Friday, August 7, 2009

బెలూన్ ఫెస్టివల్, హోవెల్, మిచిగాన్













బెలూన్ ఫెస్టివల్, హోవెల్, మిచిగాన్

జూన్ 25నుంచి 28 దాకా మిచిగాన్ లోని హోవెల్ లో, హోవెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెలూన్ ఫెస్టివల్ జరిగింది. 27 వ తారీకున సాయంకాలం 7-30 గ.లకు వెళ్ళాము. 6 గం. లకి ఎగరాల్సిన బెలూన్లన్నీ వాతావరణం సరిగ్గాలేక 7-30కి ఎగరటం మొదలు పెట్టాయి, మాకోసమే ఆగాయా అన్నట్లు. అమెరికాలో అంతమంది జనాన్ని ఒకచోట అక్కడే చూశాను. లక్షల్లో వున్నారు. అంతమంది జనం వున్నా ఎక్కడా తొక్కిడిగానీ, అన్ని వేల కార్లు పార్కయినా ఎక్కడా ఏ ఇబ్బందిగానీ లేనంత విశాల ప్రదేశం. నాకంతకుముందు ఈ ఉత్సవం గురించి తెలియదు. అక్కడకి వెళ్ళాక చూశాను. 50 బెలూన్లు ఎగురవేస్తారని. ఇంతేనా అని నిరుత్సాహపడ్డాను. సరే వచ్చాంకదా చూద్దామని వెళ్ళి ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపడ్డాను. అంతేకాదు మైదానంలో పెద్ద పెద్ద టెంట్లు వేసేముందు కింద పడేసినట్లున్నాయి బెలూన్లు. అమ్మో ఇంత పెద్దవా అని ఆశ్చర్యపోయాను. 7-30కి ఒక్కొక్క బెలూన్ లో గాలినింపటం ప్రారంభమయింది. కిందపడున్న గుడారాలు ఒక్కొక్కటీ రంగు రంగుల పెద్ద పెద్ద ఆకారాలని సంతరించుకుని నెమ్మదిగా గాలిలోకి ఎగురుతుంటే...ఓహ్...ఆ దృశ్యం అద్భుతం. ఒక్కొక్క బెలూన్ లో ఒకరినుంచి నలుగురుదాకా మనుషులు కింద వేళ్ళాడుతున్న బుట్టలలాంటి వాటిలో వున్నారు.

ఏభై బెలూన్లు ఒకటి తర్వాత ఒకటి గాలిలోకి ఎగిరి ఆకాశంలో గుంపుగా ప్రయాణించాయి. ఒక గంట తర్వాత తిరిగి అక్కడికే వస్తాయిట. అప్పుడు స్కై డైవింగ్ వగైరా విన్యాసాలో పోటీలు కూడా వున్నాయిట. అంత సమయం లేక, కొంత దూరం ఆకాశంలో ప్రయాణిస్తున్న బెలూన్లను కారులో వెంబడిస్తూ, ఇంటికి చేరాం. ఆ అద్భుత దృశ్యాలు మీకోసం మా కెమేరాలో బంధించి తెచ్చాం॥చూడండి।



5 comments:

Rani said...

beautiful photos. thanks for sharing lakshmi garu :) i have been waiting to see one of these festivals.

భావన said...

చాలా బాగున్నాయి లక్ష్మి గారు ఇక్కడ వుండే మా కంటే మీరే ఎక్కువ చూసేస్తున్నట్లు వున్నారు... :-) మీ దగ్గర నుంచి ఇంకా కబుర్లకోసం చూస్తుంటాము :-)

Raj said...

ఫోటోలు బాగున్నాయి.

cbrao said...

చిత్రాలు, మాటలు రెండూ బాగున్నాయి. వీడియో కూడా తీసారా? Word verification may be removed.

psmlakshmiblogspotcom said...

రాణి, భావన, రాజ్, రావుగారూ,
కృతజ్ఞతలు. రావుగారూ, వీడీయో తీయలేదండీ. మీ సూచన తప్పక పాటిస్తాను.
psmlakshmi