1810 లో నిర్మింపబడినట్లు తెలుస్తోంది.

స్వామికి ఎదురుగా చిన్న పాలరాతి నందివున్నది. శివ కేశవులకు బేధం లేదన్నట్లు ఇతర ఉపాలయాలతోబాటు లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయం ఇక్కడ వున్నది.

ఆతి పురాతనమైన ఈ ఆలయం ప్రస్తుతం జనసమర్దమైన ప్రదేశంలో వున్నది (ఆలయం మారలేదండీ..చుట్టూ ఇళ్ళూ, దుకాణాలే వచ్చాయి). ఈ ఆలయం అవకాశం వున్నవారికి అవశ్య దర్శనీయం.


0 comments: